అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) భారత మార్కెట్లో విక్రయించిన 31,818 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో EcoSport, Figo, Aspire మరియు Freestyle మోడళ్లు ఉన్నాయని, ఇవన్నీ జనవరి 1, 2020 మరియు జూన్ 9, 2021 మధ్య తయారు చేసిన BS6 మోడళ్లని కంపెనీ తెలిపింది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

పరిమిత కాల వ్యవధి తర్వాత ఈ వాహనాలు ఎక్కువ కాలుష్య ఉద్ఘారాలను విడుదల చేసే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. Figo మరియు EcoSport యొక్క అంబియంట్ డీజిల్ వేరియంట్‌ లు మరియు ఇతర రెండు మోడళ్లయిన Aspire మరియు Freestyle డీజిల్ యొక్క అన్ని వేరియంట్‌ లు ఈ తాజా రీకాల్‌ కు వర్తిస్తాయి.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

ఈ మోడళ్లన్నీ కూడా BS6 అవతార్‌లో జనవరి 2020 మరియు ఫిబ్రవరి నెలల్లో తయారు చేయబడ్డాయి. కాబట్టి, అన్ని మోడళ్లు ఈ సమస్యతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ రీకాల్ చేసిన వాటిలో అన్నీ BS6 మోడళ్లు మాత్రమే ఉన్నాయి, BS4 మోడళ్లు లేవు.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

ఈ మొత్తం రీకాల్ లో 31,818 యూనిట్ల వాహనాలు ప్రభావితమయ్యాయి. వీటన్నింటిలో కూడా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ వాహనాల కలిగే ప్రధాన సమస్య ఏమిటంటే, పరిమిత సమయం తర్వాత, ఈ వాహనాలు ఎక్కువగా కాలుష్యాన్ని విడుదల చేస్తాయని కంపెనీ గుర్తింది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

Ford తమ BS6 ఉద్గార నిబంధనల పరీక్ష సమయంలో ఈ విషయం కనుగొనబడింది. అయితే, ఈ లోపం వలన ఇది వాహనం యొక్క భద్రత లేదా డ్రైవింగ్‌లో ఎలాంటి సమస్యను కలిగించదు మరియు వాహనం యొక్క అన్ని ఫీచర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిగ్గా పని చేస్తాయని కంపెనీ తెలిపింది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

మరి ఈ రీకాల్ కు మీ వద్ద Ford కారు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ సమీపంలోని అధీకృత Ford డీలర్‌షిప్‌ ని సంప్రదించవచ్చు లేదా ఫోర్డ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి, మీ వాహనం యొక్క వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (VIN) ను నమోదు చేసి తెలుసుకోవచ్చు.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

విన్ నెంబర్ ను కారు ముందు భాగంలో విండ్‌షీల్డ్ పై గుర్తించవచ్చు లేదంటే మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పై కూడా ఈ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ సమస్య గురించి త్వరలో తమ కస్టమర్లకు తెలియజేస్తామని మరియు ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుందని Ford ఓ ప్రకటనలో తెలిపింది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

నిజానికి ఇలాంటి రీకాల్‌ లు బ్రాండ్‌ పై వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఇటీవలి కాలంలో అనేక రకాల వాహనాలు మార్కెట్లో రీకాల్ చేయబడ్డాయి. గత 2020 లో భారతదేశంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీల నుండి మొత్తం 3,80,615 యూనిట్ల వాహనాలను రీకాల్ చేయగా, 2021 లో ఇప్పటివరకు 5 లక్షల వాహనాలను రీకాల్ చేయబడ్డాయి.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

అమెరికన్ బ్రాండ్ Ford కొంతకాలంగా భారత మార్కెట్లో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇటీవల కంపెనీ కొత్త మోడళ్లను, కొత్త గేర్‌బాక్స్‌లు మరియు అనేక అప్‌డేట్‌లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అప్‌డేట్‌ లతో కూడిన మోడళ్లను తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త మోడళ్లలో Ford Aspire ఆటోమేటిక్ కూడా ఉంది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

Ford Figo ఆటోమేటిక్ విడుదల

ఇదిలా ఉంటే, Ford ఇటీవలే తమ Figo హ్యాచ్‌బ్యాక్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో కూడిన టైటానియం మరియు టైటానియం ప్లస్ వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో టైటానియం ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టైటానియం ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 8.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ రెండు వేరియంట్లు కూడా 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ తో లభ్యం కానున్నాయి.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

పండుగ సీజన్‌లో కొత్త Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ విడుదల

Ford ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ (Ecosport) లో కూడా కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో గత కొంతకాలంగా కంపెనీ ఈ అప్‌డేటెడ్ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

తాజా సమచారం ప్రకారం, ఈ కొత్త 2021 Ecosport కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత పండుగ సీజన్ లో విడుదల కావచ్చని తెలుస్తోంది. కొత్త 2021 Ford Ecosport ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్టీరియర్ లో చేయబోయే మార్పులను గమనిస్తే, ఇందులో అంచుల చుట్టూ క్రోమ్ లైనింగ్ మరియు కొత్త ఇన్సర్ట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్, తిరగేసిన L- ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

అలాగే, ఇంటీరియర్స్ లో చేయబోయే మార్పుల విషయానికి వస్తే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కొత్త సీట్ అప్‌హోలెస్ట్రీ, ఇల్యుమినేటెడ్ అండ్ కూల్డ్ గ్లవ్ బాక్స్, అప్‌డేట్ చేయబడిన కనెక్టింగ్ టెక్నాలజీ, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ సపోర్ట్, SYNC3 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మరికొన్ని ఇతర డిజైన్ మార్పులను ఇందులో ఆశించవచ్చు. కానీ, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

Maruti Suzki రీకాల్.. 1.81 లక్షల కార్లు వెనక్కి..

అమెరికన్ కార్ బ్రాండ్ Ford మాదిరిగానే, భారదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేసింది. మోటార్ జనరేటర్ యూనిట్‌లోని లోపం కారణంగా సుమారు 1.81 లక్షల కార్లను కంపెనీ రీకాల్ చేసింది.

అలెర్ట్.. అలెర్ట్.. 31,818 Ford కార్లు రీకాల్.. ఇందులో మీ కారుందేమో చెక్ చేసుకోండి !

Maruti Suzuki రీకాల్ చేసిన మోడళ్లలో సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మే 04, 2018 నుండి అక్టోబర్ 27, 2020 మధ్య కాలంలో తయారు చేయబడిన పెట్రోల్ వాహనాలని, వీటి సంఖ్య సుమారు 1,81,754 యూనిట్లుగా ఉంటుదని కంపెనీ తెలిపింది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india recalls 31818 cars due to higher exhaust tailpipe emissions details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X