సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ఈ సృష్టిలో మానవ మేధస్సు నిజంగా చాలా అద్భుతమైనది, ఎందుకంటే ఆ మేథస్సుతోనే ఇప్పటికే ఈ భూమిపై ఎన్నో చిత్రాలను సృష్టించారు. ప్రపంచంలో ప్రతి రోజూ ఎదో ఒక మూల విచిత్ర సంఘటన జరుగుతూనే ఉంటుంది, అలాంటివి మనం అనునిత్యం గమనిస్తూ ఉంటాడు.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ప్రపంచం బాగా అభివృద్ధి వైపు పయనిస్తున్న తరుణంలో మనిషి కూడా తన ఆశలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తమకు నచ్చిన వాహనాలను తమకు నచ్చిన రీతిలో మాడిఫైడ్ చేసుకుంటూ ఉంటాడు.. ఇలాంటి మాడిఫైడ్ కార్లు మరియు బైకుల గురించి మనం ఇది వరకే చాలా సంఘటనలు తెలుసుకున్నాం. ఇదే రీతిలో ఇప్పుడు కూడా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ సంఘటన ఒక రకముగా విచిత్రంగానే ఉంటుంది, ఎందుకంటే ఒక కారు సైకిల్ పెడల్ తొక్కితే ముందుకు కదులుతోంది. ఇది వినడానికి కొంత విడ్డూరంగా ఉన్నా, వీడియో చూస్తే తప్పకుండా నమ్మాల్సిందే.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

నివేదికల ప్రకారం, దీనికి సంబంధించిన వీడియో లైఫ్ ఓడి అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో మాడిఫైడ్ చేయడానికి ఉపయోగించిన కారు హోండా సివిక్. సివిక్ కారులోని పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించి, సైక్లింగ్ చేసినప్పుడు కారు కదిలేవిధంగా దీన్ని తయారుచేశారు.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ఈ విధమైన కారు తయారుచేయడానికి, యువకులు రెండు సైకిల్ పెడల్స్ ఉపయోగించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ సైకిల్ కి అమర్చిన పెడల్ తొక్కుతుంటే కారు గంటకు 3.22 కి.మీ వేగంతో ముందుకు కదులుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే, సైకిల్ యొక్క వెనుక చక్రం తొలగించబడింది.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

సైకిల్ యొక్క వెనుక చక్రం తొలగించబడినప్పటికీ, కారు ముందుకు వెళ్ళడానికి వీలుగా సైకిల్ చైన్ జతచేయబడుతుంది. ఈ విధంగా అమర్చిన తర్వాత, నార్మల్ సైకిల్ తొక్కిన విధంగా తొక్కవచ్చు, అప్పుడు సైకిల్ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అయితే కారులో కూర్చున్న వారు మాత్రమే కారుని కంట్రోల్ చేయగలరు.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ఈ కారులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే వెళ్ళగలరు. ఈ కారు గురించి చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ, ఈ కారు రోడ్డుపైకి వెళ్తే ఒక సమస్యగా ఉంటుంది. దీనికి వికారమైన ఆకారమే, ఇది రోడ్డుపై ఉన్న ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అంతే కాదు ఇది పోలీసుల దృష్టిని కూడా ఆకర్షించింది. అదే కారణంతో వింతగా ఉన్న కారును పోలీసులు అడ్డుకుని, జరిమానా విధించారు.

రోజురోజుకి పెట్రోల్, డీజిల్ వాహనాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇది భావి తరాలకు అంత మంచిది కాదు. అంతే కాదు చాలా దేశాల్లో ఈ ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ కారణాల వల్లనే డీజిలు మరియు పెట్రోల్ వాహనాలకు బదులుగా, ఎలక్ట్రిక్ వాహనాలను లేదా మనం పైన చెప్పుకున్నటువంటి వాహనాలు పుట్టుకొస్తున్నాయి.

సైకిల్ తొక్కితే కారు కదులుతుంది.. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమే

ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం వల్ల కాలుష్య స్థాయిని తగ్గిచవచ్చు, కానీ ఇటువంటి విచిత్రమైన వాహనాలు ఉపయోగించడం చట్టరీత్యా నేరం, కావున వీలైనంతవరకు ఇలాంటి వాహనాలు ప్రజా రహదారులపై వినియోగించరాదు.

Image Courtesy: Life OD

Most Read Articles

English summary
Honda Civic Car Moves With The Help Of Bicycle Pedal. Read in Telugu.
Story first published: Thursday, July 8, 2021, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X