మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

ఇటీవల కాలంలో వాహనదారులు ఎక్కువగా మాడిఫైడ్ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే చాలామంది వాహనదారులు తమకు నచ్చిన వాహనాలను తమకు నచ్చిన విధంగా మాడిఫై చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇటీవల ఒక మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ వెలుగులోకి వచ్చింది.

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

క్రెటా ఎస్‌యూవీ భారతదేశంలో కొన్ని నెలల క్రితం విడుదలైంది. మార్కెట్లో ఈ క్రెటా ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుంచి మంచి జనాదరణ పొందింది. కావున క్రెటా ఎస్‌యూవీ మంచి అమ్మకాలతో ముందుకు సాగింది.

ఇప్పుడు మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా తయారుచేయబడింది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో విఐజి ఆటో యాక్సెసరీస్ అని అప్‌లోడ్ చేశారు.

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

ఇక్కడ కనిపించే మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ టాప్ ఎండ్ మోడళ్లలో ఒకటైన ఎస్ఎక్స్(ఓ) అని తెలుస్తోంది. ఈ కారు యొక్క ముందు భాగంలో గ్రిల్ అమర్చారు, అంతే కాకుండా ఇందులో సింగిల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లకు బదులుగా ట్రయాంగిల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను అమర్చారు.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

ఈ కారు యొక్క బంపర్ లో అదనంగా సిల్వర్ గ్లైడ్ ప్లేట్స్‌తో అమర్చారు, దీనితోపాటు ఈ కారులో ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్ కూడా అమర్చారు. ఈ విధంగా మాడిఫైడ్ చేయడం వల్ల ఇది చూసిన వెంటనే క్రెటా ఎస్‌యూవీ అని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది దాని అసలైన రూపం కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ కలిగి ఉంటుంది.

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

ఈ క్రెటా ఎస్‌యూవీ యొక్క సైడ్ ప్రొఫైల్‌లో మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్ చూసే వారిని చాలా వరకు ఆకర్షించేలా చేస్తాయి. ఇందులో క్రోమ్ ఎలిమెంట్ డోర్ హ్యాండిల్ మరియు డోర్ యొక్క దిగువ భాగంలో అందించబడుతుంది. ఈ కారులో ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

ఈ మాడిఫైడ్ క్రెటాలో విస్సర్, రూఫ్ రైల్ కూడా ఏర్పాటు చేసి ఉండటం గమనించవచ్చు. కారు వెనుక భాగంలో క్రెటా యొక్క టాప్ ఎండ్ మోడల్స్ వంటి టైల్ లైట్స్ మరియు బంపర్లను కలిగి ఉంటుంది. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఈ కారు యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో షైనీ స్కఫ్ ప్లేట్లు, 7 డి కార్పెట్స్ వంటివి అమర్చారు. అంతే కాకుండా ఈ మాడిఫైడ్ కారులో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రౌండ్ లైట్లతో నవీకరించబడ్డాయి. ఇందులో ఉన్న సీట్లు కూడా మాడిఫై చేయబడింది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

మతిపోగొడుతున్న మాడిఫైడ్ క్రెటా ఎస్‌యూవీ; వివరాలు

సీట్ కవర్లు కూడా మునుపటి కంటే సాప్ట్ బ్లాక్ కలర్ లో అందించబడతాయి. ఈ కారులో టాప్-ఎండ్ మోడలింగ్ స్టీరింగ్ వీల్ మరియు బ్లాక్ అండ్ వైట్ లెదర్ ర్యాప్ డోర్ హ్యాండిల్ అమర్చారు. ఈ కారు చాలా వరకు మాడిఫై చేసినప్పటికీ దాని ఇంజిన్ లో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు.

Image Courtesy: VIG AUTO ACCESSORIES

Most Read Articles

English summary
Creta Base Variant Modified As High End Variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X