భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారెవరో తెలుసా!

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం చెందిన కార్లలో టెస్లా ఒకటి. ఇది ఇప్పటిదాకా ఇండియన్ మార్కెట్లో అధికారికంగా అందుబాటులో లేదు. కానీ ధనవంతులు మరియు వాహనప్రియులు ఈ వాహనాలను వినియోగిస్తున్నారు. విదేశాలలో ఉన్న భారతీయులు ఈ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ భారతదేశంలో ఈ టెస్లా కారుని ఉపయోగిస్తున్న వారు ఎవరు అనే వివరాలను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ టెస్లా కారుని ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, ఎస్సార్ CEO ప్రశాంత్ రుయా, యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ మరియు మిస్ ఇండియా పూజ బాత్రా వంటి వారు ఈ వాహనాలను వినియోగిస్తున్నారు.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

ముఖేష్ అంబానీ

టెస్లా మోడల్ ఎస్ 100 డి

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ గ్యారేజ్ లో చాలా హై లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ కుల్లినన్, ఫాంటమ్ ఇడబ్ల్యుబి, బెంట్లీ బెంటెగా వంటి మరెన్నో ఖరీదైన సూపర్ కార్లు ఉన్నాయి. గత సంవత్సరం టెస్లా మోడల్ ఎస్ కూడా అంబానీ గ్యారేజ్ లో చేరింది.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

టెస్లా మోడల్ ఎస్ 100 డి లో చాలా పవర్ పుల్ చక్రాలను కలిగి ఉంటాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 423 పిఎస్ శక్తిని మరియు 660 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4.3 సెకన్ల కాలంలో చేరుకుంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో చేరుకోగలదు. టెస్లా మోడల్ ఎస్ 100 డి ఒక ఛార్జిపై దాదాపు 450 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

ప్రశాంత్ రుయా

టెస్లా మోడల్ ఎక్స్

భారతదేశంలో టెస్లా కారుని సొంతం చేసుకున్న మొదటి భారతీయుడు ప్రశాంత్ రుయా. ఇతడు ఎస్సార్ సంస్థ యొక్క CEO. యితడు 2017 వ సంవత్సరంలో టెస్లా మోడల్ ఎక్స్ ని పైవేటుగా దిగుమతి చేసుకున్నాడు. ఈ కార్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒక మోటార్ ముందు చక్రాలకి శక్తినిస్తుంది. రెండవ మోటార్ వెనుక చక్రాలకు ఉపయోగపడుతుంది.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

టెస్లా మోడల్ ఎక్స్ లో రెండు మోటార్లు 750 bhp శక్తిని 967 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4.8 సెకన్ల కాలంలో చేరుకుంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ 250 కిలోమీటర్లు.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

రితేష్ దేశ్ముఖ్

టెస్లా మోడల్ ఎక్స్

నటుడు రితేష్ దేశ్ముఖ్ తన భార్య జెనీలియా డిసౌజా నుంచి టెస్లా మోడల్ ఎక్స్ ని గిఫ్ట్ గా పొందాడు. ఇది ఎరుపురంగులో ఉంటుంది. అప్పటిదాకా ఇండియాలో ఎరుపు రంగు టెస్లా లేదు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ నుంచి ముందు భాగంలో 259 పిఎస్ మరియు వెనుక భాగంలో 503 పిఎస్ ని పొందుతుంది.

భారతదేశంలో టెస్లా కార్లను ఉపయోగించేవారు ఎవరో తెలుసా!

పూజా బాత్రా

టెస్లా మోడల్ 3

మిస్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాక్టర్ పూజా బాత్రా టెస్లా మోడల్ 3 కారుని కలిగి ఉంది. ఈ మోడల్ కు నాలుగు డోర్ల సెడాన్ ఉంటుంది. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రాయనిస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 సెకన్ల కాలంలో చేరుకుంటుంది. ఇది ఒక చార్జిపై 386 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Most Read Articles

English summary
India’s famous Tesla owners. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X