Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగన్ (Taigun) ను కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త Volkswagen Taigun ఎస్‌యూవీని Skoda Kushaq ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు భారతదేశం కోసం సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొత్త MQB AO-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ రెండు ఎస్‌యూవీ (కుషాక్ మరియు టైగన్) లను రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇవి రెండూ కూడా ఒకే నిర్మాణం మరియు పరికరాలను కలిగి ఉండి, చూడటానికి వేర్వేరుగా కనిపించే రెండు విభిన్న ఎస్‌యూవీలుగా ఉంటాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఇంజన్ మరియు టెక్నాలజీ పరంగా ఈ రెండు మోడళ్లు ఒకేలా ఉన్నప్పటికీ, స్కోడా కుషాక్ (Skoda Kushaq)తో పోలిస్తే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) మరింత మెరుగైన స్టైలింగ్ మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

డిజైన్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లోని లైటింగ్ పూర్తిగా ఎల్ఈడి రూపంలో ఉంటుంది. వీటిలో చతురస్రాకారపు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లు ఉన్నాయి. ఇందులో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన మజిక్యులర్ ఫ్రంట్ బంపర్ ఉంటుంది. పెద్ద హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన సెకండ్ గ్రిల్ మరియు దాని క్రింది భాగంలో సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్‌తో ఇది ముందు వైపు మంచి రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉంటుంది.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఇంకా ఇందులో రూఫ్ రెయిల్స్, బ్లాక్డ్ అవుట్ టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిని యాంటెన్నా, బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, వెనుక బంపర్‌పై క్రోమ్ గార్నిష్ మరియు బూట్ లిడ్ పొడవునా సాగే ఎల్ఈడి లైట్ స్ట్రిప్ వంటి మరెన్నో ఎక్స్టీరియర్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

Volkswagen Taigun ఎస్‌యూవీ మొత్తం 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కర్కుమా ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్, క్యాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కార్బన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో, కర్కుమా ఎల్లో మరియు వైల్డ్ చెర్రీ రెడ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మొత్తంమీద చూసుకుంటే, ఈ ఎస్‌యూవీ దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఇక స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది కూడా మజిక్యులర్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది టైగన్ మాదిరిగా ఎక్కువ భాగం క్రోమ్ ఫినిషింగ్ పొందనప్పటికీ, ఇందులో స్కోడా సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్ చుట్టూ సిల్వర్ గార్నిష్, హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన లోవర్ గ్రిల్, దాని క్రింది భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంటాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

కుషాక్‌లో హెడ్‌లైట్ క్రింది బాగంలో అమర్చినే ఫాగ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్ మరియు డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్, బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, అల్లాయ్ వీల్స్, అన్ని ఎల్ఈడి లైట్స్, వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, రూఫ్ రెయిల్స్, రియర్ స్పాయిలర్, షార్క్ ఫిని యాంటెన్నా, రియర్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు బూట్ డోరుపై క్రోమ్ స్ట్రైప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఇంజన్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ డైనమిక్ లైన్ మరియు పెర్ఫార్మెన్స్ లైన్ అనే రెండు రేంజ్‌లలో విక్రయించబడుతోంది. ఇందులోని డైనమిక్ లైన్ 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. అలాగే, పెర్ఫార్మెన్స్ లైన్ 1.5-లీటర్ టిఎస్ఐ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

స్కోడా కుషాక్ కుడా 1.0-లీటర్ టిఎస్ఐ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5 లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా టైగన్ మాదిరిగానే ఉంటాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ఫీచర్లు

కొత్త టైగన్ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్ల సీట్లు, టచ్ సెన్సిటివ్ బటన్‌లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు యాంబియెంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో హిల్-హోల్డ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ యాంకర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

కుషాక్ ఎస్‌యూవీలో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, కనెక్ట్ టెక్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఇన్-కార్ వై-ఫై మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కూడా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. సేఫ్టీ గురించి మాట్లాడితే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు వైపర్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

ధరలు

Volkswagen Taigun

డైనమిక్ లైన్ 1.0 లీటర్ టిఎస్ఐ

  • కంఫర్ట్ లైన్ మాన్యువల్ - రూ.10,49,900
  • హైలైన్ మాన్యువల్ - రూ.12,79,900
  • హైలైన్ ఆటోమేటిక్ - రూ.14,09,900
  • టాప్ లైన్ మాన్యువల్ రూ.14,56,900
  • టాప్‌లైన్ ఆటోమేటిక్ - రూ.15,90,900
  • పెర్ఫార్మెన్స్ లైన్ 1.5 లీటర్ టిఎస్ఐ

    • జిటి మాన్యువల్ - రూ.14,99,900
    • జిటి ప్లస్ డిసిటి ఆటోమేటిక్ - రూ.17,49,900
    • Volkswagen Taigun వర్సెస్ Skoda Kushaq : ఒకే ఫ్లాట్‌ఫామ్, రెండు డిజైన్స్

      Skoda Kushaq

      • యాక్టివ్ 1.0 టిఎస్ఐ - రూ.10.50 లక్షలు
      • యాంబిషన్ 1.0 టిఎస్ఐ - రూ.12.80 లక్షలు
      • ఆశయం 1.0 టిఎస్ఐ ఏటి - రూ.14.20 లక్షలు
      • స్టైల్ 1.0 టిఎస్ఐ - రూ.14.60 లక్షలు
      • స్టైల్ 1.0 టిఎస్ఐ ఏటి - రూ.16.20 లక్షలు
      • స్టైల్ 1.5 టిఎస్ఐ - రూ.16.20 లక్షలు
      • స్టైల్ 1.5 టిఎస్ఐ డిఎస్‌జి - రూ.17.60 లక్షలు
      • (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

Most Read Articles

English summary
Comparison between volkswagen taigun and skoda kushaq price specs features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X