అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు మరియు అత్యంత ధనవంతులైన వ్యక్తులకు ఖరీదైన మరియు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్లో తమకు నచ్చిన మరియు కొత్తగా వచ్చిన వాహనాలు కూడా కొనేస్తూ ఉంటారు. చాలామంది సెలెబ్రెటీలు ఇప్పటికే చాలా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. వీటి గురించి సమాచారం మనం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం..ఇప్పుడు బాలీవుడ్ బాద్షా అని పిలువబడే షారుఖ్ ఖాన్ కార్ల గురించి తెలుసుకుందాం.. రండి.

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం భారతదేశంలో కొరియా కార్ల తయారీ సంస్థ అయినా హ్యుందాయ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. షారూఖ్ ఖాన్ వద్ద కేవలం హ్యుందాయ్ కార్లు మాత్రమే కాకుండా మరిన్ని లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్ ఎస్‌యూవీ, బెంట్లీ కాంటినెంటల్ జిటి, ఆడి వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో తన లెక్సస్ ఎస్సీ 430 కన్వర్టిబుల్ కారులో కనిపించాడు. షారుఖ్ ఖాన్ ఈ కారుని స్వయంగా డైవింగ్ చేస్తున్నాడు.

MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ఈ కారులో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మరియు అతని కుమారుడు కూడా కనిపించారు. షారుఖ్ ఖాన్ ఈ లెక్సస్ ఎస్సీ 430 కన్వర్టిబుల్ కారులో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ కారు చూడటానికి చాలా కొత్తదిగా కనిపించినప్పటికి, ఇది నిజంగా చాలా పాత కారు.

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ఈ కారు దశాబ్ద కాలంగా షారూఖ్ ఖాన్ గ్యారేజీలో ఉంది. కానీ చూడటానికి సరికొత్తగా కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించే లెక్సస్ ఎస్సీ 430 కారు 15 సంవత్సరాల మోడల్.

MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ఈ కారు ఆకర్షణీయమైన రెడ్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. ఈ కలర్ దీనికి స్పోర్టి లుక్ ఇస్తుంది. ఇది హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ టాప్‌ను కలిగి ఉంది, ఇది బటన్‌ను నొక్కడం ద్వారా ఓపెన్ చేయబడుతుంది. ఇది టయోటా సోలార్ కన్వర్టిబుల్ యొక్క అత్యంత ప్రీమియం కనిపించే వెర్షన్ మరియు అంతర్జాతీయంగా విక్రయించబడింది. సోరె మరియు ఎస్సీ 430 రెండూ ఒకే విధమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ఎస్సీ 430 కారు యొక్క ప్రధాన ఆకర్షణ దాని రూపకల్పన. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది మొదట మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కు చౌకైన ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. లెక్సస్ ఎస్సీ 430 లో 4.3-లీటర్ వి 8 పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 282 బిహెచ్‌పి మరియు 419 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

ఈ లెక్సస్ ఎస్సీ 430 కారు గంటకు 250 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. లెక్సస్ ఎస్సీ 430 కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు లోపలి భాగంలో లెదర్ తో చుట్టబడిన సీటు, స్టీరింగ్ వీల్ వీల్స్ మరియు బ్రష్డ్ అల్యూమినియం ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది నావిగేషన్ చేత విలీనం చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ ప్రదర్శనను కూడా అందుకుంటుంది. డోర్ మరియు డాష్‌బోర్డ్‌లోని వుడ్ ప్యానలింగ్ మరింత ప్రీమియం గా ఉంటుంది.

అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా- షారుఖ్ ఖాన్

ప్రస్తుతం ఈ మోడల్ మార్కెట్లో నిలిపివేయబడింది. అయితే దీని దీని ధర సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుంది. షారూఖ్ ఖాన్ తన గ్యారేజీలో వివిధ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఈ గ్యారేజ్ లో బుగట్టి వెరాన్‌లో హైపర్ కారు కూడా ఉందని చెబుతారు.

MOST READ:ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అభినందించిన కమల్ హాసన్, ఎందుకో తెలుసా ?

Image Courtesy: Home Bollywud

Most Read Articles

English summary
Shahrukh Khan’s Rare Lexus Convertible Spotted Outside Mumbai Airport. Read in Telugu.
Story first published: Monday, February 8, 2021, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X