3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, తమ కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ సేవలను అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా, ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ కూడా 3డి విధానంలో తమ కస్టమర్లకు డిజిటల్ సేవలను అందించనుంది. ఇందుకు గాను సిట్రోయెనో, ఎసెంట్రిక్ ఇంజన్ అనే టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

ఎసెంట్రిక్ ఇంజన్ మరియు సిట్రోయెన్ ఇండియా సంస్థలు రెండూ కలిసి సిట్రోయెన్ కార్ల కొనుగోలును పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నాయి. ఈ భాగస్వామ్యంలో, ఎసెంట్రిక్ ఇంజన్ తన 3డి ఇమేజరీ ప్లాట్‌ఫామ్ ద్వారా సిట్రోయెన్ వెబ్‌సైట్ మరియు షోరూమ్‌లోని వినియోగదారులకు 3డి కార్ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

కరోనా మహమ్మారి సమయంలో వినియోగదారులు కారు కొనడానికి సురక్షితమైన వాతావరణాన్ని పొందగలిగేలా కంపెనీ ఈ 3డి ఇమేజరీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. ఇందులో 3డి ఇమేజ్ ద్వారా కస్టమర్ తన ముందు కారు ఉన్న అనుభూతిని పొందుతారని కంపెనీ తెలిపింది. ఈ 3డి టెక్నాలజీ సహాయంతో, కారు నిజానికి మన కళ్ల ముందు చూపిన విధంగానే కారు యొక్క అన్ని వివరాలను ఖచ్చితంగా చూపించవచ్చు.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

సిట్రోయెన్ వెబ్‌సైట్‌ను సందర్శించే వినియోగదారులకు కారు యొక్క అన్ని వివరాలను రికార్డ్ చేయబడిన వాయిస్ ద్వారా పూర్తి వివరంగా తెలియజేస్తారు. ఇందులో, కారును బహుళ కోణాల నుండి చూసే మరియు దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో, కారు ఎక్స్టీరియర్ ఫీచర్లను మాత్రమే కాకుండా ఇంటీరియర్ ఫీచర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా తెలియజేయబడుతుంది.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

ఈ 3డి విధానంలో కారును చూడటమే కాకుండా, వినియోగదారులు కారులో ఉపయోగించే పదార్థాల యొక్క నాణ్యతను కూడా దగ్గరగా చూడవచ్చు. ఇది వివిధ రంగులు, ట్రిమ్ మరియు వేరియంట్ల ప్రకారం కారును చూడటానికి అనుమతిస్తుంది. కారులో ఉపయోగించిన ఫాబ్రిక్, మెటీరియల్ మరియు మోడల్ వివరాలను కూడా వివరంగా చూడవచ్చు. ఈ 3డి ఇమేజరీ ద్వారా కారుతో లభించే ఉపకరణాలు కూడా కారుకు అమర్చి చూసుకోవచ్చు.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

గడచిన 3 నెలల్లో 2.5 లక్షలకు పైగా సందర్శకులు కంపెనీ వెబ్‌సైట్‌కు వచ్చారని సిట్రోయెన్ తెలిపింది. అదే సమయంలో టెలిఫోన్, ఆన్‌లైన్, వెబ్‌సైట్ ద్వారా 38 లక్షలకు పైగా ప్రజలు ఎంక్వైరీలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం సిట్రోయెన్ ఇండియా, దేశీయ విపణిలో సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది మరియు ఈ మోడల్ కోసం వచ్చిన చాలా బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

అన్ని సిట్రోయెన్ డీలర్‌షిప్‌లలో వాస్తవిక వాహన ప్రదర్శనతో పాటుగా 3డి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను కూడా కలిగి ఉంటాయి. ఈ సదుపాయంతో వినియోగదారులు 3డి ఇమేజరీ ద్వారా తమకు నచ్చిన మోడల్, వేరియంట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు మరియు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

రియల్ టైమ్ డ్రైవింగ్ అనుభవం కోసం కంపెనీ టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. సిట్రోయెన్ భారత మార్కెట్లో తమ మొదటి కారు సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఏప్రిల్ 7, 2021న విడుదల చేసింది. ఈ మోడల్ కోసం మే నెల చివరి నాటికి, కంపెనీ 1,000 యూనిట్ల బుకింగ్స్ అందుకుంది. ఇందులో ఇప్పటికే 230 యూనిట్లు పంపిణీ చేయబడ్డాయి.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.29.90 లక్షలు మరియు రూ.31.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కారులో శక్తివంతమైన 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 176 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

3D ఎక్స్‌పీరియెన్స్‌తో సిట్రోయెన్ కారును కొనుగోలు చేయండి!

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ మిడ్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Citroen India Join Hands With Eccentric Engine To Provide 3D Car Buying Experience, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X