YouTube

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

కారుని ఎవరైనా గడ్డకట్టే డీప్ ఫ్రిజ్‌లో ఉంచుతారా? మీకేమన్నా పిచ్చా, అలా ఎవరు చేస్తారు అంటారా. కానీ ఓ కార్ మాత్రం అచ్చం అలానే చేసింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ రూపొందించిన కన్వర్టిబల్ స్పోర్ట్స్ కార్ 'ఎల్‌సి' కోసం కంపెనీ ఇటీవలే డీప్ ఫ్రీజ్ టెస్ట్ నిర్వహించింది.

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

ఈ 'డీప్ ఫ్రీజ్ టెస్ట్'లో భాగంగా లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారును 12 గంటలపాటు పెద్ద డీప్ ఫ్రిజ్‌లో ఉంచారు. చలి వాతావరణాల్లో కూడా తమ కారు అద్భుతమైన పనితీరును చూపిస్తుందనేది ప్రపంచానికి తెలియజేయడానికే ఈ డీప్ ఫ్రిజ్ పరీక్షను నిర్వహించినట్లు ఈ కారును తయారు చేసిన ఇంజనీర్లు చెబుతున్నారు.

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబుల్ కారును రూపొందించిన సీనియర్ ఇంజనీర్ గ్రెగ్ ఫ్లెమింగ్, ఈ కారు తీవ్ర ఉష్ణోగ్రతను తట్టుకునేలా నిర్మించబడిందని పేర్కొన్నారు. అందుకే, ఈ కారు సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు, దీనిని ఓ పెద్ద పారిశ్రామిక ఫ్రీజర్‌లో 12 గంటల పాటు ఉంచారు. ఆ సమయంలో సదరు ఫ్రీజర్‌లో ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నట్లు వారు తెలిపారు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

నిజానికి, ప్రస్తుతం మార్కెట్లో లభించే సాధారణ కార్లు తీవ్ర ఉష్ణోగ్రతల వద్ద పనిచేయడం మానేస్తాయని, చల్లటి వాతావరణంలో అందులోని పరికరాలు క్షీణించడం ప్రారంభమవుతాయని గ్రెగ్ వివరించాడు. అందుకే, ఈ లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబుల్ కారులోని పరికరాలను విపరీతమైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా నిర్మించబడ్డాయని ఆయన తెలిపారు.

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

ఫ్రీజర్‌లో కారుని పూర్తిగా చల్లబరచడానికి (ఐస్ పేరుకునేలా చేయడానికి) కారు ఉపరితలంపై పలుమార్లు చల్ల నీటిని పిచికారి చేశారు. ఇలా మొత్తం 12 గంటల పాటు -18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత వద్ద కారును డీప్ ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీశారు. కారుని ఫ్రీజర్ నుండి బయటకు తీసిన వెంటనే దానిని ఆన్ చేశారు. ఆశ్చర్యకరంగా, కారు ఇంజన్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ప్రారంభమైంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

ఫ్రీజర్ నుండి తీసిన ఈ కారు పనితీరును రేసింగ్ ట్రాక్‌లో పరీక్షించబడింది, ఆ ట్రాక్‌పై ఇది సాధారణ కారు మాదిరిగానే పనిచేసింది. ఈ కారు ఎక్కువ, తక్కువ వేగాల్లో మరియు రివర్సులో నడపడం ద్వారా పరీక్షించబడింది. ఈ విషయంలో దాని పనితీరు, సాధారణ ఉష్ణోగ్రత కలిగిన కారుతో సమానంగానే ఉందని కంపెనీ నిర్ధారించింది.

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ గురించి దాని ఇంజనీర్ గ్రెగ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ, ఈ కారుని ప్రత్యేకమైన క్లైమేట్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశామని, ఫలితంగా ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సాధారణ కారు మాదిరిగానే పనిచేస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఇందులో ఉపయోగించిన పరికరాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద స్థంభించిపోకుండా ఉంటాయని చెప్పారు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

చలికాలంలో ఈ కారులోని వాతావరణాన్ని తక్షణమే వేడిగా చేసేందుకు కూడా ఇందులో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రత్యేకించి కారు సీటు మరియు స్టీరింగ్ వీల్‌పై ఉన్న హీటింగ్ సిస్టమ్ కారణంగా, ఇది డ్రైవర్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఫలితంగా, సదరు డ్రైవర్ తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా కారును హాయిగా నడపగలడు.

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబల్ కారుకి 'డీప్ ఫ్రిజ్' పరీక్ష; మరి ఈ పరీక్షలో పాసైందా లేదా..?

లెక్సస్ ఎల్‌సి కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కార్ విషయానికి వస్తే, ఇందులో శక్తివంతమైన వి8 ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 457 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మిల్‌బ్రూక్ ప్రూవింగ్ గ్రౌండ్‌లో ఈ ఫ్రీజింగ్ పరీక్షను నిర్వహించారు. ఇదే ప్రాంతంలో సైనిక గ్రేడ్ వాహనాలకు కూడా ఉష్ణోగ్రత పరీక్షలు జరుగుతాయి. ఇందులో గరిష్టంగా 85 డిగ్రీల నుండి -60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల వద్ద సైనిక వాహనాలను పరీక్షిస్తారు.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

Most Read Articles

English summary
Deep Freeze Test For Lexus LC Convertible; Did It Survived? Lets Find Out. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X