భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో ఎట్టకేలకు కొత్త 'ఫెరారీ రోమా' విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 3.76 (ఎక్స్-షోరూమ్) లక్షలు. ఫెరారీ రోమాను ప్రపంచ మార్కెట్లో 2019 లో విడుదల చేశారు. కానీ భారతీయ మార్కెట్లో ఇప్పుడు లాంచ్ చేశారు. ఇటలీలో ప్రసిద్ధ నగరంమైన 'రోమ్' పేరును ఈ కారుకు పెట్టారు. ఈ కొత్త సూపర్ కార్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

కొత్త ఫెరారీ రోమా సూపర్ కార్ వినియోగదారులు వారి అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేయవచ్చు. ఫెరారీ రోమా సూపర్ కార్ పోర్టోఫినో మోడల్ కంటే పైన ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, మంచి పనితీరుని అందిస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

కొత్త ఫెరారీ రోమా యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో స్లిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లేర్డ్ ఫెండర్లు, బాడీ కలర్ గ్రిల్ ఇవ్వబడింది. ఈ కారు యొక్క చాసిస్ కొత్త మాడ్యులర్ టెక్నాలజీతో తయారుచేయబడింది. ఇది తక్కువ బరువుతో ఉండటమే కాకుండా, కొంత పొడవుగా కూడా ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

ఈ కారు పొడవు 4.6 మీటర్ల వరకు ఉంటుంది. కానీ దీని బరువు కేవలం 1,472 కేజీల వరకు ఉంటుంది. ఈ 2 డోర్ కూపే స్పోర్ట్స్ కారులో, కంపెనీ కొత్త డైనమిక్స్‌తో పాటు సైడ్ స్లిప్ కంట్రోల్ 6.0 ను ఉపయోగించింది, ఇది దాని డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

ఈ రోమా సూపర్ కార్ లో క్విక్ స్టీరింగ్ ఉన్నాయి. ఈ కొత్త ఫెరారీ రోమా సూపర్ కార్ లో బటన్ లోడెడ్ స్టీరింగ్ వీల్ కొత్త ఫెరారీ డిజైన్‌తో ఉంటుంది. స్టీరింగ్ వీల్‌పై చాలా కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో కంఫర్ట్, స్పోర్ట్, రేస్ మరియు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

ఈ సూపర్ కార్ యొక్క ఇంటీరియర్ లో 16 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 8.8 ఇంచెస్ ప్యాసింజర్ డిస్ప్లేపోర్ట్ ఉన్నాయి, ఇందులో క్లయింట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ రేసింగ్ సీట్లు మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

భారత్‌లో అడుగుపెట్టిన ఇటాలియన్ సూపర్ కార్; ధర రూ. 3.76 కోట్లు

కొత్త ఫెరారీ రోమా సూపర్ కార్ లో ట్విన్-టర్బో వి 8 ఇంజన్ ఉంది. ఇది పవర్ ఫుల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 602 బిహెచ్‌పి శక్తిని మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ సూపర్ కార్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిమీ.

Most Read Articles

English summary
Ferrari Launched Roma Super Car In India. Read in Telugu.
Story first published: Thursday, July 8, 2021, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X