టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

జర్మన్ బ్రాండ్ అయిన వోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లో త్వరలో వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఎస్‌యువిని విడుదల చేయనుంది. వోక్స్ వ్యాగన్ విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

వోక్స్ వ్యాగన్ 2020 మార్చి 18 న టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ ప్రారంభించడానికి ముందే ఈ ఎస్‌యువి యొక్క స్పెక్స్, ఫీచర్స్, కలర్ ఆప్సన్ వంటి వాటిని వెల్లడించింది.

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

వోక్స్ వ్యాగన్ రిలీజ్ చేసిన ఈ చిత్రాలను బట్టి, ఇండియన్ మార్కెట్లో ప్రవేశించే ఈ బ్రాండ్ 1.5 లీటర్ పెట్రో ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 150 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వోక్స్ వ్యాగన్ టి-రాక్ గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఎస్‌యువి యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు మరియు టైల్లైట్స్, లెదర్ అప్హోల్స్టర్డ్ సీట్లు మరియు పుల్లీ-డిజిటల్ కాక్‌పిట్‌తో సహా చుట్టూ ఎల్‌ఈడీ లైటింగ్ ఇందులో ఉంటాయి.

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

అదే విధంగా వోక్స్ వ్యాగన్ టి-రాక్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న వోక్స్ వ్యాగన్ టి-రాక్ పెర్ల్, కుర్కుమా ఎల్లో / బ్లాక్, ఎనర్జిటిక్ ఆరెంజ్ / బ్లాక్, ప్యూర్ వైట్ / బ్లాక్, రావెన్న బ్లూ / బ్లాక్ మరియు ఇండియం గ్రే / బ్లాక్ వంటి ఆరు కలర్ ఎంపికలలో వస్తుంది.

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

ఈ టి-రాక్ ఎస్‌యువి మొదట కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మార్గం ద్వారా భారత మార్కెట్లోకి దిగుమతి చేయనున్నారు. అంటే జర్మనీ కార్ల తయారీదారు దేశంలోని ఎస్‌యువి నుండి భారీ పరిమాణ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకోవడం లేదు ఎందుకంటే ఇది భారతదేశంలో టి-రాక్ యొక్క ప్రీమియం ధరలకు అనువదిస్తుంది. ఈ టి-రాక్ ఎస్‌యువి ధర రూ. 25 లక్షలు (ఎక్స్‌-షోరూమ్).

టి-రాక్ ఎస్‌యువిని ప్రారంభించనున్న వోక్స్ వ్యాగన్.. ఎప్పుడంటే.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్ వ్యాగన్ టి-రాక్ ఇండియన్ మార్కెట్ కోసం విడుదల కానున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తి. ఈ కొత్త వోక్స్ వ్యాగన్ టి-రాక్ భారతదేశంలో ఒకసారి ప్రారంభించిన తరువాత జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Source: Team bhp

Most Read Articles

English summary
Volkswagen T-Roc India Specs, Features & Colour Options Revealed: Will Rival The Jeep Compass. Read in Telugu.
Story first published: Tuesday, March 3, 2020, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X