టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) గడచిన నెల చివరిలో తమ సరికొత్త ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో దీని ధరలు రూ.16.26 లక్షల (బేస్ జిఎక్స్ వేరియంట్) నుండి ప్రారంభమై రూ.24.33 లక్షల (టాప్-ఎండ్ జెడ్‌ఎక్స్ వేరియంట్) వరకూ ఉన్నాయి.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

కొత్త 2020 టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ జి, జి+, జిఎక్స్, విఎక్స్ మరియు జెడ్ఎక్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్‌ను కంపెనీ తొలిసారిగా 2016లో మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని ప్రధానమైన మార్పులు చేసి కంపెనీ రెండవ తరం క్రిస్టాను మార్కెట్లో అందిస్తోంది.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

టొయోటా ఇన్నోవా భారత మార్కెట్లోని ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్) విభాగంలో చాలా కాలం నుండి సెగ్మెంట్ లీడర్‌గా కొనసాగుతోంది. ఈ విభాగంలో ఇన్నోవా గట్టి పోటీ ఇచ్చేందుకు దేశీయ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పివిలో ఇన్నోవా క్రిస్టా ఒకటిగా ఉంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సూపర్ ప్లాన్.. అదేంటో తెలుసా ?

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

మొదటి తరం టొయోటా ఇన్నోవాను 2005లో తొలిసారిగా మార్కెట్లో విడుదల చేశారు. ఆ తర్వాత ఇందులో ఇన్నోవా 'క్రిస్టా' పేరుతో రెండవ తరం మోడల్ 2016లో విడుదల చేశారు. గడచిన 15 సంవత్సరాల కాలంలో భారతదేశంలో 8.8 లక్షలకు పైగా టొయోటా ఇన్నోవా కార్లు అమ్ముడుపోయాయి.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

కాగా.. టొయోటా కిర్లోస్కర్ ఇప్పుడు తమ కొత్త 2020 ఇన్నోవా క్రిస్టా ఫేస్ లిఫ్ట్ మోడల్ కోసం పూర్తి స్థాయి యాక్ససరీలను ప్రవేశపెట్టింది. ఈ అఫీషియల్ యాక్ససరీలతో కస్టమర్లు ఇప్పుడు తమ అభిమాన టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి మరింత అందంగా మరియు విలాసవంతంగా మార్చుకోవచ్చు.

MOST READ:ఆడి క్యూ 2 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది..చూసారా !

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

టొయోటా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ యాక్ససరీల జాబితాను లిస్ట్ చేశారు. టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్స్ అప్‌గ్రేడ్స్ కోసం అనేక రకాల యాక్ససరీలను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఎక్స్టీరియర్ యాక్ససరీస్‌లో భాగంగా, కొత్త రూఫ్ రెయిల్స్, ఎక్స్‌ట్రా లగేజ్ కోసం రూఫ్ ర్యాక్, విండోస్ కోసం సైడ్ వైజర్స్, క్రోమ్ డోర్ హౌసింగ్, సైడ్ పి మోల్డ్, సైడ్ స్టెప్, వీల్ ఆర్చ్ మోల్డింగ్ మరియు బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఇవే కాకుండా, బ్యాక్ ప్రొఫైల్ రూపాన్ని మరింత మెరుగుపరచేందుకు కంపెనీ రియర్ రూఫ్ స్పాయిలర్ గార్నిష్‌ను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, ఇంటీరియర్ సౌకర్యాలను మెరుగుపరచేందుకు కూడా యాక్ససరీలను అందిస్తోంది. ఇందులో వెల్‌కమ్ డోర్ ల్యాంప్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉన్నాయి.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఇతర యాక్ససరీల విషయానికొస్తే, టొయోటా తమ ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం డిజిటల్ రికార్డర్ మరియు టైర్ ప్రెజర్ మొనిటర్ సిస్టమ్ వంటి యాక్ససరీలను కూడా అందిస్తోంది. కాగా.. మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ అందుకున్న ఇన్నోవా క్రిస్టా డిజైన్ పరంగా అనేక మార్పులను కలిగి ఉంది.

MOST READ:కేవలం 10 నిమిషాల్లో మొత్తం అమ్ముడైన జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఇందులో పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేసిన కొత్త ట్రాపెజోయిడల్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్ చుట్టూ క్రోమ్ గార్నిష్ ఉంటుంది, ఇది హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లోకి అలాగే ఇరువైపులా చొప్పించినట్లుగా అనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ ఇప్పుడు ట్రైయాంగిల్ హౌసింగ్ ఉంటుంది, అలాగే దీని ఫ్రంట్ బంపర్‌ను కూడా రీడిజైన్ చేశారు.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఫ్రంట్ ఎండ్‌లో మార్పులతో పాటుగా, కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త గ్లోస్ బ్లాక్ స్పాయిలర్ మరియు రెండు చివర్లలో స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి. కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాలో ఇప్పుడు స్పార్క్లింగ్ బ్లాక్ క్రిస్టల్ షైన్ అనే కొత్త పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజన్ మరియు గేర్‌బాక్స్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.4-లీటర్ డీజిల్ ఇంజన్లనే ఉపయోగించారు. ఇవి రెండూ ఇటీవలే బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అఫీషియల్ యాక్ససరీలు

ఇందులోని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 164 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఫైవ్-స్పీడ్ మాన్యువల్ మరియు సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో లభిస్తుంది. ఇకపోతే ఇందులోని 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 343 ఎన్ఎమ్ టార్క్ (మ్యాన్యువల్ గేర్‌బాక్స్) మరియు 360 ఎన్ఎమ్ టార్క్ (సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్)ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Introduced New Range Of Accessories For 2020 Innova Crysta Facelift, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X