భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర రూ. 4.99 కోట్లు

లంబోర్ఘిని తన హురాకాన్ ఎస్‌టీఓ కారుని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ.4.99 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఎస్‌టీఓ అంటే 'సూపర్ ట్రోఫియో ఓమోలోగాటా'. అంటే ఇది హురాకాన్ సూపర్ ట్రోఫియో ట్రాక్-ఓన్లీ కారు యొక్క స్ట్రీట్ హోమోలాగేటెడ్ వెర్షన్. ఈ కొత్త కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

కొత్త లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ 5.2 లీటర్ వి10 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది దాదాపు స్టాండర్డ్ హురాకాన్ మాదిరిగానే ఉంటుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఎల్‌డిఎఫ్ (లంబోర్ఘిని డోపియా ఫ్రిజియోన్) గేర్‌బాక్స్ ద్వారా శక్తిని వెనుక చక్రాలకు పంపుతుంది. ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 630 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 565 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

కొత్త హురాకాన్ ఎస్‌టీఓ యొక్క టాప్ స్పీడ్ గంటకు 310 కిమీ వరకు ఉంటుంది. అంతే కాకుండా ఇది మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి ఎస్‌టీఓ (రోడ్), ట్రోఫియో (ట్రాక్), & పియోగ్గియా (రైన్) మోడ్స్.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

లంబోర్ఘిని కంపెనీ తన హురాకాన్ ఎస్‌టీఓను ఆర్ అండ్ డి, స్క్వాడ్రా కోర్స్ మరియు సెంట్రో స్టైల్ విభాగాలను సంయుక్తంగా అభివృద్ధి చేసి తయారుచేయబడింది. దీని ఫలితంగా ఇది చాలా ఏరోడైనమిక్స్ గా ఉండటమే కాకుండా వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

కొత్త హురాకాన్ ఎస్‌టీఓ యొక్క హుడ్, ఫెండర్లు మరియు బంపర్ మొత్తం సింగల్ పీస్ లో తయారుచేయబడింది. ఈ కారణంగానే ఇది చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 43 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. దీనితో పాటు బోనెట్ మొత్తం కొత్త ఎయిర్ డక్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ ఇంజిన్ను చల్లబరచడానికి ఉపయోగపడుతుంది.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

ఫ్రంట్ బంపర్‌కు కొత్త స్ప్లిటర్ కూడా లభిస్తుంది. ఎస్‌టీఓ యొక్క వెనుకభాగంలో రియర్ ఫెండర్‌ ఉంటుంది. ఇది ఇంజిన్ కోసం ఎన్ఏసిఏ ఎయిర్ ఇంటేక్ కలిగి ఉంటుంది. అడిషినల్ డౌన్‌ఫోర్స్‌ను అందించడానికి అవి అడ్జస్ట్ చేస్తాయి.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ యొక్క లోపలి భాగం ఎక్కువగా అల్కాంటారాలో పూర్తయింది. అంతే కాకుండా ఇది డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం స్పోర్టి బకెట్ సీట్లను కలిగి ఉంటుంది. ఈ సూపర్ కార్ బరువును తగ్గించడానికి ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో క్లైమెంట్ కంట్రోల్, పెద్ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్లు, అల్యూమినియం స్విచ్‌లు మరియు సెంటర్ కన్సోల్‌లో STO బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

హురాకాన్ ఎస్‌టీఓ హైబ్రిడ్ అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్ చాసిస్ ఉపయోగిస్తుంది. సూపర్ కార్ యొక్క మొత్తం బరువు దాదాపు 1,339 కేజీల వరకు ఉంటుంది. ఇందులోని సస్పెన్షన్ విధులను అన్ని చివర్లలో మాగ్నెటో-రియోలాజికల్ యూనిట్లు నిర్వహిస్తాయి.

భారత్‌లో విడుదలైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్‌టీఓ; ధర & వివరాలు

హురాకాన్ ఎస్‌టీఓ ముందుభాగంలో సెక్షన్ 245/30 మరియు వెనుక భాగంలో 305/30 బ్రిడ్జ్‌స్టోన్ పోటెంజా స్పోర్ట్ టైర్లతో 20 ఇంచెస్ కార్బన్ ఫైబర్ వీల్స్‌ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ముందుభాగంలో సిసిఎమ్-ఆర్ 390 మిమీ మరియు వెనుక భాగంలో 360 మిమీ కార్బన్-సిరామిక్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఈ బ్రేక్ హురాకాన్ STO ను గంటకు 100 కిమీ వేగంలో ఉన్నప్పుడు కేవలం 30 మీటర్లలో ఆపగలదు.

Most Read Articles

English summary
Lamborghini Huracan STO Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 15, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X