హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ 'అల్కజార్'ను రేపు (ఏప్రిల్ 6, 2021వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ అల్కజార్‌కి సంబంధించిన ఓ కొత్త టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

తమిళనాడు స్టేట్ టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో కూడిన ఓ హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని కంపెనీ ఈ టీజర్ వీడియోలో చూపిస్తుంది. ఇందులో ఎస్‌యూవీని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉంటుంది. ఈ వీడియోలో కంపెనీ అల్కజార్ యొక్క పనతీరు మరియు హ్యాండ్లింగ్ వంటి అంశాలను హైలైట్ చేసింది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

భారతదేశంలో హ్యుందాయ్ అల్కజార్ టెస్టింగ్ దశ పూర్తయి, ఈ మోడల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ క్యామోఫ్లేజ్ చేసినప్పటికీ, ఇందులో అనేక డిజైన్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూడటానికి ముందు వైపు నుండి క్రెటా మాదిరిగా అనిపిస్తుంది.

MOST READ: గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

ఈ టీజర్ వీడియో ప్రకారం, ఇందులో బోల్డ్ సి-పిల్లర్, ఎల్‌ఈడి హెడ్‌లైట్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి విషయాలు వెల్లడయ్యాయి. ఇంకా ఇందులో సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, వెనుక భాగంలో సి-ఆకారపు టెయిల్ ల్యాంప్ మరియు బూట్ డోరుపై క్రోమ్ స్ట్రిప్, ఇరువైపులా సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్‌తో పాటుగా అమర్చిన రియర్ స్పాయిలర్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్ వంటి ఇతర డిజైన్ ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అల్కజార్ ఎస్‌యూవీని భారతదేశంలోని వివిధ రకాల రోడ్లు మరియు వివిధ రకాల వాతావరణాల్లో విజయవంతంగా పరీక్షించింది. ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లు, హై స్పీడ్ లిమిట్ హైవేలు, కొండ ప్రాంతాలతో సహా అనేక సవాలు వాతావరణాలలో ఆల్కాజార్‌ను కంపెనీ పరీక్షించింది. గత నెలలో కంపెనీ దీని స్కెచ్ చిత్రాలను విడుదల చేయగా, రేపు (ఏప్రిల్ 6) దీని పరదాలను పూర్తిగా తొలగించనుంది.

MOST READ:మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

హ్యుందాయ్ అల్కజార్ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే, అల్కజార్ పొడవు మరియు వీల్‌బేస్ వరుసగా 30 మి.మీ మరియు 20 మి.మీ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూడవ వరుసలో మంచి క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో బేజ్ అండ్ బ్లాక్ కలర్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డాష్‌బోర్డ్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా ఇందులో 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టమ్ మరియు హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ ద్వారా, ఇందులో 50కి పైగా ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఈ ఎస్‌యూవీలో ఫార్వర్డ్ కొలైజన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలైజన్ ఎవిడెన్స్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి స్మార్ట్‌సెన్స్ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ విడుదల

అల్కజార్‌లో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి లక్షణాలను కూడా ఆశించవచ్చు. ఇకపోతే, ఇందులో ఆటోమేటిక్ డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, వాయిస్ కమాండ్, పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ మరియు లెదర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

Most Read Articles

English summary
Hyundai Release New Teaser For Alcazar 7-Seater SUV, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X