భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ఇసుజు ఇండియా తన ప్యాసింజర్ వాహన శ్రేణిని అప్డేట్ చేసి విడుదల చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ తన ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ప్రీమియం ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ప్రీమియం ఎస్‌యూవీ అనేది ఇసుజు బ్రాండ్ యొక్క ప్రధాన మోడల్స్. ఈ కొత్త ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ప్రీమియం ఎస్‌యూవీ ధర రూ. 33.23 లక్షల వద్ద ప్రారంభమవుతుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

కొత్త 2021 ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ప్రీమియం ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4X2 AT మరియు 4X4 AT వేరియంట్లు. ఇందులో దాని టాప్-స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 33.19 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు కంపెనీ తన కొత్త 2021 ఎంయు-ఎక్స్ యొక్క బుకింగ్స్ భారతదేశం అంతటా స్వీకరించబడుతుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

కొత్త 2021 ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ప్రీమియం ఎస్‌యూవీలోని అతిపెద్ద మార్పు ఏమిటంటే ఇందులో అప్డేట్ చేసిన బిఎస్ 6 ఇంజిన్. ఈ ఎస్‌యూవీ దాని బిఎస్ 4 మోడళ్లకు శక్తినిచ్చే అదే పెద్ద 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బిస్ 6 ఇంజిన్ 3.0-లీటర్ ఇంజన్ బిఎస్ 4 యూనిట్ మాదిరిగానే శక్తిని మరియు టార్క్స్ గణాంకాలను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

ఈ ఇంజిన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు లో రేంజ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది అప్డేట్ చేసిన కొత్త పవర్‌ట్రెయిన్‌ కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

2021 ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీ దాదాపు దాని బిఎస్ 4 మోడల్ లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. ఇక ఇందులో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టైల్ లాంప్స్, 18 ఇంచెస్ వీల్స్, సైడ్-స్టెప్ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, ఫ్రంట్ మరియు బ్యాక్ స్కఫ్ ప్లేట్‌లతో పాటు డ్యూయల్ టోన్ బంపర్‌లతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

కొత్త 2021 ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్ గమనించినట్లయితే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకు మద్దతుగా 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి స్క్రీన్‌తో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఇబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటికి ఉన్నాయి.

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

ఎంయు-ఎక్స్ లాంచ్‌తో పాటు కంపెనీ తన బిఎస్ 6 పిక్-అప్ ఎస్‌యూవీ శ్రేణిలో డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6 మరియు కొత్త హై-లాండర్ బిఎస్ 6 పిక్-అప్ ట్రక్కులను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర వరుసగా రూ. 19.98 లక్షలు మరియు రూ. 16.98 లక్షలు. ఈ కొత్త వేరియంట్స్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MOST READ:మీకు తెలుసా.. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఈ టెస్ట్ అవసరం లేదు

భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఇసుజు 2021 MU-X; పూర్తి వివరాలు

కొత్త 2021 ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ఎస్‌యూవీ బ్రాండ్ యొక్క లైనప్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది మంచి రహదారి సామర్త్యాన్ని కలిగి ఉండటం వల్ల, ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు ఎంజి గ్లోస్టర్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu Launched The All New BS6 MU-X SUV In India For Rs 33.23 Lakh. Read in Telugu.
Story first published: Monday, May 10, 2021, 15:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X