పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'కియా సెల్టోస్'లో కంపెనీ ఓ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త కియా సోనెట్ త్వరలోనే పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో రానుంది.

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కియా సెల్టోస్ స్టాండర్డ్ సన్‌రూఫ్‌తో మాత్రమే లభిస్తుంది. పానోరమిక్ సన్‌రూఫ్ స్టాండర్డ్ సన్‌రూఫ్ కన్నా పెద్దదిగా, విశాలంగా ఉంటుంది. పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కియా సెల్టోస్ ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

ఈ విభాగంలో కియా సెల్టోస్‌కి పోటీగా లభిస్తున్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ విభాగంలో అమ్ముడవుతున్న చాలా మోడళ్లలో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో, కియా మోటార్స్ కూడా తమ సెల్టోస్‌లో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

కియా మోటార్స్ తమ సెల్టోస్ ఎస్‌యూవీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, ఎమ్‌జి హెక్టర్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

గత ఏడాది సెప్టెంబర్‌లో కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభించిన తర్వాత కంపెనీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. అయితే, ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చిన కొత్త తరం 2021 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారణంగా, కియా సెల్టోస్ అమ్మకాలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

ఈ పరిస్థితుల్లో పోటీని గట్టిగా ఎదుర్కునేందుకు కియా మోటార్స్ తమ సెల్టోస్‌కి చిన్నపాటి డిజైన్ అప్‌డేట్స్ ఇవ్వాలని చూస్తోంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ద్వారా తిరిగి ఈ మోడల్ అమ్మకాలను మెరుగుపరచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్, హెడ్‌లైట్, టెయిల్ లైట్, ఫ్రంట్ మరియు రియర్ బంపర్లను కంపెనీ స్వల్పంగా రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పాటుగా, కంపెనీ ఇందులో కొన్ని కొత్త వేరియంట్‌లను కూడా ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

అలాగే, కియా మోటార్స్ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త లోగోని కూడా ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ సెల్టోస్ కారుపై చూడొచ్చు. ఇందులో వేరియంట్ ప్రకారం మార్పులను చేయటంతో పాటుగా కొత్త కలర్ ఆప్షన్లను మరియు కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్‌లను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంటీయర్ అప్‌డేట్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇందులో కొత్తగా 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఆశించవచ్చు. ఇతర ఫీచర్లలో లేన్ చేంజ్ అసిస్ట్ కెమెరా, కనెక్టింగ్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్స్ మరియు హెడ్స్ అప్ డిస్‌ప్లే మొదలైనవి ఉండొచ్చు.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

పానోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్‌తో రానున్న కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ!

ఇందులో కొత్తగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కొత్త సెల్టోస్‌కు చేర్చవచ్చు. అధనపు అప్‌డేట్స్ మరియు ఫీచర్లతో రానున్న కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి కన్నా ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kia Seltos To Get Panoramic Sunroof With New Updates, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X