బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

భారత మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన వాహనాలలో హిందుస్థాన్ మోటార్స్ యొక్క అంబాసిడర్‌ ఒకటి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆటోమోటివ్ శకాన్ని ప్రారంభించిన కారు ఈ అంబాసిడర్. అయితే తర్వాత కాలంలో ఇది బిఎస్ 4 ఉద్గార నిబంధనల కారణంగా 2014లో నిలిపివేయబడింది. కానీ ఈ కారుని ఇప్పటికి అప్పుడప్పుడు భారతీయ రోడ్లపై చూడవచ్చు.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

హిందుస్థాన్ అంబాసిడర్‌ ఇప్పటికీ చాలా చోట్ల టాక్సీ మరియు క్యాబ్‌లుగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా అంబాసిడర్ కార్లు మాడిఫైడ్ చేయబడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే తరహాలో మరో మాడిఫైడ్ అంబాసిడర్ వీడియో బయటపడింది.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

ఈ వీడియో హార్స్‌పవర్ కార్టెల్‌ అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేయబడింది. ఈ కారును కెఎస్ మోటోస్పోర్ట్ రిస్టోర్ చేసింది. ఈ అంబాసిడర్ కారు మునుపటి కంటే మరింత ఎక్కువ పనితీరు కోసం సవరించబడింది. కెఎస్ మోటార్‌స్పోర్ట్ యజమాని కరణ్ షా కారు సవరణ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అందించారు.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

కారు యొక్క అసలు ఆలోచన అతనిది కాదని చెప్పడం ద్వారా వీడియో ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్‌లోని ఒక వ్యక్తి అతన్ని సంప్రదించి తన అంబాసిడర్ కారు గరిష్టంగా 500 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలిగేలా తయారుచేయమని కోరినట్లు తెలిపాడు. ఈ విధముగా రిస్టోర్ చేసినట్లయితే దానిని ఇంగ్లాండ్‌లో ఉపయోగించాలనుకున్నాడు.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

ఈ అంబాసిడర్ యొక్క బేస్ మరియు ఇంజిన్ నిస్సాన్ ఎస్ 13 నుండి తీసుకోబడింది మరియు ఎస్ఆర్ 20 ఇంజిన్ కొన్ని కార్ల కోసం ఉపయోగించబడింది. కారు ముందు భాగంలో సస్పెన్షన్ మౌంట్, గేర్‌బాక్స్ టన్నెల్, ఫెండర్ మరియు లిప్ బంపర్‌ను బాడీ షాప్‌లో తయారు చేయబడ్డాయి.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

ఈ కారు యొక్క మిషనైజేషన్ (యాంత్రీకరణ) మొత్తం కేవలం రెండు, మూడు నెలల్లో పూర్తయింది. అయితే బాడీ వర్క్ మాత్రం ఆరు నుండి ఎనిమిది నెలలు పట్టింది. ఎందుకంటే బంపర్లు, బోనెట్‌లు, రబ్బరు బీడింగ్, గ్లాసెస్ మొదలైనవి షాప్ ల ద్వారా సేకరించాల్సి వచ్చింది.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

ఇక్కడ రీస్టోర్ చేయబడిన అంబాసిడర్ చాలా పాత వాహనం కావడంతో ఇంత సమయం పట్టింది. రీస్టోర్ చేయబడిన అంబాసిడర్ కారు ముందు భాగంలో 8-పిస్టన్ బ్రేక్ కాలిపర్‌లను మరియు వెనుక భాగంలో 4-పిస్టన్ బ్రేక్ కాలిపర్‌లను ఉపయోగిస్తుంది.

ఈ అంబాసిడర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నిస్సాన్ ఎస్ఆర్ 20 లోని ఇంజిన్ ఉపయోగించబడింది. ఇది 200 బిహెచ్‌పి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రీస్టోర్ చేయబడిన అంబాసిడర్ కారులో నిస్సాన్ ఎస్ 13 బేస్ ఉపయోగించబడింది. అంబాసిడర్ కారు రిస్టోర్ చేయడానికి అయిన మొత్తం ఖర్చు సుమారు రూ. 30 లక్షలు.

బిఎండబ్ల్యుకి పోటీ ఇవ్వగల మాడిఫైడ్ అంబాసిడర్; వివరాలు

రీస్టోర్ చేయబడిన ఈ కారు రెడ్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది ఇప్పుడు మునుపటి కంటే మంచి సామర్థ్యం కలిగి ఉండేలా తయారుచేయబడింది. దీన్ని బట్టి చూస్తే వాహనదారులకు ఇప్పటికి కూడా అంబాసిడర్ కార్ల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.

Image Courtesy: Horsepower Cartel

Most Read Articles

English summary
Hindustan Ambassador With Over 200 Bhp Costs 30 Lakh To Build. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X