జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

అమెరికాకు చెందిన ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ కంపాస్ ఎస్‌యూవీపై డిసెంబర్ 2020లో భాగంగా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై కంపెనీ రూ.2 లక్షల విలువైన ఇయర్-ఎండ్ బెనిఫిట్లను అందిస్తోంది.

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

జీప్ కంపాస్ ఎస్‌యూవీ ప్రస్తుతం ఆరు వేరియంట్లలో లభిస్తుంది, అవి: స్పోర్ట్ ప్లస్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ప్లస్, నైట్ ఈగిల్ మరియు హార్డ్‌కోర్ ట్రైల్‌హాక్. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని ఐదు వేరియంట్లపై కంపెనీ రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ వేరియంట్‌పై కంపెనీ గరిష్టంగా రూ.2.0 లక్షల వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ మరియు యాక్ససరీలు ఉన్నాయి, ఎస్‌యూవీ కొనుగోలు సమయంలో వీటిని పొందవచ్చు.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

డిసెంబర్ 2020 నెలలో చేసిన అన్ని కొనుగోళ్లకు ఆ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్లను పొందాలనుకునే కొనుగోలుదారులు బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా జీప్ డీలర్‌షిప్‌ల నుండి కానీ కంపాస్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

జీప్ కంపాస్‌పై డిస్కౌంట్ మరియు ప్రయోజనాలతో పాటు, ఈ ఎస్‌యూవీ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి కంపెనీ వివిధ రకాల ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది. ఇందులో దీర్ఘకాలిక రుణాలు, స్టెప్-అప్ ఈఎమ్ఐ స్కీమ్, తక్కువ డౌన్ చెల్లింపు ఆఫర్లు, ఆరు ఈజీ ఈఎమ్ఐ స్కీమ్‌లు ఉన్నాయి.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

మార్కెట్లో జీప్ కంపాస్ ధరలు రూ.16.49 లక్షల (స్పోర్ట్ ప్లస్ బేస్ వేరియంట్) నుండి ప్రారంభమై రూ.24.99 లక్షలు (లిమిటెడ్ ప్లస్, టాప్-స్పెక్ స్టాండర్డ్ వేరియంట్) వరకూ ఉన్నాయి. కాగా, ఇందులో హార్డ్‌కోర్ ట్రైల్‌హాక్ వేరియంట్‌ను టాప్-ఆఫ్ ది లైన్‌గా ఆఫర్ చేస్తున్నారు.

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ వేరియంట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.26.80 లక్షలు మరియు రూ.27.60 లక్షలుగా ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు డిస్కౌంట్లకు ముందు మరియు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

ప్రస్తుతం జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కూడా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కాకపోతే, పెట్రోల్ వేరియంట్లు మాత్రం ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా, డీజిల్ ఇంజన్ కోసం ఆప్షనల్ నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

జీప్ ఇండియా డిసెంబర్ 2020 ఆఫర్స్: కంపాస్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్!

ఇదిలా ఉంటే, జీప్ ఇండియా కొత్త సంవత్సరంలో ఓ సరికొత్త కంపాస్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది జనవరి 23వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Year-End Offers On Jeep Compass; Discounts And Benefits Up To Rs 2.0 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X