వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో, భారత మార్కెట్లో విక్రయించిన వోల్వో వి90 క్రాస్ కంట్రీ మోడల్‌ను డిస్‌కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ మోడల్‌ను తొలగించి వేసింది. వోల్వో వి90 మోడల్‌ను తొలిసారిగా జూలై 2017లో మార్కెట్లో విడుదల చేశారు.

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో అందిస్తున్న ఎస్90 మోడల్‌కి వాగన్ వెర్షనే ఈ వి90. వోల్వో ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్ నుండి వి90 క్రాస్ కంట్రీ మోడల్‌ను తొలగించడాన్ని చూస్తుంటే, ఇకపై భారత మార్కెట్లో ఈ మోడల్ డిస్‌కంటిన్యూ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం, వోల్వో ఇండియా, దేశీయ మార్కెట్లో నాలుగు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది.

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో వి90 క్రాస్ కంట్రీ మోడల్ డిస్‌కంటిన్యూ అయినప్పటికీ, ఇందులోని సెడాన్ వెర్షన్ ఎస్90 మాత్రం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం వోల్వో లైనప్‌లో ఎక్స్‌సి40, ఎక్స్‌సి60 మరియు ఎక్స్‌సి90 ఎస్‌యూవీలు ఉన్నాయి.

MOST READ:కార్ బోనెట్‌పై పడ్డ పోలీస్.. అలాగే డ్రైవ్స్ చేసిన కార్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందంటే ?

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో వి90 క్రాస్ కంట్రీ మోడల్‌లో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 235 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. వోల్వో వి90 క్రాస్ కంట్రీ ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యూడి) మరియు ఎయిర్ రైడ్ సస్పెన్షన్ సెటప్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో వి 90 క్రాస్ కంట్రీ ముందు వైపు చూడటానికి ఎస్90 సెడాన్ మాదిరిగానే కనిపిస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్‌లో చిన్న మెటాలిక్ ఇన్సర్ట్‌లు ఉంటాయి మరియు డిఆర్‌ఎల్‌లతో కూడిన 'థోర్ హామర్' ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. సైడ్ డిజైన్‌లో వి90 క్రాస్ కంట్రీ ఒక స్టేషన్ వాగన్‌లా అనిపిస్తుంది, ఇందులో 20 ఇంచ్ వీల్స్, ప్లాస్టిక్ కవర్డ్ వీల్ ఆర్చెస్, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

ఈ కారు వెనుక వైపున, వాగన్ ట్రంక్ 590 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపల, 12.3 ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డాష్‌బోర్డ్ మరియు డోర్ ఇన్సెర్ట్స్‌పై ఉడెన్ ట్రిమ్స్ మొదలైనవి ఉంటాయి. వోల్వో వి90 క్రాస్ కంట్రీలో ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు మరియు మసాజ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో వి90 క్రాస్ కంట్రీలో పార్కింగ్ అసిస్ట్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సిటీ సేఫ్టీ, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు ఏడు ఎయిర్‌బ్యాగులు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సెమీ అటానమస్ డ్రైవింగ్ ఫీచర్ కూడా ఉంది.

MOST READ:భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ XM + వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

వోల్వో ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో తమ కొత్త తరం ఎస్90 మరియు వి90 మోడళ్లను విడుదల చేసింది. మరి ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకే పాత మోడల్‌ను నిలిపివేశారా లేదా వి90 మోడల్‌ను పూర్తిగా మార్కెట్ నుండి తొలగించారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

వెబ్‌సైట్ నుండి మాయమైన వోల్వో వి90 క్రాస్ కంట్రీ; డిస్‌కంటిన్యూ అయిందా?

భారత వెబ్‌సైట్ నుండి వోల్వో వి90 క్రాస్ కంట్రీ మోడల్‌ను తొలగించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వోల్వో వి90 క్రాస్ కంట్రీ నిజంగా ఓ అద్భుతమైన వాహనం. డిజైన్, ఫీచర్స్ మరియు సేఫ్టీ పరంగా ఇది ఉత్తమమైన కారు. కాకపోతే, భారత మార్కెట్లో దీని అమ్మకాలు నత్తనడక సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
The Volvo V90 Cross Country was launched in July 2017 in India and it was the wagon version of the S90. However, Volvo India has recently removed the V90 Cross Country from its official Volvo India website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X