అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

క్లాసిక్ కార్లకు ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లేటెస్ట్ మరియు ఫాస్టెస్ట్ కార్లకు ఆజ్యం పోసింది అలనాటి క్లాసిక్ కార్లే. యాభైళ్ల క్రితమే లాంబోర్ఘిని గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారును తయారు చేసి, అందరిచేత ఔరా అనిపించుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ అయిన లాంబోర్ఘిని ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్భుతమైన కారు 1971లో తయారు చేసింది. దీని పేరు లాంబోర్ఘిని మియురా ఎస్‌వి. దీని పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఎస్‌వి అంటే సూపర్ వెలోస్ అని అర్థం. ఇటాలియన్ భాషలో వెలోస్ అంటే వేగం (ఫాస్ట్) అని అర్థం.

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

లాంబోర్ఘిని మియురా ఎస్‌వి (సూపర్ ఫాస్ట్) పేరుకు తగినట్లుగానే అప్పట్లో అత్యంత వేగవంతమైన స్పోర్ట్స్ కారు. ఈ కారు గరిష్టంగా గంటకు 290 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అప్పట్లో ఈ కారు కేవలం 24 సెకన్లలోనే 1 కిలోమీటరు దూరం ప్రయాణించి అరుదైన రికార్డు కూడా నెలకొల్పింది.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

లాంబోర్ఘిని ఈ సూపర్ కారు ఉత్పత్తిని ప్రారంభించి నేటికి అర్థ శతాబ్ధం (50 సంవత్సరాలు) పూర్తయ్యింది. లాంబోర్ఘిని కంపెనీ యొక్క పి400 ప్రాజెక్టులో భాగంగా చివరిగా వచ్చిన మోడలే ఈ మియురా ఎస్‌వి. ఈ కారును మొట్టమొదటి సారిగా మార్చి 1971లో జెనీవా మోటార్ షోలో లాంబోర్ఘిని ఆవిష్కరించింది.

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

కస్టమర్లు ఎక్కువగా ఎంచుకున్న లాంబోర్ఘిని కార్లలో మియురా ఎస్‌వి ఒకటి. ఆ సమయంలో లాంబోర్ఘిని యొక్క చీఫ్ ఇంజనీర్లు మరియు మియురా, మియురా ఎస్ కార్ల సృష్టికర్తలు అయిన గియాంపాలో డల్లారా మరియు పాలో స్టాన్జాని లు మియురా యొక్క ఎస్‌వి వెర్షన్ కూడా ఉత్పత్తి చేశారు. మియురా మరియు మియురా ఎస్ కార్లు దాదాపు ఐదేళ్లుగా ఉత్పత్తిలో ఉన్నాయి.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

స్టైల్ మరియు సాంకేతిక పరంగా ఇతర మియురా (పి400 మరియు పి400ఎస్) కార్లతో పోలిస్తే మియురా ఎస్‌వి చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో (మియురా ఎస్‌విలో) ఉపయోగించిన 4-లీటర్ 12-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 385 హార్స్ పవర్‌ను మరియు 40.7 కిలోగ్రాముల టార్క్‌ని ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ వెనుక వైపు, కారు మధ్య భాగంలో అమర్చబడి ఉండేది.

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

మియురా ఎస్‌విని ధృడమైన ఛాస్సిస్, విభిన్నమైన యాంకర్ పాయింట్స్ మరియు చేతులతో సవరించిన వెనుక సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇతర మియురా కార్లతో పోలిస్తే, దీని చక్రాల మధ్య దూరం 130 మిమీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారులో ముందు మరియు వెనుక వేర్వేరు సైజులతో కూడిన టైర్లు ఉంటాయి. వెనుక చక్రాలు 7 నుండి 9 అంగుళాలకు పెరిగాయి మరియు వాటిపై 255-సెక్షన్ టైర్లను అమర్చారు.

MOST READ:మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

ఈ కారులోని రిమ్స్ డిజైన్‌ను కూడా సవరించారు. ఈ చక్రాలను మరింత స్పోర్టియర్‌గా, లగ్జరీకా కనిపించేందుకు వీలుగా వాటిని బంగారు రంగు పూతతో డిజైన్ చేశారు. మియురా ఎస్‌వి కారు యొక్క రూపాన్ని కూడా ఇతర మియురా కార్ల మాదిరిగా కాకుండా, అందులోని సూపర్ ఫాస్ట్ ఇంజన్ భాగాలకు సరిపోయే విధంగా కొద్దిగా సవరించారు.

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

లాంబోర్ఘిని మియురా ఎస్‌వి కారు వెనుక భాగం ఇతర మియురా కార్ల కన్నా కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. మియురా ఎస్‌వి యొక్క ప్రధాన లక్షణాలలో ఇది కూడా ఒకటి. అదేవిధంగా, ఈ కారులో విభిన్నంగా డిజైన్ చేసిన రియర్ హెడ్‌లైట్లు, విశాలమైన రియర్ ఫెండర్లు, కొత్త ఎయిర్ ఇన్‌టేక్‌తో డిజైన్ చేసిన ఫ్రంట్ బానెట్ వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి.

MOST READ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

అర్థశతాబ్ధపు అద్భుతమైన స్పోర్ట్స్ కార్; 24 సెకన్లలోనే 1 కిలోమీటర్ దూరం..

లాంబోర్ఘిని మియురా ఎస్‌వి ఉత్పత్తిని కంపెనీ కేవలం 150 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. గత 1971లో ప్రారంభమైన ఈ కారు 1973లోనే నిలిచిపోయింది. అయితే, రెండు సంవత్సరాల తరువాత, 1975లో, వాల్టర్ వోల్ఫ్ కోసం ఇందులో తుది మోడల్ (151వ కారు)ను తయారు చేశారు. ఇప్పుడు అది మడ్‌టెక్ వద్ద, శాంట్ అగాటా బోలోగ్నీస్‌లోని లాంబోర్ఘిని మ్యూజియంలో ఉంది.

Most Read Articles

English summary
Lamborghini Miura SV Turns 50, The Last Iteration Of Company's P400 Project. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X