తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

సాధారణంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు కారు యొక్క స్థితి, అది తిరిగిన కిలోమీటర్లు, ఇంజన్ పనితీరు, ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అయితే, వీటిన్నంటిన్నా ముఖ్యమైనవి ఏంటంటే, అది ఏ బ్రాండ్ కు చెందిన కారు, మార్కెట్లో ఇంకా లభిస్తోందా లేదా డిస్‌కంటిన్యూ అయిందా, డిస్‌కంటిన్యూ అయితే స్పేర్ పార్ట్స్ పరిస్థితి ఏంటి వంటి కీలక అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

ప్రస్తుతం, మనదేశంలో కొత్త వాహనాలతో సమానంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కూడా అమ్ముడవుతున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత ప్రజలు వ్యక్తిగత రవాణకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో, దేశంలో కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రత్యేకించి, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కార్ల అమ్మకాలు మరియు కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

తక్కువ ధర మరియు సులభమైన లభ్యత వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. రాబోయే కొన్నేళ్లలో ఈ డిమాండ్ 12 శాతం నుంచి 14 శాతానికి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మహీంద్రా మరియు మారుతి సుజుకి వంటి సంస్థలు కూడా ఈ సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారంలో ఉన్నాయి.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసే కార్లు తప్పనిసరిగా 50,000 కిలోమీటర్ల లోపు ప్రయాణించినవి అయి ఉండాలి. అలాగే, సింగిల్ ఓనర్ కలిగిన కార్లు అయి ఉండటం చాలా అవసరం. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తక్కువ ధరకే వస్తున్నాయని కదా ఏని ఏ కారు పడితే ఆ కారును కొనుగోలు చేయకూడదు. అలాంటి కొన్ని కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

టాటా అరియా (Tata Aria)

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గతంలో విక్రయించిన ఎమ్‌పివి టాటా ఆరియా. ఇది భారతదేశంలో 2010 నుండి 2017 కాలం వరకు అమ్మకానికి ఉన్న కార్ మోడల్. ఆ సమయంలోనే అత్యుత్తమ ఫీచర్లను మంచి ప్యాకేజీ రూపంలో తీసుకువచ్చిన కార్లలో ఇది కూడా ఒకటి. అయితే, ఆ సమయంలో టాటా కార్లపై కొనుగోలుదారుల్లో పెద్దగా విశ్వసనీయత ఉండేది కాదు. అందుకే, ఈ కారు భారత మార్కెట్లో విజయం సాధించలేకపోయింది.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

టాటా మోటార్స్ తమ ఆరియా కారును ఆధారంగా చేసుకొని హెక్సా అనే మరొక మోడల్ ను కూడా అనేక కొత్త ఫీచర్లతో పరిచయం చేసింది. అయినప్పటికీ, ఇది కూడా చాలా బలహీనమైన మోడల్‌గా ప్రదర్శించబడి, మార్కెట్ నుండి వెనుదిరిగింది. టాటా ఆరియా కేవలం ఏడేళ్ల కాలంలో మార్కెట్ నుండి తొలగించబడింది. అందుకే ఈ కారును ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి కొనుగోలు చేయకూడదు.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

మహీంద్రా టియూవీ300 ఏఎమ్‌టి (Mahindra TUV300 AMT)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి వచ్చిన TUV300 మరియు KUV100 రెండు ఎస్‌యూవీలు కూడా భారతదేశంలో పెద్దగా ఆదరణ పొందలేదని చెప్పవచ్చు. మహీంద్రా టియూవీ300 లో మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇది కస్టమర్లను ఆకర్షించలేకపోయింది. ఈ మోడల్ అమ్మకాలు తక్కువగా ఉండటంతో, కంపెనీ దీనిని మార్కెట్లో డిస్‌కంటిన్యూ చేసింది.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

