రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌ను రేపు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్‌ ను ప్రారంభించడానికి ముందు, కంపెనీ ఈ కారు యొక్క టీజర్ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో విడుదల చేసింది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ ఫొటోలో కారు యొక్క ముందు మరియు సైడ్ ప్రొఫైల్స్ గురించి ఒక స్పష్టమైన సమాచారం తెలియజేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌ అప్డేటెడ్ ఎక్స్టీరియర్ డిజైన్ చూడవచ్చు. ఈ కారుకు ట్విన్ ఎల్-షేప్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రెష్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, స్మోక్డ్ ఎల్‌ఇడి టెయిల్ లైట్లు మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని ప్రధాన ఆకర్షణ దాని ఫ్రంట్ గ్రిల్. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌కు చిన్న మరియు సింగిల్ ఫ్రేమ్ కిడ్నీ గ్రిల్ ఇవ్వబడింది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులో కూడా కొన్ని మార్పులు జరిగినట్లు గమనించవచ్చు. ఇక్కడ కొత్తగా పునఃరూపకల్పన చేసిన బంపర్లు మరియు కొత్త గైడ్ లైట్లతో పాటు కొత్త టైల్ లైట్స్ కూడా ఇవ్వబడ్డాయి. 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క అన్ని వేరియంట్లలో కంపెనీ ట్రాపెజోయిడల్ ఎగ్జాస్ట్ పైపులను ఏర్పాటు చేసింది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌లో యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 వ తరం ఐ-డ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దాని క్యాబిన్‌లో ఇవ్వబడింది, దానితో పాటు స్టాండర్డ్ 10.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఇవన్నీ దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

ఈ ఫేస్‌లిఫ్ట్‌ యొక్క డాష్‌బోర్డ్‌ కూడా కొత్త నవీకరణలు పొందింది. వీటిలో కొత్త డాష్‌బోర్డ్ మెటీరియల్, గ్లోస్ బ్లాక్ సెంటర్ కన్సోల్ ప్యానెల్ మరియు కొత్త లోయర్ క్లైమేట్ డిస్ప్లే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఎంట్రీ లెవల్ బేస్ వేరియంట్‌లో మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లు మరియు పరికరాలను కంపెనీ అందిస్తోంది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

ఇక ఈ కారు యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఇండియా దీని గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు, కానీ ప్రస్తుత తరం యొక్క అదే ఇంజన్ ఎంపికలను కొత్త 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌లో తిరిగి ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కావున ఇందులో దాని బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ఫేస్‌లిఫ్ట్‌లోని 530 ఐలో 2.0-లీటర్ పెట్రోల్, 520 డిలో 2.0-లీటర్ డీజిల్, 530 డిలో 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్సన్ ఇచ్చే అవకాశం ఉంది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

ప్రస్తుతం ఈ కొత్త 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ ధర ఇంకా అధికారికంగా తెలియరాలేదు, కానీ రేపు లాంచ్ చేసే సమయంలో వెల్లడవుతుంది. కానీ ప్రస్తుత బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ధరలను చూస్తే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత మోడల్ ధర రూ. 56 లక్షల నుంచి రూ. 69.10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది.

రేపే విడుదల కానున్న కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్‌; వివరాలు

బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకూండా, మంచి పనితీరుని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదలైన తరువాత మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, ఆడి ఎ 6 మరియు వోల్వో ఎస్ 90 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
BMW 5 Series Facelift Teased Ahead Of Launch Tomorrow. Read in Telugu.
Story first published: Wednesday, June 23, 2021, 14:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X