22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే?

వాహన తయారీదారులు అప్పుడప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవడం మనం ఇది వరకే చాలా చూసాం. ఈ విధమైన సమస్యలు ఎదురైనప్పుడు కంపెనీ రీకాల్ ప్రకటిస్తుంది.

ఇటీవల కాలంలో స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో 2006 మరియు 2019 మధ్య నిర్మించిన కార్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 మిలియన్ (22 లక్షల) కార్ల అమ్మకాలను జరిపింది. ఈ కార్లలో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్‌ల సమస్య తలెత్తడం వల్ల ఈ కార్లను తిరిగి కంపెనీ రీకాల్ ప్రకటించింది. దీనికి సంబంధించిన కొన్ని నివేదికల ప్రకారం వోల్వో ఇంత పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేయడం ఇదే మొదటి సారి.

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

వోల్వో కంపెనీకి చెందిన వి 60, వి 70, ఎక్స్‌సి 60 కార్లు లోపభూయిష్టంగా ఉన్నాయి. వోల్వో ఎస్ 60, ఎస్ 60 ఎల్, ఎస్ 60 సిసి, వి 60 సిసి, ఎక్స్‌సి 70, ఎస్ 80, ఎస్ 80 ఎల్‌లతో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

అదృష్టవశాత్తూ ఈ సమస్యల వల్ల వోల్వో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాలేదు. వోల్వో కార్లు ప్రపంచంలో ప్రయాణికుల భద్రతకు ప్రసిద్ధి చెందాయి.

MOST READ:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టూరిస్ట్ పర్మిట్ రూల్స్, ఏంటో తెలుసా ?

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

వినియోగదారులు వోల్వో డీలర్‌షిప్‌లను సంప్రదించి సమస్యను ఉచితంగా పరిష్కరించుకోవాలని కంపెనీ ప్రకటించింది. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్‌లకు అనుసంధానించబడిన స్టీల్ కేబుల్స్‌లో లోపం సీట్ బెల్ట్‌ను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్‌తో సమస్యను సరిదిద్దడానికి వోల్వో లగ్జరీ కార్లను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేశారు.

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

వోల్వో యొక్క ఎక్స్‌సి 40, ఎక్స్‌సి 60, ఎక్స్‌సి 90, ఎస్ 60, ఎస్ 90 మరియు వి సిరీస్ కార్లు ఈ సమస్యను కనుగొన్నాయి. ఈ లోపాలు ఉన్న కార్లు క్రాష్ అవుతాయి. కాబట్టి వోల్వో సంస్థ ఈ కార్లలోని ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను నియంత్రించడానికి సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించింది.

MOST READ:త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

వోల్వో ఇప్పుడు తన కారు సీటు బెల్టులను సమస్యను పరిష్కరించింది. ప్రయాణికుల భద్రతా విషయంలో సీట్ బెల్ట్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాహనంలోని సీట్ బెల్టుల వల్ల ప్రయాణికులు భయంకరమైన ప్రమాదాలను నుంచి కూడా ప్రాణాలతో బయటపడిన చాల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏది ఏమైనా సీట్ బెల్ట్ ప్రయాణికుల రక్షణకు ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

వోల్వో కంపెనీ పటిష్టమైన భద్రత చర్యలను కల్పిస్తూ సున్నా మరణాల రేటుని సాధించాలోని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణీకుల భద్రతకు సీట్‌బెల్ట్ ప్రధానమైన వాటిలో ఒకటి మరియు అది సరిగ్గా పనిచేయకపోతే, తక్కువ వేగంతో కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే కంపెనీ కార్లను రీకాల్ చేయడం జరిగింది.

MOST READ:మారుతి వితారా బ్రెజ్జాలో మరో కొత్త ఫీచర్, ఏంటో తెలుసా ?

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo to recall 22 lakh vehicles globally over front seatbelt issue. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X