మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

భారతదేశంలో మోడిఫైడ్ వాహనాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఈ క్రమంలో భాగంగా అనేక కొత్త వాహనాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక టాటా సుమో అత్యంత ఖరీదైన మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా రూపొందింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

భారత మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో ఒకటి ఈ మెర్సిడెస్ బెంజ్ జి-వాగన్. ఇది ఒక లగ్జరీ మోడల్ ఎస్‌యూవీ. అంతే కాదు ఇది చాలా సామర్థ్యం గల ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీ. జి-వాగన్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ అంతర్జాతీయ మార్కెట్లో చాలా సంవత్సరాలుగా అమ్ముడవుతోంది.

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

ఇక్కడ మీకు కనిపిస్తున్న మోడల్ నిజమైన బెంజ్ జి-వాగన్ కాదు. కానీ ఇది చూడటానికి జి-వాగన్ వలె రూపొందించబడింది. ఇది దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా సుమో. టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ కలిగిన పురాతన మల్టీ-యుటిలిటీ వాహనాల్లో ఇది ఒకటి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

చాలా మంది వాహనదారులకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. కానీ అధిక ధర కారణంగా ప్రతి ఒక్కరూ ఈ ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయలేరు. కానీ తమకు నచ్చిన విధంగా మరియు తమకు ఇష్టమైన కారు మాదిరిగా మాడిఫై చేసుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కారు కూడా ఈ విధంగా తయారైనదే.

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

నివేదికల ప్రకారం ఈ మాడిఫైడ్ బెంజ్ కారు తయారు చేసుకున్న వ్యక్తి, ఖరీదైన మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీకి పెద్ద అభిమాని. కావున తన వద్ద ఉన్న టాటా సుమో ఎస్‌యూవీని జి-వాగన్ లాగా మాడిఫై చేసుకున్నాడు. ఈ మాడిఫైడ్ వాహనాన్ని చూడగానే ఇది జి-క్లాస్ కాదని చెప్పడం కష్టం. ఈ మాడిఫైడ్ ఎస్‌యూవీలో, పెద్ద మెర్సిడెస్ బెంజ్ లోగో ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

ముందు భాగంలో రేడియేటర్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్స్, బోనెట్, ఫ్రంట్ బంపర్, వీల్ ఆర్చర్, అన్నీ జి-వాగన్‌లోనివే ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీలో ఫాక్స్ బోనెట్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, బ్లాక్-అవుట్ ORVM లు మరియు బ్లాక్ స్క్రీప్లను కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

AMG లోగో మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీ ముందు డోర్ పై చూడవచ్చు. వెనుక భాగంలో మెర్సిడెస్ లోగో, వీల్ మరియు టైల్ లైట్స్ ఉన్నాయి. ఇది చూడటానికి అసలైన జి-వాగన్ లాగా కనిపిస్తుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

టాటా మోటార్స్ యొక్క టాటా సుమో ఎస్‌యూవీ విషయానికొస్తే, ఇది 2019 లో భారత మార్కెట్లో అధికారికంగా నిలిపివేయబడింది. టాటా సుమో మొట్టమొదట 1994 లో ప్రారంభించబడింది. 25 ఏళ్లుగా భారత మార్కెట్లో ఉత్పత్తిలో ఉన్న టాటా సుమో దేశ భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైంది.

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

టాటా మోటార్స్ భవిష్యత్తులో సుమో ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి అప్‌గ్రేడ్ చేసే ఆలోచన లేదు. టాటా సుమో భారతదేశంలోని రెండు AIS 145 భద్రతా ప్రమాణాలు మరియు భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ పాటించడంలో విఫలమైంది.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

మీకు తెలుసా.. టాటా సుమో ఇక్కడ మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీగా మారింది

టాటా సుమో దేశీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. టాటా సుమో సంస్థ యొక్క ఎమ్‌పివి మరియు ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటి. టాటా సుమో గోల్డ్‌ను దేశీయ మార్కెట్లో చివరి వేరియంట్‌గా విడుదల చేశారు.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Take A Look At This Epic Transformation Of A Tata Sumo Into A Merc G-Wagon. Read in Telugu.
Story first published: Saturday, February 20, 2021, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X