జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతీయ మార్కెట్లో తన కొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతొంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ విడుదల చేయనున్న ఈ కొత్త మోడల్ 'ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్‌' మోడల్. కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

జాగ్వార్ ఎఫ్- టైప్ ఆర్- డైనమిక్ బ్లాక్ నిగనిగలాడే బ్లాక్ ఫినిషింగ్‌తో 20 ఇంచెస్ 5-స్పోక్ వీల్స్‌తో ఆల్-బ్లాక్ థీమ్‌తో వస్తుంది. ఇది మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి శాంటోరిని బ్లాక్, ఇగర్ గ్రే మరియు ఫైరెంజ్ రెడ్ కలర్స్.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

జాగ్వార్ ఎఫ్- టైప్ ఆర్- డైనమిక్ బ్లాక్ మోడల్ ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రపంచ మార్కెట్ కోసం ప్రారంభించింది. భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ మోడల్ 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 ఇంజిన్‌తో పనిచేస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

ఇందులోని 5.0 లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 ఇంజిన్‌ 444 బిహెచ్‌పి పవర్ మరియు 580 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్సన్స్ కలిగి ఉండి, 8-స్పీడ్ 'క్విక్ షిఫ్ట్' ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. కావున వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

కొత్త జాగ్వార్ కార్ కేవలం 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంద కంపెనీ పేర్కొంది. అంతే కాకూండా దీని గరిష్ట వేగం గంటకు 285 కిలోమీటర్లు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ 'రోహిత్ సూరి' దీని గురించి మాట్లాడుతూ, "ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ ప్రవేశపెట్టడంతో ఎంతోమంది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఇప్పుడు ఉన్నదానికంటే భిన్నంగా ఉంటుంది మరియు నిజమైన స్పోర్ట్స్ కార్ ప్రియులను మరింత సొంతోషాన్ని అందిస్తుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

జాగ్వార్ ఎఫ్- టైప్ ఆర్- డైనమిక్ బ్లాక్ మోడల్ లోపలి భాగంలో డ్రైవర్-సెంట్రిక్ '1 + 1' క్యాబిన్‌ను పొందుతుంది. వాహనం స్లిమ్ లైన్ పర్ఫామెన్స్ సీట్ల కోసం 12 వే అడ్జస్టబుల్ కంట్రోల్ కలిగి ఉంటుంది. క్యాబిన్ అధునాత లక్షణాలతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

జాగ్వార్ ఎఫ్-టైప్ ఆర్-డైనమిక్ బ్లాక్ మోడల్ బుకింగ్స్ స్టార్ట్; వివరాలు

లోపలి భాగంలో లైట్ ఓయిస్టర్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో ఎబోనీ సెలెక్ట్ విండ్సర్ లెదర్‌తో సీట్లు అందించబడతాయి. మరింత స్పోర్టినెస్ కోసం ఫ్లేమ్ రెడ్ స్టిచ్చింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సీట్లపై మోనోగ్రామ్ స్టిచ్ ప్యాట్రిన్ వంటి మార్పులు కూడా ఇందులో గమనించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
New Jaguar F-Type R-Dynamic Black model Bookings Open. Read in Telugu.
Story first published: Monday, August 2, 2021, 16:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X