ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ ఇంగ్లాండ్‌లోని తమ క్రీవ్ ప్లాంట్‌లో 75 సంవత్సరాల తయారీని జరుపుకుంటున్నట్లు తెలిపింది. బెంట్లీ బ్రాండ్‌ని సుమారు 102 ఏళ్ల క్రితం, అంటే 1919 లోనే అధికారికంగా గుర్తించినప్పటికీ, దాని క్రీవ్ ప్లాంట్ మాత్రం 1946లో ఉనికిలోకి వచ్చింది.

ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

బెంట్లీ మార్క్ VI ఈ క్రీవ్ ప్లాంట్లో పూర్తిగా తయారు చేయబడిన మొట్టమొదటి కారు. బెంట్లీ మార్క్ VI కారును విలాసవంతమైన ఇంటీరియర్‌తో పాటుగా ప్రెస్డ్-స్టీల్ బాడీ షెల్‌తో రూపొందించారు. ఆ కాలంలో ఇది చాలా అరుదుగా ఉండేది.

ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

ప్రస్తుతం క్రీవ్ ప్లాంట్ ఉన్న ప్రదేశం 1938కి ముందు వేలాది బంగాళాదుంపలకు నిలయంగా ఉండేది. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి ముందు ఈ భూమి వ్యవసాయం కోసం ఉపయోగించబడింది. 1938 తరువాత, మెర్లిన్ విమాన ఇంజన్ల తయారీ కోసం క్రీవ్ ప్లాంట్ నిర్మించబడింది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

మెర్లిన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లను ప్రత్యేక సదుపాయంలో తయారు చేయాలనే ఈ నిర్ణయం రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఈ ప్రదేశంలో అప్పుడు మంచి నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు బాగా అనుసంధానించబడిన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేవి.

ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

ఈ తయారీ కర్మాగారం కొన్ని ఉత్తమ లగ్జరీ కార్లను ఉత్పత్తి చేసినప్పటికీ, ఈ రోజు మనకు తెలిసిన క్రీవ్ ప్లాంట్ బెంట్లీని కొనుగోలు చేసిన తరువాత 1998లో ఫోక్స్‌వ్యాగన్ సంస్థ ఆధునీకరించింది. 1998 లో ఫోక్స్‌వ్యాగన్ సంస్థ బెంట్లీని స్వాధీనం చేసుకునే ముందు, క్రీవ్ ప్లాంట్లో కేవలం 38,933 కార్లు మాత్రమే నిర్మించబడ్డాయి.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

ఆ ప్లాంట్‌లో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బెంట్లీ; ప్లాటినం జూబ్లీ వేడుకలు

బెంట్లీ కాంటినెంటల్ జిటి వంటి ఆధునిక లగ్జరీ కార్లను ప్రవేశపెట్టిన తరువాతే, బెంట్లీ అమ్మకాలు మరియు ఉత్పత్తి ప్రారంభమైంది. బెంట్లీ యొక్క భవిష్యత్ ఎలక్ట్రిక్ మోడళ్ల అభివృద్ధికి సహాయపడటానికి బెంట్లీ త్వరలోనే తమ క్రీవ్ ప్లాంట్‌లో ఓ కొత్త టెస్ట్ సెంటర్ మరియు ఆర్ అండ్ డి యూనిట్‌ను కూడా ప్రారంభించనుంది.

Most Read Articles

English summary
Bentley Crewe Manufacturing Plant Completes 75 Years; Celebrates Platinum Jubilee. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X