ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారత మార్కెట్లో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఐఎక్స్' (iX) ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (BMW iX) ధర రూ. 1.15 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది. మరి ఈ కారు యొక్క విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 పవర్‌ట్రైన్:

భారత విపణిలో BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేయబడింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని xDrive40 రూపంలో అందింస్తోంది. కొత్త BMW iX xDrive40 ఎలక్ట్రిక్ కారులో 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్ ఉంటుంది. ఇది రెండు యాక్సిల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 322 బిహెచ్‌పి శక్తిని మరియు 630Nm టార్క్‌ ని ఉత్పత్తి చేస్తాయి.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 డ్రైవ్‌ట్రైన్, పెర్ఫార్మమెన్స్:

ఇందులోని సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎక్స్‌డ్రైవ్ (xDrive) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేదంతో పరుగులు తీయగలదని కంపెనీ పేర్కొంది.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 రేంజ్, బ్యాటరీ:

డబ్ల్యూఎల్‌పిటి (WLTP - Worldwide Harmonised Light Vehicle Test Procedure) సర్టిఫై చేసిన దాని ప్రకారం బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి బ్యాటరీ చార్జ్ పై గరిష్టంగా 425 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ కారు చార్జింగ్ విషయానికి వస్తే, సాధారణ వాల్ ప్లగ్‌ల కోసం 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ను అందిస్తుండగా, ఫాస్ట్ చార్జింగ్ కోరుకునే వారి కోసం 11kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌ ను కబడీ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కారులో 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 చార్జింగ్ సమయం:

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి సాధారణ 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ద్వారా అయితే 36 గంటల సమయం పడుతుంది. అదే 11kW AC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే కేవలం 7 గంటల వ్యవధిలోనే బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎళక్ట్రిక్ కారు మరింత వేగవంతమైన DC ఛార్జింగ్‌ కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో చార్జ్ చేస్తే, కేవలం ఒక గంట 13 నిమిషాల్లోనే దాని బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చార్జింగ్ సమయం కూడా ఎక్కువ అనిపిస్తే, మరింత శక్తివంతమైన మరియు వేగవంతమైన 150kW DC ఛార్జర్‌ను కొనుగోలుచేయవ్చచు, దీని సాయంతో కేవలం 31 నిమిషాల్లోనే కారు బ్యాటరీని అదే 10 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 డిజైన్:

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ముందు డిజైన్ లో ఈ బవేరియన్ కార్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌ ఉంటుంది మరియు ఇది ఫ్రంట్ డిజైన్ లో ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకా ఇందులో సన్నటి సొగసైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, దీర్ఘచతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, 21 ఇంచ్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌, ఫ్రేమ్‌లెస్ విండోస్, పెద్ద పనోరమిక్ రూఫ్, ఈ ఎలక్ట్రిక్ కారును హైలైట్ చేసే బ్లూ డీటేలింగ్స్ మరియు సొగసైన సింగిల్-పీస్ టెయిల్‌లైట్‌లు వంటి డిజైన్ హైలైట్స్ ఉన్నాయి.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 ఫీచర్లు:

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపలి భాగాలు మినిమలిస్టిక్ డిజైన్ ను కలిగి ఉండి, చాలా విశాలంగా ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు డ్రైవర్ కాక్‌పిట్ కోసం ట్విన్ డిస్‌ప్లే సెటప్‌ ఉంటుంది. ఇందులో షట్కోణపు (హెక్సాగనల్) స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ సీట్లు, 500 లీటర్ల బూట్ స్పేస్ (వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా 1,750 లీటర్లకు పెంచుకోవచ్చు), 14.9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, హెడ్‌స్ అప్ డిస్‌ప్లే, సరౌండ్-వ్యూ కెమెరా మరియు 18-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు ధర అక్షరాల ఒక కోటి పదహారు లక్షల రూపాయాలు.. మరి ఇంతకీ దీని స్పెషల్ ఏంటంటే..?

BMW iX xDrive40 సేఫ్టీ:

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో యాక్టివ్ రిటర్న్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్‌, లేన్ చేంజ్ అసిస్ట్‌ వంటి అనేక ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Bmw launches ix electric suv in india price battery range specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X