లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తన హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్‌ను ఎట్టకేలకు భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 3.54 కోట్లు. లంబోర్గినీ బ్రాండ్ నుంచి అమ్ముడైన మోడల్ ఈ హురాకాన్. ఇప్పటివరకు ఇది చాలా వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో ఎక్కువ భాగం ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తాయి.

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

మార్కెట్లో ఉన్న రియర్-వీల్-డ్రైవ్ అభిమానుల కోసం, కంపెనీ హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్‌ను విడుదల చేసింది. ఇది మొదట ఇది 2020 లో అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఇప్పటికి ఇది భారతదేశంలో అడుగుపెట్టింది. ఇటీవల కాలంలోనే బ్రాండ్ యొక్క మోడల్స్ లో ఒకటి ముంబైలోని డీలర్‌షిప్‌లో కనిపించింది. దీనిని ముంబైకి చెందిన ఒక కస్టమర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

కొత్త హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్‌ సిగ్నేచర్ డిఆర్ఎల్ తో లేజర్ ఎల్ఈడీ హెడ్‌లైట్ కలిగి ఉంది. ఈ సూపర్ కార్ కొత్త ఫ్రంట్ స్ప్లిటర్ మరియు వర్టికల్ ఫిన్స్ తో పెద్ద ఎయిర్ డ్యామ్‌ను పొందుతుంది. ఇక్కడ డీలర్‌షిప్‌లో కనిపించిన ఈ కార్ బ్లూ సైడెరిస్ కలర్ ఆప్షన్‌ లో ఉంది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

ఈ కొత్త సూపర్ కార్ లో 5 స్పోక్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో జతచేయబడుతుంది. బ్రేక్ కాలిపర్స్ రెడ్ కలర్ లో ఉంది. ఈ సూపర్ కార్ కి ఇరువైపులా డోర్స్ వెనుక పెద్ద ఎయిర్ డక్ట్స్ కలిగి ఉంటుంది. ఇది రేడియేటర్లకు గాలిని నిర్దేశిస్తుంది. దీని వల్ల పెద్ద వి10 ఇంజిన్‌ చల్లబడుతుంది.

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

రియర్ బంపర్‌పై కొత్త డిఫ్యూజర్‌ను పొందుతుంది. ఇది కేవలం హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్‌లో మాత్రమే కనిపిస్తుంది. కొత్త సూపర్‌స్పోర్ట్ ఎగ్జాస్ట్ చాలా బాగుంది మరియు మంచి ధ్వనిని కూడా అందిస్తుంది. స్పైడర్ యొక్క మృదువైన రూప్ ని కేవలం 17 సెకన్లలో ఓపెన్ చేయవచ్చు. అంతే కాదు ఇది 50 కి.మీ వేగంలో ఉన్నప్పుడు కూడా ఓపెన్ చేయవచ్చు.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

లంబోర్ఘిని హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్ లోపల 8.4 ఇంచెస్ హెచ్‌ఎంఐ టచ్‌స్క్రీన్ ఉంది. ఇది టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఆపిల్ కార్ప్లే కోసం కనెక్టివిటీని వంటివి అందిస్తుంది. ఇందులో ఉన్న సీట్లు బ్లాక్ కలర్ ఉండి రెడ్ స్టిచ్చింగ్ కలిగి ఉంటుంది. ఇందులో కస్టమర్ కావలసిన ఎక్స్టీరియర్ కలర్ ఎంచుకోవచ్చు. ఇందులో 300 డిఫరెంట్ కలర్స్ అందుబాటులో ఉంటాయి.

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

లంబోర్ఘిని హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 602 బిహెచ్‌పి శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 560 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 324 కిమీ వరకు ఉంటుంది.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

ఈ కారు ముందు మరియు వెనుక భాగంలో 40/60 వైట్ డిస్ట్రిబ్యూషన్ పొందుతుంది. హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పిరెల్లి పి జీరో టైర్లను పొందుతుంది. అయితే, కంపెనీ 20 ఇంచెస్ రిమ్స్ మరియు కార్బన్-సిరామిక్ బ్రేక్‌లను అప్షనల్ గా అందిస్తుంది. లంబోర్ఘిని హురాకాన్ ఎవో రియర్-వీల్-డ్రైవ్ స్పైడర్‌ ఫస్ట్ లుక్ రివ్యూ గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Lamborghini Huracan Evo RWD Spyder Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X