డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ ఇసుజు మోటార్స్, ఈ నెల ప్రారంభంలో తమ డ్యూయల్ క్యాబిన్ పిక్-అప్ ట్రక్ డి-మాక్స్‌ను రెండు వేరియంట్లను భారతదేశంలో ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసినదే.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

ఇందులో రెగ్యులర్ ఇసుజు వి-క్రాస్‌తో పాటుగా కంపెనీ ఓ బేస్ స్పెక్ హై-ల్యాండర్ వేరియంట్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ బేస్-స్పెక్ వేరియంట్ దేశంలోని అన్ని ఇసుజు డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

తాజాగా ఓ డీలర్‌షిప్‌లో కనిపించిన ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ బేస్-స్పెక్ వేరియంట్ చిత్రాలు, వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. చిత్రాలలో చూసినట్లుగా ఇసుజు హై-ల్యాండర్ వేరియంట్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ఇది ఖచ్చితంగా డి-మాక్స్ ఎస్-క్యాబ్ కన్నా ప్రీమియంగా ఉంటుంది.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ 225 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో స్పీడ్ లిమిటర్ ఉండదు. ఇందులో స్టీల్ వీల్స్ ఉంటాయి, వాటిపై సిల్వర్ కలర్ వీల్ క్యాప్స్ ఉంటాయి. ఇవి దూరం నుంచి చూడటానికి అల్లాయ్ వీల్స్ మాదిరిగా కనిపిస్తాయి.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

ఈ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్కులోని ఫ్రంట్ బంపర్ మరింత స్పోర్టి డిజైన్‌ను కలిగి ఉంటుంది. కానీ, ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్ ఉండవు, వాటి స్థానంలో ఫేక్ ఎయిర్ ఇన్‌టేక్స్ కనిపిస్తాయి. బానెట్‌పై ఇసుజు అనే క్రోమ్ బ్యాడ్జింద్ కనిపిస్తుంది మరియు దీని సైడ్ మిర్రర్స్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. సైడ్ డోర్ హ్యాండిల్స్ మాత్రం బాడీ కలర్‌లో ఫినిష్ చేయబడి కనిపిస్తాయి.

MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ వేరియంట్‌లో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మరియు బేసిక్ ఇంటీరియర్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులోని స్టీరింగ్ వీల్ కూడా చాలా సింపుల్‌గా ఎలాంటి కంట్రోల్స్ లేకుండా ఉంటుంది. క్యాబిన్ అంతటా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ కనిపిస్తుంది.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డుపై వినోదం కోసం ఏ రకమైన పరికరం అందుబాటులో లేదు. ఈ వేరియంట్లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ హెడ్-యూనిట్ కూడా అందుబాటులో లేదు. అయితే, ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ యూనిట్‌ని కంపెనీ ద్వారా కానీ లేదా థర్డ్ పార్టీ ద్వారా కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే సౌలభ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

ఇంజన్ విషయానికి వస్తే, ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ వేరియంట్‌లో కంపెనీ గతంలో ఉపయోగించిన 1.9-లీటర్ డీజిల్ ఇంజన్‌నే బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించవచ్చని అంచనా.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

బిఎస్4 మోడల్‌లో ఉపయోగించిన 1.9 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బేస్ వేరియంట్ హై-ల్యాండర్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు, ఇది కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తోనే లభిస్తుంది. హై-ల్యాండర్ వేరియంట్ ధర డి-మాక్స్ ఎస్-క్యాబ్ కంటే 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

అయితే, డి-మ్యాక్స్‌లో ప్రీమియం వేరియంట్ అయిన వి-క్రాస్‌ను కంపెనీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందించే అవకాశం ఉంది. ఈ వేరియంట్ ఇటీవలే ఓ డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైంది. మరింత శక్తివంతమైన 2.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో కొత్త 2021 వి-మ్యాక్స్‌ను విడుదల చేయనున్నారు.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

అంతేకాకుండా, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఎల్‌ఇడి లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసి, పవర్ విండోస్ మరియు పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ప్రీమియం, కంఫర్ట్ ఫీచర్లను అందించనున్నారు.

డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!

సేఫ్టీ విషయానికి వస్తే, ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్6 మోడల్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Source: Team BHP

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu D-Max Hi-Lander Base Variant Spotted At Dealership, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X