Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) భారత మార్కెట్లో తమ కొత్త తరం గుర్ఖా (Gurkha) ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసనదే. ఈ మోడల్ అమ్మకాలు సెప్టెంబర్ 27 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి మరియు డెలివరీలు ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో ప్రారంభమవుతాయి.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ఫోర్స్ మోటార్స్ తమ కొత్త తరం గుర్ఖా ఎస్‌యూవీ యొక్క ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను కంపెనీ గడచిన ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించింది. వాస్తవానికి, ఇప్పటికే మార్కెట్లోకి రావల్సిన ఈ అధునాతన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, కంపెనీ ఈ మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లను వెల్లడి చేసే చిత్రాలను విడుదల చేసింది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

కొత్త తరం 2021 Force Gurkha ఎస్‌యూవీని సరికొత్త మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి రూపొందించారు. ఫలితంగా ఈ కొత్త మోడల్ దాని పాత మోడల్ కంటే పెద్దదిగా మరియు పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ కూడా మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లు మరియు మరింత శుద్ధమైన BS6 డీజిల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. కొత్త Force Gurkha ఈ విభాగంలో నేరుగా Mahindra Thar కి గట్టి పోటీ ఇవ్వనుంది. మరి ఇది థార్ తో ఏయే విషయాల్లో పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - పరిమాణం

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కొత్త తరం 2021 Force Gurkha మునుపటి కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. కొలతల పరంగా, ఇది 4,116 మిమీ పొడవు, 1,812 మిమీ వెడల్పు, 2,075 మిమీ ఎత్తు మరియు 2,400 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ఇక కొత్త తరం 2020 Mahindra Thar విషయానికి వస్తే, ఇది 3,985 మిమీ పొడవు, 1,855 మిమీ వెడల్పు (AX ఆప్షనల్ వేరియంట్ వెడల్పు 1,820 మిమీ), 1,920 మిమీ పొడవు మరియు 2,450 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు ఎస్‌యూవీల పరిమాణాలను పోల్చి చూస్తే, కొత్త తరం Force Gurkha కొత్త Thar పొడవు మరియు ఎత్తుగా ఉంటుంది, కానీ వెడల్పు మరియు వీల్‌బేస్‌లో Thar కంటే తక్కువగా ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - ఫీచర్లు

కొత్త తరం ఫోర్స్ గుర్ఖా మునుపటి మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, నాలుగు స్పీకర్లు, పవర్ విండోస్, రెండు యుఎస్‌బి ఛార్జింగ్ పాయింట్లు, సెంట్రల్ లాకింగ్, ఎసి, కార్నింగ్ లాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు LED బ్రేక్ లైట్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో పార్కింగ్ సెన్సార్లు మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు కూడా ఇవ్వబడ్డాయి. కొత్త గుర్ఖాలోని పవర్ స్టీరింగ్‌ను పూర్తిగా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

అదే, మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో కూడా కంపెనీ అనేక స్మార్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఈ కారులో స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన యాప్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియల్ టైమ్ అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, ఎమ్ఐడి సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ కొత్త తరం మహీంద్రా థార్ లోని పవర్ స్టీరింగ్‌లో టిల్ట్ అడ్జస్టింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ఫీచర్ల విషయంలో కొత్త తరం 2021 Force Gurkha కంటే కొత్త తరం 2020 Mahindra Thar అనేక విషయాల్లో ముందుంది. ఏదేమైననప్పటికీ, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు కార్నింగ్ లాంప్స్‌తో కూడిన కొత్త తరం గుర్ఖా రాత్రి సమయంలో మహీంద్రా థార్ కంటే మెరుగైన దృశ్యమానతను అందిస్తుంది. థార్‌లో హాలోజెన్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - సేఫ్టీ ఫీచర్లు

కొత్త 2021 Gurkha లో కంపెనీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 2020 Thar డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌పి, రోల్-ఓవర్ మిటిగేషన్, హిల్-హోల్డ్ కంట్రోల్, హిల్-డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

సేఫ్టీ ఫీచర్ల విషయంలో మహీంద్రా తాజాగా వచ్చిన ఫోర్స్ గుర్ఖా కంటే చాలా రెట్లు ముందంజలో ఉంటుంది. ముఖ్యంగా, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో కూడా 2020 మహీంద్రా థార్ ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుని సురక్షితమైన కారుగా నిలిచింది. కాగా, కొత్త 2021 Force Gurkha ను ఇంకా ఏ ఏజెన్సీ కూడా క్రాష్-టెస్ట్ చేయలేదు. అయితే, గతంతో పోల్చుకుంటే, కొత్త తరం గుర్ఖా సేఫ్టీ అనేక రెట్లు మెరుగ్గా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - పెర్ఫార్మెన్స్

కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ (Mercedez Benz) నుండి దిగుమతి చేసుకున్న 2.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

కాగా, మహీంద్రా థార్ 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ పరంగా కొత్త ఫోర్స్ గుర్ఖా కంటే మహీంద్రా థార్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, గుర్ఖాలోని 2.6 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పోల్చుకుంటే, థార్‌లోని 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, పెర్ఫార్మెన్స్ పరంగా ఈ రేసులో మహీంద్రా థార్ ముందంజలో ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు

కొత్త తరం 2021 Force Gurkha పూర్తిగా హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా చెప్పవచ్చు. ఫలితంగా, ఈ ఎస్‌యూవీ సమర్థవంతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులోని ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్స్‌పై మాన్యువల్ డిఫరెన్షియల్ లాక్ మరియు క్రాల్ మోడ్‌తో కూడిన 4X4 అలాగే లో గేర్‌తో కూడిన 4X4 పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. కొత్త గుర్ఖా 35 డిగ్రీల గ్రాడబిలిటీని అందిస్తుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

ఇక 2020 Mahindra Thar విషయానికి వస్తే, ఇందులో షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేసుతో కూడిన 4x4 డ్రైవ్‌ట్రైన్ మరియు 2H, 4H మరియు 4L అనే డ్రైవింగ్ మోడ్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్కనెక్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్రోచ్ యాంగిల్ విషయానికి వస్తే, థార్ యొక్క అప్రోచ్ యాంగిల్ 41.8 డిగ్రీలుగా ఉంటుంది.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

Gurkha వర్సెస్ Thar - ధర

భారత మార్కెట్లో మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు రూ. 12.78 లక్షల నుండి రూ. 15.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కాగా, కొత్త 2021 Force Gurkha ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 27 న మరిన్ని వివరాలు తెలుస్తాయి. మార్కెట్ అంచనా ప్రకారం, గుర్ఖా ధరలు సుమారు రూ. 10 లక్షల నుండి రూ .12 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) లో ఉండొచ్చని అంచనా.

Force Gurkha వర్సెస్ Mahindra Thar: రెండింటిలో ఏది మేలంటారు?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

ఈ రెండు ఎస్‌యూవీల ఫీచర్లు, ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ పరంగా పోల్చి చూస్తే, ఇవి రెండూ కూడా చాలా సమర్థవంతమైన ఆఫ్‌రోడర్లు అని తెలుస్తుంది. మరి ఈ రేసులో మహీంద్రా థార్‌ని కొత్త తరం ఫోర్స్ గుర్ఖా ఓడిస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది. ఈ కొత్త ఎస్‌యూవీని పూర్తిగా రోడ్ టెస్ట్ చేసిన తర్వాత మరిన్ని వివరాలను మీ ముందుకు తీసుకువస్తాము. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Comparison between new force gurkha and mahindra thar features engine specs safety
Story first published: Thursday, September 16, 2021, 17:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X