కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) తమ ఐదవ తరం 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (2022 Land Rover Range Rover) ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని కొత్త స్టైల్ మరియు కొత్త ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలో కొత్త డిజైన్ మరియు కొత్త ఇంజన్ ఆప్షన్లే కాకుండా, కంపెనీ ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను కూడా జోడించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ 2022 రేంజ్ రోవర్ కారును తమ కొత్త ఎమ్ఎల్ఏ ఫ్లెక్స్ (MLA Flex) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ల్యాండ్ రోవర్ ఈ కొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించడంతో పాటుగా, తమ ఈవీ ప్లాన్స్ గురించి కూడా కంపెనీ వెల్లడి చేసింది. కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ రాబోయే రెండేళ్లలో ప్రత్యేక ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ ను కూడా పొందుతుందని కంపెనీ ధృవీకరించింది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ఈ కొత్త మోడల్ రెండు వేర్వేరు వీల్‌బేస్ మోడల్‌లు, ఐదు ఇంజన్ ఆప్షన్‌ లు మరియు 4-సీటర్ నుండి 7-సీటర్ కాన్ఫిగరేషన్లతో అందుబాటులోకి రానుంది. కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మోడల్ కంపెనీ ఇప్పటికే అందిస్తున్న విస్తృతమైన లైనప్‌ ను పూర్తి చేస్తుందిని భావిస్తున్నారు.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ఈ సందర్భంగా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈఓ థియరీ బొల్లోర్ (Thierry Bollore) మాట్లాడుతూ, "కొత్త 2022 రేంజ్ రోవర్ అనేది అత్యంత వివేచనగల కస్టమర్ల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ లగ్జరీ వాహనాలను రూపొందించాలనే మా దృష్టికి గొప్ప వ్యక్తీకరణగా ఉంటుంది. ఇది 50 సంవత్సరాలకు పైగా రేంజ్ రోవర్ హాల్‌మార్క్‌గా ఉన్న మార్గదర్శక ఆవిష్కరణ యొక్క ప్రత్యేకమైన కథలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుంది" అని ఆయన చెప్పారు.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ గురించి చెప్పాలంటే, దీని పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంచబడింది మరియు వీల్‌బేస్ కూడా కూడా మునుపటి కన్నా పొడవుగా ఉంటుంది. ఇందులో లాంగ్ వీల్‌బేస్ వెర్షన్ పొడవు 5.25 మీటర్లు, వెడల్పు 2.20 మీటర్లు, ఎత్తు 1.87 మీటర్లు మరియు వీల్‌బేస్ 3.19 మీటర్లుగా ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ యొక్క వీల్‌బేస్ 3 మీటర్లుగా ఉంటుంది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ల్యాండ్ రోవర్ ఈ కొత్త కారును SE, HSE మరియు Autobiography అనే మూడు ట్రిమ్‌లలో అందించనుంది. ఈ ఐకానిక్ రేంజ్ రోవర్ యొక్క ఐదవ తరం మోడల్ లో కంపెనీ దాని డిజైన్ లో కొన్ని ప్రధానమైన మార్పులు చేసింది. ఇది మూడు పంక్తుల ద్వారా వర్గీకరించబడుతుంది మరియు మొత్తం ఐదు తరాల ద్వారా దాని మూలాన్ని గుర్తించబడుతుంది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో కొత్త గ్రిల్ డిజైన్, సన్నటి L-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, క్రోమ్ స్ట్రైప్స్ తో కూడిన లోవర్ గ్రిల్, పియానో బ్లాక్ ఫినిష్ తో కూడిన సైడ్ మిర్రర్స్, పెద్ద అల్లాయ్ వీల్స్ మరియు లో ప్రొఫైల్ టైర్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, వెనుక వైపు రెండు షార్క్ ఫిన్ యాంటెన్నాలు మరియు బూట్ డోరుపై బ్లాక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

ఇది ఇంటిగ్రేటెడ్ హజార్డ్ డిటెక్షన్ మరియు యాంటీ-పించ్ ఫంక్షన్‌తో కూడిన పవర్-అసిస్టెడ్ డోర్‌లతో వచ్చిన మొదటి ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ. ఈ కారులోని అన్ని 4 డోర్లకు ఎలక్ట్రికల్ అసిస్ట్ ఫీచర్ ఇవ్వబడింది. అలాగే, ఈ డోర్లను కారు లోపల ఉన్న పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

అంతేకాకుండా, ఈ కారులో కొత్త 13.1 ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 13.7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, లేటెస్ట్ పివి ప్రో సాఫ్ట్‌వేర్ యొక్క తాజా వెర్షన్‌, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫుల్లీ డిజిటల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

కొత్త 2022 రేంజ్ రోవర్ 6-సిలిండర్ మరియు 8-సిలిండర్ ఇంజన్‌ల శ్రేణితో అందించబడుతుంది. ముఖ్యంగా, ఈ కారులో రెండు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్లు P440e మరియు P510e, మూడు పెట్రోల్ ఇంజన్లు (P360, P400 మరియు P530) మరియు మూడు డీజిల్ (D250, D300, D350) ఇంజన్లు అందించబడ్డాయి. ఇందులో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 Range Rover ఆవిష్కరణ; త్వరలోనే విడుదల - ఫీచర్లు

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ వి8 విడుదల..

ఇదిలా ఉంటే, గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ తమ కొత్త 2021 ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ వి8 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ. 1.90 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. డిఫెండర్‌ వి8 ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Land rover unveils new 2022 range rover with new engine design and features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X