పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Jeep (జీప్) ఈ సంవత్సరం మార్చి నెలలో తన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ అయిన Jeep Wrangler (జీప్ వ్రాంగ్లర్‌) ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త జీప్ వ్రాంగ్లర్‌ ధర రూ. 53.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

అయితే కంపెనీ ఈ కొత్త జీప్ బ్రాండ్ అయిన Wrangler ధరను పండుగా సీజన్లో పెంచినట్లు తెలిపింది. కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు విడుదల సమయంలో వరుసగా రూ. 53.90 లక్షలు మరియు రూ. 57.90 లక్షలు.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

ప్రస్తుతం కంపెనీ వీటి ధరలను పెంచిన తరువాత జీప్ వ్రాంగ్లర్‌ అన్‌లిమిటెడ్ ధర రూ. 55.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, జీప్ వ్రాంగ్లర్‌ రూబికాన్ వేరియంట్ ధర రూ .59.15 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ధరల పెరుగుదల తరువాత కూడా కంపెనీ వీటిని భారత మార్కెట్ కోసం కంప్లీట్ బిల్డ్ యూనిట్ ద్వారా దిగుమతి చేసుకుంటుంది.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా, ప్రస్తుతం మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీని ఉత్పత్తి సుసున్నారు చేస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఈ మోడల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది అన్ని ప్రధాన రైట్-హ్యాండ్ డ్రైవ్ గ్లోబల్ మార్కెట్లకు ఉత్పత్తి మరియు ఎగుమతి కేంద్రంగా ఉంది.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

కొత్త జీప్ వ్రాంగ్లర్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ సెవన్ స్లాట్ గ్రిల్, డ్రాప్ డౌన్ విండ్‌షీల్డ్, రిమూవబుల్ డోర్లు మరియు రూఫ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 5-డోర్ వెర్షన్ జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ. దీని ఐకానికి డిజైన్ మరియు ఫీచర్లు ఇంటర్నేషనల్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ సిస్టమ్ మరియు స్టీరియో సిస్టమ్ వంటివి ఉన్నాయి. వ్రాంగ్లర్ ఎస్‌యూవీ అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్ధ్యాలకు ప్రసిద్ది చెందినది. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ (217 మిమీ) మరియు వాటర్ వేడింగ్ (760 మిమీ) సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

ఈ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 268 బిహెచ్‌పి పవర్‌ను 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా దీనికి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది, కావున మంచి సామర్త్యాన్ని అందిస్తుంది.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

కొత్త జీప్ వ్రాంగ్లర్‌కి కంపెనీ యాక్ససరీస్ కూడా అందించింది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్ప్లాష్ గార్డ్స్, మ్యాట్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, సైడ్ విండో ఎయిర్ డిఫ్లెక్టర్, ఫ్రంట్ ఎయిర్ డిఫ్లెక్టర్, బ్లాక్ అండ్ క్రోమ్ సైడ్ స్టెప్, విండ్‌షీల్డ్ టై-డౌన్ స్ట్రాప్స్, రూఫ్ రాక్ మరియు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

ఇవే మాత్రమే కాకుండా, లంబార్ కుషన్, నెక్ రెస్ట్, కార్ పెర్ఫ్యూమ్స్, టిష్యూ బాక్సులు వంటివి కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న యాక్ససరీలను మాత్రమే కాకుండా, కంపెనీ తమ వ్రాంగ్లర్ కోసం ఎక్స్‌ప్లోరర్, నైట్ అల్ట్రా విజన్, స్పోర్ట్స్ మరియు ఎస్సెన్షియల్స్ అనే నాలుగు ప్రత్యేకమైన యాక్సెసరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా వాహనానికి అద్భుతమైన మరియు దూకుడు రోపాన్ని కలిగిస్తాయి.

పండుగ సీజన్లో భారీగా పెరిగిన Jeep Wrangler ధరలు: పూర్తి వివరాలు

వ్రాంగ్లర్‌ SUV ఆఫ్ రోడింగ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. Jeep Wrangler (జీప్ వ్రాంగ్లర్‌) అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉండటం మాత్రమే కాకుండా, మంచి సేఫ్టీ ఫీచర్స్ వంటివి కూడా కలియు ఉంటుంది, అంటే కాకుండా ఇది ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఎక్కువ మంది ఆఫ్ రోడ్ ప్రేమికులు ఈ SUV కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే భారతదేశంలో పండుగ సీజన్లో కంపెనీ దీనిపై ధరలను పెంచడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ప్రభావం చూపుతుందో త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep wrangler suv price hiked up to rs 1 25 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X