డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

భారత మార్కెట్లో ఇసుజు డి-మాక్స్ తన బిఎస్ 6 వెర్షన్స్ వి-క్రాస్ మరియు వి-క్రాస్ హై-లాండర్ పిక్-అప్ ట్రక్కులను ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. ఇవి మునుపటి కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ డీలర్‌షిప్‌కి చేరుకోవడం ప్రారంభించాయి. కావున ఈ ఎస్‌యూవీ డెలివరీని త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ రెండు ట్రిమ్ లెవెల్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి జె మరియు జెడ్ ప్రెస్టీజ్ వేరియంట్లు. కొత్త బిఎస్ 6 వి-క్రాస్ టాప్ మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సిక్స్-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

కొత్త బిఎస్ 6 హై-లాండర్ లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడలేదు. కంపెనీ ఈ కొత్త వి-క్రాస్ హై-లాండర్ లో చాలా యాక్ససరీస్ అందించబోతుంది. కొత్త వి-క్రాస్ మరియు హై-లాండర్ ఒకే 1.9 లీటర్ బిఎస్ 6 కంప్లైంట్ టర్బో డీజిల్ ఇంజన్ కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 163 హెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సోనాలిక.. ఏంటనుకుంటున్నారా?

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

హై లాండర్ 6 స్పీడ్ మాన్యువల్, టూ వీల్ డ్రైవ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అదే సమయంలో, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆప్సన్ కూడా వి-క్రాస్ లో ఇవ్వబడింది. ఈ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ వినియోగదారులలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. కావున వీటిని ఎక్కువగా ఆఫ్-రోడ్ ప్రేమికులు కొనుగోలు చేస్తారు.

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా కారుకు సిల్వర్ రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్ మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిష్ ఫ్రంట్ గ్రిల్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటో క్రూయిజ్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు వంటివి కూడా ఉన్నాయి.

MOST READ:2021 F3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్‌ ఆవిష్కరించిన ఎంవి అగస్టా; వివరాలు

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

ఇసుజు వి-క్రాస్ హై-లాండర్ 4x2 జె మాన్యువల్ మరియు 4x4 జె మాన్యువల్ మరియు టాప్ మోడల్ 4x4 ఆటోమేటిక్ జె ప్రెస్టీజ్ వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఈ వి-క్రాస్ 2019 లో అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త వెర్షన్ మోడల్ కాదు, ఇది దాని పాత వెర్షన్ యొక్క అప్డేటెడ్ బిఎస్ 6 వెర్షన్.

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

ఇసుజు వి-క్రాస్ యొక్క ధరల విషయానికి వస్తే, ఇందులో ఉన్న 4 ఎక్స్ 2 జె మాన్యువల్ ధర రూ. 19.98 లక్షలు కాగా, 4 ఎక్స్ 4 జె మాన్యువల్ ధర రూ. 20.98 లక్షల వరకు ఉంటుంది. దీని టాప్ మోడల్ 4 ఎక్స్ 4 ఆటోమేటిక్ జె ప్రెస్టీజ్ ధర రూ. 24.49 లక్షల (ఎక్స్ షోరూమ్, తమిళనాడు) వరకు ఉంది.

MOST READ:ACP అని చెప్పుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

డీలర్‌షిప్‌ చేరుకున్న బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్, డెలివరీ ఎప్పుడంటే?

భారతదేశంలో 2020 ఏప్రిల్ అమలులోకి వచ్చిన బిఎస్ 6 రూల్స్ ప్రకారం కంపెనీ ఈ మోడల్ ని మార్కెట్లో విక్రయించ లేదు. అయితే ఆ తరువాత కొంత కాలానికి ఇవి బిఎస్ 6 అప్డేట్స్ పొందటం వల్ల మల్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఎస్‌యూవీ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. కావున త్వరలో ఈ ఎస్‌యూవీ భారతీయ రోడ్లపై కనిపించనుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
BS6 Isuzu V-Cross Reaches Dealership. Read in Telugu.
Story first published: Monday, May 31, 2021, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X