నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

మానవ మేధస్సు ద్వారా సృష్టించబడిన కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ - ఏఐ) ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త విప్లవాలకు నాంది పలుకుతోంది. ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరిచయం చేయబడింది. కార్ల తయారీ సంస్థలు తమ ఫూచరిస్టిక్ కార్లలో ఈ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నాయి.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

అయితే, ఇప్పుడు ఈ టెక్నాలజీ కార్ల తయారీలో కూడా ఉపయోగించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు రెడీ అవుతున్నాయి. జపాన్ కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తమ ఫ్యాక్టరీలలో మనుషులకు బదుగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఏఐ రోబోట్స్ ని ఉపయోగించాలని చూస్తోంది. నిస్సాన్ కార్ల తయారీలో ఈ రోబోలు కీలక పాత్ర పోషించనున్నాయి.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

ఈ మేరకు నిస్సాన్ మోటార్ తమ జపాన్ రాజధాని టోక్యో లోని తమ ఫ్యాక్టరీని 'తెలివైన ఫ్యాక్టరీ' (ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ) గా మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీలో మనుషులకు బదులుగా ఆటోమేటెడ్ రోబోలను ఉపయోగిస్తారు. వేలాది సంఖ్యలో రోబోలు ఈ ప్లాంట్‌లో పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ఈ రోబోలు వెల్డింగ్ మరియు ఫిట్టింగ్ నుండి పెయింటింగ్ వరకు అన్ని రకాల పనులను చేస్తాయని పేర్కొంది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

టోక్యో లోని నిస్సాన్ ప్లాంట్ యొక్క అసెంబ్లీ లైన్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అంతర్గత దహన (IC) ఇంజన్‌లతో సహా మూడు రకాల మోడళ్లను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది. ఈ మోడళ్లన్నీ ఒకే లైన్‌ లో తయారు చేయబడతాయి. సరైన పవర్‌ట్రెయిన్ ఉన్న ప్రతి వాహనాన్ని ఒకే ప్రొడక్షన్ లైన్‌ లో ఉత్పత్తి చేయవచ్చు.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

ఈ ఫ్యాక్టరీలో వాహనాల ఉత్పత్తి రోబోలు నిర్వహిస్తుండగా, మరింత సమర్థవంతమైన పనులను నిర్వహించడానికి మానవ కార్మికులు పని చేస్తారని కంపెనీ చెబుతోంది. రోబోలు సేకరించిన డేటాను విశ్లేషించడం, అలాగే ఫ్యాక్టరీ పరికరాలను పర్యవేక్షించడం వంటి పనులను మానవ కార్మికులు నిర్వహిస్తారు.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

తమ అనుభవం ప్రకారం ఇప్పటి వరకు కార్మికులను ఫ్యాక్టరీలలో కార్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించామని, అయితే ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోలు ఈ వాహనాల తయారీ పనులను ఎంతో సులువుగా మరియు సమర్థంవంతగా చేయగలవని కంపెనీ చెబుతోంది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో, ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ అసెంబ్లీ లైన్ లలో వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సమర్థవంతమైన రోబోటిక్ టెక్నాలజీపై పని చేస్తున్నాయి. భవిష్యత్తులో కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు మరోసారి ఏర్పడినప్పుడు, ఫ్యాక్టరీలలో కార్మికుల కొరతను అధిగమించడానికి ఆటోమేటెడ్ రోబోలు ఎంతో సహాయపడతాయని నిస్సాన్ తెలిపింది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

నిస్సాన్ యొక్క ఇతర గ్లోబల్ ప్లాంట్లలో తోచిగి (జపాన్) లో ప్రస్తుతం పరీక్షిస్తున్న ఏఐ రోబో సాంకేతికతలను ఉపయోగించాలని యోచిస్తోంది, ఇందులో ఫ్రెంచ్ కూటమి భాగస్వామి అయిన రెనో కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాలతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని నిస్సాన్ భావిస్తోంది, కానీ గత రెండేళ్లుగా ఇబ్బంది పెట్టిన కరోనావైరస్ మహమ్మారి కారణంగా కంపెనీ ఇప్పటీ సప్లయ్ కొరతతో పోరాడుతోంది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు..

నిస్సాన్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గనిస్తే, భారత మార్కెట్లో ఈ జపనీస్ బ్రాండ్ విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీని నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ధరలను కంపెనీ మరోసారి పెంచింది. గడచిన డిసెంబర్ 2020 లో భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఇలా ధరలను పెంచడం ఇది రెండోసారి.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

ధరల పెరుగుదల మినహా, కంపెనీ ఎస్‌యూవీలో ఏ ఇతర మార్పులు చేయలేదు. కొత్త ధరలు అక్టోబర్ 2021 నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ కొత్త ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ కారు ధరలు రూ. 6,000 నుండి రూ. 17,000 మేర పెరిగాయి.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

ధరల పెరుగుదలకు ముందు మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. ప్రస్తుతం, మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

నిస్సాన్ మాగ్నైట్ లోని 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, ఇందులో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది.

నిస్సాన్ కార్లను తయారు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (ఏఐ) రోబోట్స్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైనవి లభిస్తాయి.

Most Read Articles

English summary
Ai robots to make cars at nissan plant in japan details
Story first published: Sunday, October 10, 2021, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X