స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఇండియా ఇటీవలే, భారత మార్కెట్లో తమ సరికొత్త తరం ప్రీమియం సెడాన్ 2021 స్కొడా ఆక్టేవియాను విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో ఈ ప్రీమియం సెడాన్ హ్యుందాయ్ ఎలంట్రాతో పోటీ పడుతుంది. హ్యుందాయ్ ఎలంట్రా కూడా ప్రీమియం సెడాన్ విభాగంలో అందుబాటులో ఉన్న ఓ బెస్ట్ సెడాన్ మరియు ఇది చాలా కాలంగా భారత మార్కెట్లో ఉంది.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఈ విభాగంలో ఇతర మోడళ్లయిన హోండా సివిక్ మరియు టొయోటా కరోలా ఆల్టిస్‌లు మార్కెట్లో నిలిపివేయబడ్డాయి. దీంతో ఇప్పుడు ఈ విభాగంలో స్కొడా ఆక్టేవియా మరియు హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రెండు సెడాన్ల మధ్య ఏది ఉత్తమమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

డిజైన్:

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా ఈ విభాగంలో కొత్త డిజైన్‌తో వచ్చిన మోడల్ మరియు ఇది చాలా ఆధునికంగా కనిపిస్తుంది. ఇందులో సన్నటి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి ప్రొజెక్టర్ లాంప్స్, ఎల్‌ఈడి ఫాగ్ లైట్లు, ఫ్రంట్ క్రోమ్, పెద్ద ఎయిర్ వెంట్స్, ఏరో బ్లాక్ 17-ఇంచ్ మల్టీ-స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక వైపు స్కొడా బ్యాడ్జింగ్ ఉంటాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

అంతే కాకుండా, ఈ కారులో షార్క్ ఫిన్ యాంటెన్నా, స్లిమ్ ఎల్‌ఈడి టెయిల్ లైట్ యూనిట్, బూట్ డోరుపై పెద్ద అక్షరాలతో స్కొడా బ్యాడ్జింగ్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్కొడా ఆక్టేవియా పరిమాణం విషయానికి వస్తే, ఇది 4,689 మిమీ పొడవును, 1,829 మిమీ వెడల్పును, 1,469 మిమీ ఎత్తును మరియు దాని 2,680 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 600 లీటర్లుగా ఉంటుంది.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఇక హ్యుందాయ్ ఎలంట్రా విషయానికి వస్తే, ఇటీవలి కాలంలో ఈ కారులో డిజైన్ అప్‌గ్రేడ్స్ ఏమీ జరగలేదు. అయినప్పటికీ, ఇది బోల్డ్ మరియు సొగసైనదిగా కనిపించే సెడాన్. ఇది హ్యుందాయ్ యొక్క ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించబడి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, డైనమిక్ ఎల్‌ఈడి క్వాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్ ఇన్సర్ట్‌లు, డామినెంట్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, కోణీయంగా ఉండే స్పోర్టీ బంపర్స్, ఫాగ్ లాంప్స్ మరియు మజిక్యులర్ బోనెట్ ఉంటాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఇవే కాకుండా, డోర్ హ్యాండిల్స్‌లో క్రోమ్ గార్నిష్, స్టైలిష్ 10-స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ విండో సరౌండ్స్ మరియు వెనుక భాగంలో కూప్ లాంటి స్వీపింగ్ రూఫ్‌లైన్ వండి డిజైన్ ఎలిమెంట్స్‌ను కూడా కలిగి ఉంటుంది. పరిమాణం విషయానికి వస్తే, ఇది 4,620 మిమీ పొడవును, 1800 మిమీ వెడల్పును, 1,465 మిమీ ఎత్తును మరియు 2,700 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 458 లీటర్లుగా ఉంటుంది.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఇంటీరియర్ ఫీచర్లు:

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా యొక్క ఇంటీరియర్స్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. ఇందులోని ప్రీమియం అల్కాంటారా లెథర్ అప్‌హోలెస్ట్రీ, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కాంటన్ సరౌండ్ సిస్టమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ సీట్లు, 12-వే పవర్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్లు, రియర్ ఏసి వెంట్స్, రెండు టైప్-సి ఛార్జింగ్ సాకెట్లు మరియు క్యాబిన్ లోపల చాలా చోట్ల సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉపయోగించబడ్డాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఎలంట్రా ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కూడా లెథర్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. ఈ కారులో కూడా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, 8 ఇంచ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్, బ్లూ లింక్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 10-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్ మరియు 8-స్పీకర్లతో కూడిన ప్రీమియం ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉంటాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

సేఫ్టీ ఫీచర్లు:

స్కొడా ఆక్టేవియాలో 8 ఎయిర్‌బ్యాగులు, ఐబజ్ ఫెటీగ్ అలర్ట్ సిస్టమ్, ఈబిడి, ఈఎస్‌సి, ఏబిఎస్, మెకానికల్ బ్రేక్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, మల్టీ కొలైజన్ బ్రేకింగ్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, టిపిఎంఎస్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, బ్యాకప్ కెమెరా, కీలెస్ ఎంట్రీ , స్టార్ట్ / స్టాప్ స్విచ్ మరియు స్కోడా కనెక్ట్ కార్ టెక్ ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఎలంట్రాలో 6 ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ కెమెరా మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ఇంజన్, గేర్‌బాక్స్:

కొత్త 2021 స్కొడా ఆక్టేవియాలో శక్తివంతమైన 2.0-లీటర్ టిఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టందా 190 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఎలంట్రా మాత్రం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో కారులో 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది (ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండదు). ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి శక్తిని మరియు 192 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

ధర:

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా స్టైల్ మరియు ఎల్ అండ్ కె అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది, మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.25.99 లక్షలు మరియు రూ.28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. కాగా, హ్యుందాయ్ ఎలాంట్రా మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.17.85 లక్షల నుండి రూ.21.12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

స్కొడా ఆక్టేవియా వర్సెస్ హ్యుందాయ్ ఎలాంట్రా: ఈ రెండింటిలో ఏది బెస్ట్?

చివరిమాట:

కొత్త డిజైన్‌తో వచ్చిన సరికొత్త 2021 స్కొడా ఆక్టేవియా ఈ విభాగంలో అన్ని విధాలుగా ఉత్తమమైన మోడల్‌గా ఉంటుంది. అయితే, ఇందులో డీజిల్ ఆప్షన్ లేకపోవటమే నిరుత్సాహపరచే అంశం. మైలేజ్‌కు ప్రధాన్యత ఇచ్చే వారి కోసం హ్యుందాయ్ ఎలాంట్రాలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మరి, ఈ రెండింటిలో మీకు నచ్చిన మోడల్ ఏదో కామెంట్ల రూపంలో మాకు తెలియజేగలరు.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Comparison Between Skoda Octavia And Hyundai Elantra: Features, Specs And Price. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X