మార్కెట్లో హ్యుందాయ్ ఆల్కాజార్ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన కొత్త ఆల్కాజార్‌ను విడుదల చేసి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. అయితే ఈ నెల రోజుల కాలంలోనే దాదాపు 11,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఇది మాత్రమే కాకూండా విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ కొత్త ఎస్‌యూవీకి మంచి స్పందన వస్తోందని కూడా కంపెనీ తెలిపింది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ క్రెటా యొక్క 7 సీట్స్ వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ఆల్కాజార్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్) కాగా, ఆల్కాజార్ టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త ఆల్కాజర్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, హ్యుందాయ్ అల్కాజార్ యొక్క టాప్ రేంజ్ సిగ్నేచర్‌ను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వెర్షన్ లో డీజిల్ మోడళ్ల కూడా దాదాపు 63% బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ అల్కాజార్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్, వెనుక భాగంలో ప్రముఖ క్వార్టర్ గ్లాస్ మరియు 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవును 4,330 మి.లీ, 1,790 మి.లీ వద్ద కంపెనీ ఉంచగా, వీల్ బేస్ మాత్రం 2,760 మిమీ పొడవు వుంది. ఇది హ్యుందాయ్ క్రెటా కంటే కూడా 150 మిమీ పొడవుగా ఉంటుంది. ఇందులో 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ ఉంటుంది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజన్ ఆప్షన్లలో తీసుకురాబడింది, వీటిలో 1.5-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. దీని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్ మరియు 191 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్-డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ అల్కాజార్‌లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ, మారుతి సుజుకి ఇండియా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. భారతదేశంలో ఈ కంపెనీ 10 మిలియన్ కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త హ్యుందాయ్ అల్కాజార్‌ను ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి తన 10 మిలియన్ల కారుగా విడుదల చేసింది.

మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజర్‌ అదుర్స్.. ఒక్క నెలకే 11,000 బుకింగ్స్

హ్యుందాయ్ అల్కాజార్ పరిమాణంలో హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో, హ్యుందాయ్ అల్కాజార్, రాబోయే జీప్ 7 సీట్స్ ఎస్‌యూవీ, ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారి వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai Alcazar Booking Crosses 11,000 Units. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X