Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హారియర్ ఎస్‌యూవీలో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేయనున్న టాటా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'టాటా హారియర్'లో కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2020 టాటా హారియర్ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్ మరియు ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటుగా అనేక ఇతర మార్పులతో తయారైంది.

టాటా హారియర్ ఎస్‌యూవీలో ప్రస్తుతం ఎనిమిది వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాన్యువల్ వేరియంట్లు ఐదు మరియు ఆటోమేటిక్ వేరియంట్లు మూడు ఉన్నాయి. అయితే, టీమ్‌బీహెచ్‌పీ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, టాటా హారియర్ ఎస్‌యూవీలో కంపెనీ ఈ ఎనిమిది వేరియంట్లకు అదనంగా మరో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ రెండు వేరియంట్లు ఎక్స్‌టిఏ మరియు ఎక్స్‌టి+ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌టి వేరియంట్ మరియు ఎక్స్‌జెడ్ వేరియంట్‌ల మధ్యలో కొత్త ఎక్స్‌టి+ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్‌లో పానరోమిక్ సన్‌రూఫ్ ఉంటుందని సమాచారం. ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్.
MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

ఇకపోతే, ప్రసుతం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్న టాటా హారియర్ ఎక్స్ఎమ్ఏ, ఎక్స్‌జెడ్ఏ మరియు ఎక్స్‌జెడ్ఏ+ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా రాబోయే ఎక్స్‌టిఏ వేరియంట్‌ను ఎక్స్ఎమ్ఏ మరియు ఎక్స్‌జెడ్ఏ వేరియంట్ల మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త మాన్యువల్ వేరియంట్ ఎక్స్‌టి+ మాదిరిగా కాకుండా, ఎక్స్‌టిఏలో పానరోమిక్ సన్‌రూఫ్ ఉండకపోవచ్చని సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో టాటా హారియర్ మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.13.69 లక్షల నుండి రూ.18.95 లక్షల మధ్యలో ఉండగా, ఆటోమేటిక్ వేరయంట్ల ధరలు రూ.16.25 లక్షల నుండి రూ.20.25 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
MOST READ:బహుశా ఇది దేశంలో మొదటి రిమోట్ కంట్రోల్ బోట్.. చూసారా ?

ప్రస్తుతమున్న వేరియంట్ల మధ్యలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రెండు వేరియంట్‌లను పరిశీలిస్తే ఎక్స్‌టి+ మరియు ఎక్స్‌టిఏ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉండొచ్చని అంచనా. టాటా హారియర్ కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి సింగిల్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. మరి కొత్త వేరియంట్లు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్‌తో వస్తాయో లేదో చూడాలి.

ఇక ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, టాటా హారియర్‌లో 2.0 లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.
MOST READ:ఈ టయోటా ఇన్నోవాలోని ప్రయాణీకులకు చాలా లక్కీ ; ఎందుకో చూడండి !

టాటా హారియర్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, 17-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు తొమ్మిది స్పీకర్లతో కూడిన జెబిఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌లకు మద్దతు ఇచ్చే 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 7-ఇంచ్ కలర్ ఎమ్ఐడి, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఈ ఎస్‌యూవీలో ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా హారియర్‌లో హిల్ స్టార్ట్ అసిస్ట్, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలెర్ట్ మరియు హిల్-డీసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

టాటా హారియర్ కొత్త వేరియంట్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ తమ హారియర్ ఎస్‌యూవీలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఒక్కొక్క కొత్త వేరియంట్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త వేరియంట్లు విడుదలైతే హారియర్ మొత్తం ఆరు మ్యాన్యువల్, నాలుగు ఆటోమేటిక్ వేరియంట్లలో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీలోని కొన్ని వేరియంట్‌ల మధ్య ధర వ్యత్యాసాన్ని పూరించడానికి కంపెనీ ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.