Just In
- 8 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 10 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 12 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 13 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. సిట్రోయెన్ షోరూమ్ ఇప్పుడు బెంగళూరులో
ప్రముఖ ప్రెంచ్ కార్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఇండియా తన సరికొత్త సి 5 ఎయిర్‌క్రాస్‌ను లాంచ్ చేయడానికి ముందు దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో తన కొత్త కార్ల అమ్మకాలను ప్రమాభించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొత్త షోరూమ్‌లను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది.

బెంగుళూరులోని పిపిఎస్ మోటార్స్ భాగస్వామ్యంతో మిల్లర్స్ రోడ్‌లోని గ్రేస్ టవర్స్‌లో కొత్త కార్ల డీలర్‌షిప్‌ను ప్రారంభించిన సిట్రోయెన్, కొత్త కారును విడుదల చేసిన తరువాత ఈ డీలర్‌షిప్ ద్వారా తమ వాహన అమ్మకాలను నగరంలోని ప్రధాన ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది.

ఇప్పుడు సిట్రోయెన్ ఇండియా తన మొట్టమొదటి 'లా మైసన్ సిట్రోయెన్' షోరూమ్‌ను బెంగళూరు నగరంలో ప్రారంభించింది. బెంగళూరులోని సిట్రోయెన్ షోరూమ్ వినియోగదారులకు చాలా అందుబాటులో ఉండటం వల్ల మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది.
MOST READ:ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత "రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350"

ఈ కొత్త షోరూమ్‌ను సందర్శించే కస్టమర్‌లు కంపెనీ యొక్క సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని స్వయంగా చూడగలుగుతారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని, వారి అవసరాలకు అనుగుణంగా ఎస్‌యూవీని అనుకూలీకరించడానికి మరియు అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది.

అమ్మకాలతో పాటు, బెంగళూరులోని లా మైసన్ సిట్రోయెన్ షోరూమ్ తన వినియోగదారులకు పూర్తి స్థాయి అమ్మకాల తర్వాత సర్వీస్ మరియు టెస్ట్ డ్రైవ్ అనుభవాలను కూడా అందిస్తుంది. సిట్రోయెన్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఆఫర్లను కూడా అందించనుంది.
MOST READ:2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న "హ్యుందాయ్ ఐ20"

కొత్త లా మైసన్ సిట్రోయెన్ షోరూమ్ ప్రారంభించడంతో పాటు, తమ రాబోయే సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీకి ప్రీ-లాంచ్ బుకింగ్‌లు 2021 మార్చి 1 న ప్రారంభమవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. బుకింగ్‌లను డీలర్‌షిప్‌లో లేదా ఆన్‌లైన్‌లో రూ. 50,000 ముందస్తు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో ఈ కొత్త సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ లాంచ్ అయిన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభమవుతాయి. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ను ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులకు ఇప్పుడు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో ఆర్ఎస్ఏ సపోర్ట్ మరియు స్టాండర్డ్ 5 ఇయర్స్ వారంటీ వంటివి అందిస్తారు.
MOST READ:మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్