టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, తాజాగా మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం టాటా సఫారీలో స్టాండర్డ్ వేరియంట్లతో పాటుగా 'అడ్వెంచర్ పర్సోనా' అనే స్పెషల్ ఎడిషన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

సఫారీ టాప్-ఎండ్ వేరియంట్లను ఆధారంగా చేసుకొని ఈ కొత్త టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్‌ను అందిస్తున్నారు. స్టాండర్డ్ వెర్షన్ సఫారీతో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో పలు మార్పులు చేర్పులు ఉన్నాయి.

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్‌లో ప్రధానమైన మార్పు దాని ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్. ఇది ‘ట్రాపికల్ మిస్ట్' అనే ప్రత్యేకమైన కలర్ స్కీమ్‌లో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ పెయింట్ స్కీమ్‌ను ట్రోపికల్ ఫారెస్ట్ యొక్క మిస్టీ గ్రీన్స్ నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. స్టాండర్డ్ సఫారీతో పోల్చుకుంటే ఈ కలర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

ఈ స్పెషల్ ఎడిషన్‌లో కేవలం కొత్త పెయింట్ స్కీమ్ మాత్రమే కాకుండా, ఇందులో కొన్ని ఇతర మార్పులు కూడా ఉన్నాయి. వాటిలో ఆర్18 చార్‌కోల్ గ్రే మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ గ్రిల్ డోర్ హ్యాండిల్స్ మరియు పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేసిన సఫారీ మస్కట్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, రెండు చివర్లలోని స్కిడ్ ప్లేట్లను కూడా చార్‌కోల్ గ్రే కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

ఇక ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, కొత్త టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్‌లో ఇంటీరియర్ అప్‌హోలెస్ట్రీ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. స్టాండర్డ్ సఫారీలో ఇది వైట్ కలర్‌లో ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో కొత్త బ్రౌన్ అప్‌హోలెస్ట్రీని ఎడారుల్లో బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపంచే ఇసుకు మేటలను ఆధారంగా చేసుకొని డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

క్యాబిన్‌లో చేసిన కొన్ని ఇతర మార్పులలో కొత్త డార్క్ క్రోమ్ మరియు పియానో ​​బ్లాక్ ఫినిషింగ్స్‌తో కూడిన ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌లో గేర్ లివర్, డోర్ ట్రిమ్స్‌, డోర్ హ్యాండిల్స్ మరియు గ్రాబ్ హ్యాండిల్స్‌పై బ్రౌన్ ఇన్సర్ట్ మొదలైనవి ఉన్నాయి.

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. దీనిని టాప్-ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్ ఆధారంగా డిజైన్ చేశారు. పైన పేర్కొన్న స్పెషల్ ఫీచర్లే కాకుండా, టాప్-ఎండ్ వేరియంట్లలో లభించే అన్ని ఇతర ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

ఈ స్పెషల్ ఎడిషన్ సఫారీ అడ్వెంచర్ పర్సోనా మోడల్ యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ల రిటైల్ ధరలు వరుసగా రూ.20.20 లక్షలు మరియు రూ.21.45 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టాటా సఫారీ 'అడ్వెంచర్ పర్సోనా' స్పెషల్ ఎడిషన్‌లో ఆ స్పెషల్ ఫీచర్లేంటో తెలుసా?

ఇంజన్ పరంగా కొత్త టాటా సఫారీ అడ్వెంచర్ పర్సోనా ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. స్టాండర్డ్ వేరియంట్లలో ఉపయోగించిన అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

Most Read Articles

English summary
All You Need To Know About Tata Safari Adventure Persona Edition, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X