2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసుదోచిన SUV Force Motors యొక్క కొత్త Force Gurkha. Force Gurkha ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ ఆఫ్-రోడర్‌ SUV ని సెప్టెంబర్ 27 న న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.

2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

Force Gurkha కోసం ఎంతో మంది చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. కంపెనీ ఈ కొత్త Force Gurkha లో అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పుడు కంపెనీ Force Gurkha యొక్క యాక్ససరీస్ వెల్లడించింది. ఇవి వాహనాన్ని మరింత దూకుడుగా కనిపించేలా చేస్తాయి. కంపెనీ వెల్లడించిన ఈ యాక్ససరీస్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

2021 Force Gurkha యాక్సెసరీస్:

 • విండ్‌స్క్రీన్ బార్
 • రూఫ్ క్యారియర్
 • రూప్ రైల్స్
 • వెనుక నిచ్చెన (రియర్ ల్యాడర్)
 • టెయిల్ ల్యాంప్ గ్రిల్
 • అల్లాయ్ వీల్స్ మరియు ఆల్-టెర్రైన్ టైర్లు
 • రెండు అడిషినల్ ఛైల్డ్ సీట్స్
 • 2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  కొత్త 2021 Force Gurkha లో చెట్ల కొమ్మలు మరియు ఇతర శిధిలాల నుండి రక్షణ కోసం ఒక విండ్‌స్క్రీన్ బార్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రా లగేజ్ ఉంచడం కోసం రూఫ్ క్యారియర్, రూప్ రైల్స్ ఉన్నాయి, అంతే కాకూండా ఇందులో రూఫ్ క్యారియర్‌కు సులభంగా యాక్సెస్ చేయడానికి వెనుక భాగంలో ఒక నిచ్చెన కూడా ఉంది.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  ఈ కారు యొక్క ముందు భాగంలో టెయిల్ ల్యాంప్ గ్రిల్, మెరుగైన అల్లాయ్ వీల్స్ మరియు మంచి ఆఫ్-రోడింగ్ కోసం టెర్రైన్ టైర్లతో పాటు పిల్లల కోసం రెండు అదనపు సీట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  2021 Force Gurkha వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది, ఇందులో రెడ్, గ్రీన్, వైట్, ఆరంజ్ మరియు గ్రే కలర్ ఉండనున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  2021 Force Gurkha 3-డోర్ మరియు 4-సీటర్ కాన్ఫిగరేషన్‌తో మార్కెట్లో విడుదల చేయబడుతుంది. ఇందులోని ఇంటీరియర్ బ్లాక్ డాష్‌బోర్డ్‌ను పొందుతాయి మరియు అపోల్స్ట్రే మాత్రం గ్రే కలర్ లో ఉంటుంది. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది రెండవ వరుసలో కెప్టెన్ సీటును డౌన్ టిల్టింగ్ ఎంపికతో పొందుతుంది.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  కొత్త Force Gurkha లో కొత్తగా డిజైన్ చేసిన వృత్తాకార LED హెడ్‌లైట్, LED DRL లైట్ మరియు LED స్టాప్ లైట్ ఉన్నాయి. ఇది కొత్త ఫ్రంట్ బంపర్‌పై ఉంది, దానిపై గుర్ఖా అని పెద్ద అక్షరాలతో వ్రాయబడింది. ఇది కాకుండా, బంపర్‌పై బ్లాక్ క్లాడింగ్ మరియు హాలోజన్ ఫాగ్ లైట్లు ఇవ్వబడ్డాయి.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  Force Gurkha 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ని కలిగి ఉంది. వీటిని డ్రైవర్ తన సౌలభ్యం మేరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనితో పాటు, ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్, USB ఛార్జింగ్ పోర్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ కూడా ఉన్నాయి.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  2021 Force Gurkha యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ అనుసంధానించబడింది. ఇందులోని ఇంజిన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ మహీంద్రా థార్ కంటే తక్కువ శక్తివంతమైనది. మహీంద్రా థార్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  2021 Gurkha లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహనదారుని భద్రతను నిర్ధరిస్తాయి.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  Force Gurkha కొలతల విషయానికి వస్తే, ఇది 4,116 మి.మీ పొడవు, 1,812 మి.మీ వెడల్పు, 2,075 మి.మీ ఎత్తు, 2,400 మి.మీ వీల్‌బేస్ మరియు 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

  2021 Gurkha యాక్సెసరీస్ వెల్లడించిన Force Motors; పూర్తి వివరాలు

  2021 Force Gurkha సెప్టెంబర్ 27 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది, అదేవిధంగా డెలివరీలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. Force Gurkha యొక్క ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షల లోపు ఉండే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో Mahindra Thar మరియు Maruti Suzuki Jimny వాటి వాటికి Gurkha ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 force gurkha suv accessories revealed launch on 27 sep details
Story first published: Friday, September 17, 2021, 15:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X