అయితే, మహీంద్రా ఇటీవలే తమ టియూవీ300 మోడల్ ఆధారంగా చేసుకొని రూపొందించిన కొత్త బొలెరో నియో ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. వాస్తవానికి ఇది రీబ్యాడ్జ్ చేయబడిన టియూవీ300 గా చెప్పవచ్చు. కాగా, గతంలో టియూవీ300 ఏఎమ్‌టి మోడల్ ను కొనుగోలు చేసిన కస్టమర్లు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించబడింది. అందువల్ల, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ నుండి ఈ ఏఎమ్‌టి వెర్షన్ టియూవీ300 ని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

హోండా సిఆర్-వి (Honda CR-V)

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అందిస్తున్న అన్ని వాహనాలు కూడా చాలా దృఢంగా మరియు నమ్మకంగా ఉంటాయి. అయితే, ఈ బ్రాండ్ వాహనాల విషయంలో ఎదురయ్యే ఒకేఒక సమస్య సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్. హోండా ఇటీవలే భారత మార్కెట్ నుండి తమ పాపులర్ ఎస్‌యూవీ 'సిఆర్-వి' ని తొలగించి వేసింది. అయితే, ఈ కారు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

హోండా సిఆర్-వి తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, దీనికి మెయింటినెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది, ఇందులో డీజిల్ మోడల్ లేదు. అంతేకాకుండా, ఈ కారు విడిభాగాల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి ఈ కారును విస్మరించడమే మంచిది.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

షెవర్లే కాప్టివా (Chevrolet Captiva)

అమెరికన్ కార్ బ్రాండ్ జనరల్ మోటార్స్ కి చెందిన సబ్ బ్రాండ్ షెవర్లే, 2012 సమయంలో భారత మార్కెట్లో విక్రయించిన కారు షెవర్లే కాప్టివా. ప్రస్తుతం, ఈ కార్ బ్రాండ్ పూర్తిగా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అయినప్పటికీ, కొందరి వద్ద ఇంకా షెవర్లే కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, షెవర్లే కాప్టివా కారును మాత్రం సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి కొనుగోలు చేయడం కాస్తంత రిస్క్ తో కూడుకున్న పనే. ఇందుకు ప్రధాన కారణం దాని విడిభాగాల లభ్యతే.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

హోండా అకార్డ్ 3.5 లీ వి6 (Honda Accord 3.5L V6)

హోండా అకార్డ్ కారు 2008 నుండి 2013 వరకు భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. లగ్జరీ కార్లకు పోటీగా హోండా అందిస్తున్న కార్ మోడల్స్‌లో ఇది కూడా ఒకటి. దీని వి6 వేరియంట్ ను ఉపయోగించిన వినియోగదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కున్నారు. త్వరగా స్టార్ట్ కాకపోవడం, టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ లో సమస్యలు మరియు గేర్ నిష్పత్తిలో సమస్యలు మొదలైన వాటిని గుర్తించారు. కాబట్టి, సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి ఈ కారుకు దూరంగా ఉండటం మంచిది.

తక్కువకు వస్తున్నాయని తొందరపడి కొనకండి.. అసలు విషయం తెలుసుకోండి..!

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ (Mitsubishi Outlander)

జపనీస్ కార్ బ్రాండ్ మిత్సుబిషి విక్రియించిన పాపులర్ కార్ మోడల్ అవుట్‌ల్యాండర్. ఈ కారు 2008 నుండి 2013 వరకు భారత మార్కెట్లో విక్రయించబడింది. ఫియట్, షెవర్లే మరియు ఫోర్డ్ కంపెనీల మాదిరిగానే ఇది కూడా భారతదేశాన్ని విడిచిపెట్టిన కంపెనీలలో ఒకటి. విడిభాగాలు మరియు సర్వీస్ సమస్యల దృష్ట్యా ఈ కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుండి కొనకపోవడమే మంచిది.

Most Read Articles

English summary
List of cars you must avoid from second hand market
Story first published: Sunday, October 31, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X