కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

జపనీస్ కార్ బ్రాండ్ ఇసుజు మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఉత్పత్తులపై సర్వీస్ మరియు వారంటీల గడువును పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ల కారణంగా, ఈ సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోలేని కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇసుజు మోటార్స్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో వారంటీ ముగిసిన వాహనాల కోసం ఇప్పుడు ఈ వారంటీ వ్యవధిని జులై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదేవిధంగా, మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో పీరియాడిక్ సర్వీస్ గడువు ముగిసిన వాహనాలకు కూడా ఈ గడువు తేదీని జూలై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ వివరించింది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇసుజు మోటార్స్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ బిఎస్ 6 డి-మాక్స్ రేంజ్ పికప్ ట్రక్కులను మరియు కొత్త బిఎస్ 6 ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఇసుజు డి-మ్యాక్స్ రేంజ్‌లో కంపెనీ హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ అనే రెండు వెర్షన్లను విక్రయిస్తోంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

వీటిలో ఇసుజు హై-ల్యాండర్ ఒక స్టాండర్డ్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. దీనిని వ్యక్తిగత ప్రయోజనం కోసం లేదా వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో చాలా తక్కువ ఫీచర్లు ఉంటాయి. ఇకపోతే, ఇసుజు వి-క్రాస్ పికప్ ట్రక్కును మాత్రం ప్రీమియం లైఫ్‌స్టైల్ వాహనంగా ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

భారత మార్కెట్లో బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ మోడళ్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.16.98 లక్షలు మరియు రూ.19.98 లక్షలుగా ఉన్నాయి. రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా. ఇక ప్రీమియం లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ప్రవేశపెట్టిన ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ ధర విషయానికి వస్తే, ఇది రూ.33.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ రెండు పికప్ ట్రక్కులు కూడా ఒకేరకమైన బిఎస్ 6-కంప్లైంట్ 1.9-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 163 హెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో హై-లాండర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 2-వీల్ డ్రైవ్ సిస్టమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, వి-క్రాస్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇక కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కొత్త 2021 ఎమ్‌యు-ఎక్స్ బిఎస్ 6 మోడల్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు లో రేంజ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇసుజు డి-మాక్స్‌ వి-క్రాస్ ప్రీమియం లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కులో లభించే కొన్ని కీలకమైన ఫీచర్లను లభిస్తే, ఇందులో బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, సైడ్ స్టెప్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఎంట్రీ లెవల్ పికప్‌గా ప్రవేశపెట్టబడిన ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ మోడల్‌లో మాత్రం మాన్యువల్ ఏసి, రెండవ వరుసలో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్టులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎమ్ఐడి స్క్రీన్ ఉంటుంది కానీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ మాత్రం ఇందులో ఉండదు. కస్టమర్లు దీనిని ఆప్షనల్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇక కొత్త 2021 ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీలో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సైడ్-స్టెప్ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ స్కఫ్ ప్లేట్‌లు, డ్యూయల్ టోన్ బంపర్‌లు మొదలైన ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారత్‌లో ఇసుజు వాహనాలపై సర్వీస్, వారంటీ పొడగింపు!

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి స్క్రీన్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu Extended The Validity Of Warranty And Service Schedules In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X