టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న యారిస్ సెడాన్‌లో కంపెనీ ఓ కొత్త టీజర్‌ను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తుంటే, కంపెనీ ఓ సరికొత్త టొయోటా యారిస్ కారును కానీ లేదా ప్రస్తుతం ఉన్న యారిస్‌లో ఓ శక్తివంతమైన వేరియంట్‌ను కానీ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

టొయోటా విడుదల చేసిన టీజర్ వీడియోలో "ఏ పవర్‌ట్రిప్, ఇన్‌సైడ్ అండ్ అవుట్" అనే క్యాప్షన్‌తో యారిస్ హెడ్‌లైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌ను కంపెనీ హైలైట్ చేసింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తున్న రానున్న కొత్త టొయోటా యారిస్ సెడాన్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి కంపెనీ ఈ కొత్త వేరియంట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోయినప్పటికీ, బహుశా ఇది మైనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ కానీ లేదా లిమిటెడ్ ఎడిషన్ కానీ అయి ఉండొచ్చని తెలుస్తోంది. టొయోటా యారిస్ టీజర్ క్యాప్షన్ ప్రకారం, కొత్త యారిస్ మరింత శక్తివంతమైన ఇంజన్‌తో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

ఈ కొత్త ఇంజన్, టొయోటా అభివృద్ధి చేస్తున్న చిన్నపాటి హైబ్రిడ్ ఇంజన్లలో ఒకటి కావచ్చని తెలుస్తోంది.

టొయోటా ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల కోసం కొత్త తరం యారిస్ సెడాన్ (అక్కడి మార్కెట్లలో టొయోటా వియోస్ అని పిలుస్తారు)ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యారిస్ సెడాన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం యారిస్ కారులో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్‌, లెక్సస్ సిగ్నేచర్ ‘స్పిండిల్-గ్రిల్' నుండి ప్రేరణ పొందిన కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ డ్యామ్‌లతో ఇది సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అయితే, టొయోటా ఇండియా విడుదల చేసిన టీజర్‌లో ప్రస్తుత-తరం మోడల్ హెడ్‌ల్యాంప్‌లు మరియు గ్రిల్‌ను హైలైట్ చేయటాన్ని చూస్తుంటే ఇది కొత్త 2021 ఫేస్‌లిఫ్టెడ్ యారిస్ (వియోస్) కాకపోవచ్చని తెలుస్తోంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

టొయోటా ఇటీవలే దేశీయ విపణిలో యారిస్ సెడాన్ ధరలను పెంచింది మరియు కొన్ని ఇందులో వేరియంట్లను కూడా తొలగించింది. వేరియంట్‌ను బట్టిన ఈ మోడల్ ధరలు రూ.1000 నుండి రూ.1.68 లక్షల మధ్యలో పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత, టొయోటా యారిస్ ఇప్పుడు రూ.8.86 లక్షల నుండి రూ.14.30 లక్షల మధ్యలో అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

టొయోటా యారిస్ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, రూఫ్-మౌంటెడ్ ఎయిర్-వెంట్స్, యాంబియంట్ ఇల్యూమినేషన్, 8-వే అడ్జస్టబల్ పవర్ డ్రైవర్ సీట్ మరియు గెశ్చర్ కంట్రోల్స్‌తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

భద్రతా ఫీచర్ల విషానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్ కట్ ఆఫ్‌తో కూడిన సౌర శక్తిని గ్రహించే ఫ్రంట్ విండ్‌షీల్డ్, గ్లాస్-హై సోలార్ ఎనర్జీ అబ్జార్బింగ్ (హెచ్‌ఎస్‌ఇఎ) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఫీచర్లు ఉన్నాయి.

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

ప్రస్తుతం టొయోటా యారిస్ కేవలం ఒకే ఒక సింగిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ఆగస్ట్ నెలలో సుజుకి మోటార్‌సైకిల్స్ అమ్మకాలు.. ఇలా ఉన్నాయి

టొయోటా యారిస్ టీజర్ విడుదల; ఇదేమైనా స్పెషల్ ఎడిషన్ వేరియంటా?

టొయోటా యారిస్ టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా ఇటీవలే లిమిటెడ్ ఎడిషన్ ఫార్చ్యూనర్ టిఆర్‌డి మోడల్‌ని మార్కెట్లో విడుదల చేసింది మరియు ఈ నెలలో ఎప్పుడైనా తమ సరికొత్త అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని కూడా విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ అమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఇప్పుడు యారిస్‌లో కూడా స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Toyota has launched a new teaser of its Yaris sedan on its social media platform. The company seems to be working on either a minor facelift model or could be a limited edition variant of the sedan that will be launched soon in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X