Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా నెక్సాన్ ఫ్రంట్ డిజైన్ మారనుందా? కొత్త గ్రిల్ ఫొటోలు లీక్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌కు కంపెనీ త్వరలోనే కొత్త గ్రిల్ డిజైన్‌ను జోడించనుంది. ఈ మోడల్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటన చేయక ముందే అప్‌డేట్ చేసిన గ్రిల్ వివరాలు లీక్ అయ్యాయి.

కొత్త గ్రిల్ డిజైన్‌తో కూడిన టాటా నెక్సాన్‌ను మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్ ఫొటోను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫ్రంట్ గ్రిల్‌లో ట్రై-యారో డిజైన్ ఉంటుంది. అయితే, కంపెనీ రిలీజ్ చేసిన టీజర్‌లో బై-యారో డిజైన్ ఉంది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే కొత్త డిజైన్‌ను ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త గ్రిల్ డిజైన్ టాప్-ఎండ్ వేరియంట్‌లలో లభించే అవకాశం ఉంది.
MOST READ:డీలర్‌షిప్‌కు చేరుకున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ.. డెలివరీస్ ఎప్పుడో తెలుసా !

ఈ కొత్త గ్రిల్ డిజైన్‌లో తెలుపు రంగులో ఉన్న ఏడు ట్రై-యారో డీటేల్స్‌ను బై-యారోలతో రీప్లేస్ చేశారు. కొత్త గ్రిల్ డిజైన్ అప్‌డేట్ మినహా ఈ ఎస్‌యూవీలో వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో నెక్సాన్‌లో బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ ఎస్‌యూవీలో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్‌ఎల్‌లు), కొత్త ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, రివైజ్డ్ గ్రిల్ మరియు సిల్వర్ ఇన్సర్ట్‌లు మరియు ఫాగ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ వాహనానికి మంచి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.
MOST READ:పోలీసులతో గొడవపడిన జొమాటో డెలివరీ గర్ల్, తర్వాత ఏం జరిగిందంటే ?

ఇంటీరియర్స్‌లో, కొత్త ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్‌ని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:స్కోడా సూపర్బ్ స్పోర్ట్ లైన్ సెడాన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ‘ఎకో', ‘సిటీ' మరియు ‘స్పోర్ట్' అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.12.70 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త గ్రిల్ అప్‌డేట్ కారణంగా ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.
MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

టాటా నెక్సాన్ కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా నెక్సాన్ గ్రిల్‌లో కొత్త డిజైన్ అప్‌గ్రేడ్ బహుశా ఇది బ్రాండ్ యొక్క ఉత్పత్తి జీవితచక్ర నవీకరణలో ఒక భాగం కావచ్చు. టాటా నెక్సాన్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యువి300, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్ మరియు ఇటీవలే విడుదలైన టొయోటా అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.