క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ మాగ్నైట్' తొలిసారిగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సిఎస్‌డి) ద్వారా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. దేశ రక్షణ శాఖ కోసం పనిచేసే సైనికులను దృష్టిలో ఉంచుకొని, వారి కోసం ప్రభుత్వం క్యాంటీన్ స్టోర్స్ నిర్విస్తున్న సంగతి తెలిసినదే.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

నిస్సాన్ ఇండియా ఇటీవలే తమ సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీని సిఎస్‌డిలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, సిఎస్‌డి ద్వారా మొట్టమొదటి మాగ్నైట్‌ను పంపిణీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

ఈ ఫొటోలలో కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఓ ఆర్మీ జవాన్ మరియు అతని కుటుంబానికి క్యాంటీన్ స్టోర్స్ విభాగం ఆధ్వర్యంలో అందజేయటాన్ని చూడొచ్చు. ఈ ఫొటోలో నిస్సాన్ మరియు డాట్సన్ కంపెనీలు "మా హీరోలు, మాకు గర్వకారణం" అనే నినాదంతో ఓ పోస్టర్‌ను కూడా ఉంచాయి. ఈ సందర్భంగా రక్షణ దళాల సిబ్బంది చేస్తున్న సేవలను నిస్సాన్ మరియు డాట్సన్ బ్రాండ్‌లు గుర్తు చేసుకున్నాయి.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

"దేశాన్ని మరియు దేశ పౌరులను సురక్షితంగా ఉంచడానికి అంతిమ త్యాగం చేయడానికి వారు (జవాన్లు) ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ తన పోస్టులో పేర్కొన్నారు. మిలటరీకి చెందిన ఉద్యోగస్తులు వారి కుటుంబాలు క్యాంటీన్ స్టోర్స్ విభాగం నిస్సాన్ మాగ్నైట్‌ను అత్యధిక డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

ఈ ప్రక్రియలో కొనుగోలు చేయవలసిన వాహనాన్ని క్యాంటీన్ స్టోర్స్ ద్వారా ఎన్నుకోవడం, సంబంధిత డీలర్ పత్రాలను అప్‌లోడ్ చేయడం మొదలైన దశలు ఉంటాయి. స్థానిక సరఫరా ఆర్డర్ (ఎల్‌ఎస్‌ఓ) జారీ అయ్యే వరకు లభ్యత ధృవీకరణ పత్రాలు మరియు ప్రొఫార్మా ఇన్‌వాయిస్‌లు, క్యాంటీన్ కార్డ్, కెవైసి, చెల్లింపు బదిలీ వివరాలు వంటి కస్టమర్ పత్రాలు డిజిటలైజ్ చేయబడుతాయి.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

నిస్సాన్ తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్ షాప్ హోమ్ ద్వారా పారదర్శకమైన మరియు సరసమైన కార్ సేవలను అందిస్తుంది. ఇది రక్షణ సిబ్బంది తామ ఇష్టపడే వాహనాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మరియు డీలర్‌షిప్‌కు తెలియజేయడం ద్వారా ఈ సిఎస్‌డి ఆఫర్లను పొందటానికి అనుమతిస్తుంది.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ విషయానికి వస్తే, భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దేశీయ విపణిలో ఇది ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

నిస్సాన్ ఇండియా ఇటీవలే ఈ మేడ్ ఇన్ ఇండియా కారును ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. భారత మార్కెట్లో ఈ మోడల్‌ను ప్రారంభించినప్పటి నుండి, నిస్సాన్ ఇండియా ఇప్పటి వరకూ మొత్తం 15,010 మాగ్నైట్ ఎస్‌యూవీలను (మే 2021 చివరి నాటికి) ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. వీటిలో మొదటిది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా తొలి నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ డెలివరీ

ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు.

Most Read Articles

English summary
First Nissan Magnite SUV Delivered Through Canteen Stores Department In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X