పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్, భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్లను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెరుగుదల రూ.5,000 నుండి రూ.12,000 వరకు ఉంది.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ పోలో

ముందుగా బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.5,000 నుంచి రూ.8,000 మధ్యలో ధరలను పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత పోలో ధరలు ఇప్పుడు రూ.5.87 లక్షల నుండి రూ.9.67 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో రెండు ఆటోమేటిక్ వేరియంట్‌లు ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలో రెండు ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఇందులోని 1.0-లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ 76 బిహెచ్‌పి పవర్‌ను మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్‌లోని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 110 బిహెచ్‌పి మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులోని కొన్ని ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వాయిస్ కమాండ్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, ఏబిఎస్, బహుళ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:వైద్య వృత్తిని విడిచిపెట్టి ఆటో డ్రైవర్‌గా మారిన గవర్నమెంట్ డాక్టర్, ఎందుకో తెలుసా ?

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఫోక్స్‌వ్యాగన్ వెంటో విషయానికి వస్తే, ఈ సెడాన్‌పై కంపెనీ రూ.7,000 నుంచి రూ.9,000 మధ్యలో ధరలను పెంచింది. అయితే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన హైలైన్ ప్లస్ ఏటి ధరను మాత్రం అనూహ్యంగా రూ.30,000 మేర తగ్గించారు.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

వెంటో కారులోని కంఫర్ట్‌లైన్ (నాన్-మెటాలిక్) మోడళ్లు మరియు హైలైన్ మాన్యువల్ మోడళ్ల ధరలను మాత్రం కంపెనీ పెంచలేదు. ఫోక్స్‌వ్యాగన్ వెంటో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది మరియు మార్కెట్లో ప్రస్తుతం వీటి ధరలు రూ.8.93 లక్షల నుండి రూ.12.99 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:బొలెరో న్యూ వేరియంట్ లాంచ్ చేసిన మహీంద్రా : దీని ధర ఎంతో తెలుసా ?

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ వెంటోలోని అన్ని వేరియంట్లు 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్‌తో లభిస్తాయి. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కొత్త బిఎస్6 వెంటో సెడాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో డీజిల్ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

వెంటో కారులోని కొన్ని ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈకారులో ఏబిఎస్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్

ఫోక్స్‌వ్యాగన్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టిగువాన్ ఆల్‌స్పేస్‌ ధరను కంపెనీ రూ.12,000 మేర పెంచింది. ఈ మోడల్ సింగిల్ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు వేరియంట్ రూపంలో అందిస్తున్నారు. పెంచిన ధర తర్వాత ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ధర రూ.33.24 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)కు చేరుకుంది.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న టి-రాక్ ఎస్‌యూవీ మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడై పోయిందని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో టి-రాక్ కోసం బుకింగ్‌లు స్వీకరించడాన్ని కూడా కంపెనీ నిలిపివేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంత పెరిగాయంటే..

ఫోక్స్‌వ్యాగన్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోక్స్‌వ్యాగన్ తమ ప్రోడక్ట్ లైనప్‌లో బిఎస్6 మోడళ్లను పరిచయం చేసిన తర్వాత తొలిసారిగా అన్ని మోడళ్ల ధరలను పెంచింది. అయితే, వెంటో సెడాన్‌లోని టాప్-ఎండ్ వేరియంట్ ధరను మాత్రం కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ధరల పెరుగుదల స్వల్పంగానే ఉన్న నేపథ్యంలో, ఇది కంపెనీ అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపబోదని తెలుస్తోంది.

Most Read Articles

English summary
German automaker, Volkswagen, has increased the prices of its vehicle line-up in the Indian market. The price increase varies between Rs 5,000 and Rs 12,000, depending on the model and the variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X