బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

2021 ముగుస్తోంది 2022 కొత్త సంవత్సరం రావడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు, ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, 2022 జనవరి 01 నాటికి 10 సంవత్సరాలు నిండిన అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

నివేదికల ప్రకారం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ కఠినమైన చర్య తీసుకుంటోంది. కావున డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తరువాత వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా అందించే అవకాశం లేదు. కావున మీరు అటువంటి వాహనాలను ఎక్కడా ఉపయోగించడానికి అవకాశం లేదు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిండిన డీజిల్ వాహనాలకు ఎలాంటి ఎన్‌ఓసీ జారీ చేయబోమని స్పష్టం చేసింది. అంతే కాకూండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీ-NCR లో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్ మరియు నడపకుండా నిషేధించడానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

ఢిల్లీ ప్రభుతం తీసుకున్న ఈ నిర్ణయం డీజిల్ వాహన వినియోగదారుల గుండెల్లో గుబులు రేపింది. అయితే ఈ పరిస్థితిలో, ఈ వాహనాలను ఢిల్లీ నగరంలో నడపడం అనేది చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది, కావున దీనిని ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయి.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజురోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోంది. ఇందులో భాగంగానే వాహన కాలుష్య స్థాయిని తగ్గించేందుకు 2016 జూలైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

ఈ ఎన్‌జిటి ఆదేశాలకు అనుగుణంగా, డిపార్ట్‌మెంట్ 2022 జనవరి 1 నుంచి ఢిల్లీలోని 10 సంవత్సరాలు పూర్తి చేసిన లేదా పూర్తి చేసుకోనున్న అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తుంది. కానీ దేశంలోని మరే ఇతర ప్రాంతాలకైనా 10 ఏళ్ల డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలకు ఎన్‌ఓసీ జారీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ నిషేధిత ప్రాంతాలలో మాత్రం తిరిగి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే అవకాశం ఉండదు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

అయితే దేశంలో ఉన్న డీజిల్ వాహనాల యజమానులు తమ 10 ఏళ్ల పైబడిన డీజిల్ లేదా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే, వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉంటుందని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విధంగా చేస్తేనే ఈ వాహనాలు ప్రజారహాదారులపైన తిరగడానికి అనుమతించబడతాయి.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను ఈ-వెహికల్ కిట్‌లతో రీట్రోఫిట్‌మెంట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు కొన్ని వారాల క్రితం ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ రవాణా శాఖ ఆమోదించిన ఏజెన్సీల ద్వారా పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఎలక్ట్రిక్ కిట్‌లను అమర్చుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని యెడల వాహన యజమానుల వద్ద ఉన్న పాత వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాలి.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

ఢిల్లీ రవాణా శాఖ మరియు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల బృందాలు ఇప్పటికే చట్టవిరుద్ధమైన పాత వాహనాలను జప్తు చేసి, అధీకృత విక్రేతల ద్వారా వాటిని స్క్రాప్ కోసం పంపుతున్నాయి. కావున డీజిల్ వాహన వినియోగదారులు తప్పనిసరిగా తమ వాహనాలను వినియోగించాలనుకుంటే, వాటిని ఎలక్ట్రిక్ వాహనాలను మార్చుకోవాలి, లేకుంటే ఆ వాహనాలపైనా సంబంధిత అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

2015 వ సమత్సరం ఏప్రిల్ 7 న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ-NCR రోడ్లపై తిరిగే 10 సంవత్సరాల కంటే పాత అన్ని డీజిల్ వాహనాలపై నిషేధానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ తరువాత, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2016 జూలై 18 మరియు 20 న దేశ రాజధానిలో దశలవారీగా 10 నుండి 15 సంవత్సరాల వయస్సు గల డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. అక్టోబర్‌లో, PUC సర్టిఫికేట్లు లేని వాహనాలపై ఢిల్లీ రవాణా శాఖ భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. దేశ రాజధానిలోని వాహనదారులు ఇంధన స్టేషన్ల వద్ద మోహరించిన బృందాలకు పియుసి పత్రాలను చూపించాలని కోరారు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

ఆ సమయంలో చెల్లుబాటు అయ్యే PUC లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన ఎవరైనా దాదాపు రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అంతే కాకూండా తమ వాహనాలను పియుసి చేయకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ కూడా 3 నెలల వరకు రద్దు చేయబడింద. పీయూసీ సర్టిఫికెట్ ఉల్లంఘనలకు సంబంధించి ట్రాఫిక్ విభాగానికి చెందిన పలు బృందాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు 10, 15 ఏళ్ల వాహనాలు నడుపుతున్న వారిపై భారీ సంఖ్యలో చలాన్లను జారీ చేశారు.

బ్రేకింగ్ న్యూస్.. వాహనదారులకు షాకింగ్ న్యూస్: 2022 జనవరి 01 నుంచి ఈ వాహనాలు రద్దు

అదే సమయంలో సంబంధిత అధికారులు 10 లేదా 15 ఏళ్లు దాటిన దాదాపు 855 వాహనాలను కూడా సీజ్ చేశారు. వాహనం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి రెడ్ ట్రాఫిక్ లైట్ వద్ద వాహనం యొక్క ఇంజిన్‌ను ఆపాలని కూడా ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా ప్రజలు కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని కోరింది. ఏది ఏమైనా దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అన్నివిధాలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

Most Read Articles

English summary
Diesel vehicles older than 10 years to be banned in delhi from january 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X