భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా మోటార్స్ తన నెక్సాన్ కాంపాక్ట్-ఎస్‌యూవీ మోడల్ లైనప్‌కు కొత్త వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇప్పుడు ఎక్స్‌ఎమ్(ఎస్) రూపంలో కొత్త వేరియంట్‌తో వస్తుంది, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది.

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇప్పుడు కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) ట్రిమ్పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 8.36 లక్షలు. అదే విధంగా డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 10.30 లక్షల వరకు ఉంటుంది(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Variant Petrol Diesel
XM (S) Manual ₹8.36 Lakhs ₹9.70 Lakhs
XMA (S) AMT ₹8.96 Lakhs ₹10.30 Lakhs
భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) ట్రిమ్ మోడల్ వేరియంట్ లైనప్‌లో బేస్ ‘ఎక్స్‌ఇ' మరియు ‘ఎక్స్‌ఎమ్' వేరియంట్‌లకు పైన ఉంటుంది. కొత్త నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ ఫీచర్‌ ఉన్న ఈ విభాగంలో అత్యంత సరసమైన మోడళ్లలో ఇది ఒకటి.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అదనంగా కాకుండా ఇతర పరికరాలతో పాటు వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ దాని స్టాండర్డ్ ‘ఎక్స్‌ఎమ్' ట్రిమ్ నుండి అన్ని ఫీచర్లతో ముందుకు వెళ్తుంది. వీటిలో కొన్ని ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, కనెక్ట్‌నెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు (ఎకో, సిటీ & స్పోర్ట్), హిల్-హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు ఇతరుల హోస్ట్ కూడా ఉన్నాయి.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో పనిచేస్తుంది. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ 118 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

అదే విధంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి మరియు 260 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడ్డాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్లు జతచేయబడి ఉంటాయి.

MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్‌కార్న్ [వీడియో]

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మా వినియోగదారులకు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యుత్తమ ఫీచర్స్ కూడా తక్కువ ధరకు పొందటానికి వీలు కల్పిస్తున్నాము అన్నారు.

భారత్‌లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్(ఎస్) వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా నెక్సాన్ వాహనదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పించడమే కాకుండా ఇందులో అత్యాధునిక ఫీచర్స్ కూడా అందిస్తుంది. తద్వారా మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్‌ను అదనంగా ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

Most Read Articles

English summary
New Tata Nexon XM(S) Variant Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, September 2, 2020, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X