మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

దేశంలో కరోనా విజృంభన తర్వాత, ప్రజలు ఇప్పుడు రద్దీగా ఉండే ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా, దేశంలో కార్ల వినియోగం భారీగా పెరిగింది. చాలా మందికి కార్ల మైలేజ్ విషయంలో అపోహలు, సందేహాలు ఉంటాయి. కార్ మైలేజ్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కార్ మైలేజ్ తగ్గడానికి గల కొన్ని ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

1. ఇంజన్‌లో సమస్యలు

లోపపూరితమైన ఇంజన్ కారణంగా కారు మైలేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. కారును ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం సర్వీస్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఇంజన్ అంటే, ఆరోగ్యకరమైన మైలేజ్ అని గుర్తుంచుకోండి.

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

2. నాసిరకం ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించడం

తక్కువ ధరకే లభిస్తుంది కదా అని నాసిరకం లేదా చవక బ్రాండ్ ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తే, ఇంజన్ పనితీరు దెబ్బతిని, దాని మైలేజ్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇంజన్ జీవితకాలం కూడా తగ్గిపోతుంది.

MOST READ:రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

3. ఎయిర్ కండిషన్‌ను తరచుగా వాడటం

ఎక్కువ పవర్ అంటే తక్కువ మైలేజ్ అని గుర్తుంచుకోండి. కారులో తరచూ ఎయిర్ కండిషన్‌ను ఉపయోగించడం వలన ఎక్కువ పవర్ వినియోగమై, కారు మైలేజ్ తగ్గుతుంది. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి, అవసరాన్ని బట్టి ఎయిర్ కండిషన్‌ను ఉపయోగించుకోవటం మంచిది.

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

4. మెయింటినెన్స్ లోపం

కారులో ఇంజన్ అనేది దాని గుండె లాంటిది. ఇంజన్ సరిగ్గా లేకపోతే, కారు పనితీరు కూడా సరిగ్గా ఉండదు. అందుకే క్రమం తప్పకుండా మెయింటినెన్స్ చేయించడం అవసరం. సర్వీసింగ్‌లో సుదీర్ఘ విరామం కూడా మైలేజీని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వెహికల్ మెయింటినెన్స్ విషయంలో అశ్రద్ధ వహించకండి.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

5. చెడు ఇంధనాన్ని ఉపయోగించడం

కారు నడవడానికి ఇంధనమే ప్రధాన మూలం. కారులో ఎల్లప్పుడూ మంచి ఇంధనాన్నే వినియోగించాలి. నమ్మకమైన పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని ఫిల్ చేయించుకోవాలి. కొన్ని బంకుల్లో వివిధ రకాల గ్రేడ్లలో ఇంధనాన్ని విక్రయిస్తుంటారు. తక్కువ రకం ఇంధనాన్ని వినియోగిస్తే, మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజన్‌లో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

6. అరిగిపోయిన టైర్లు

కారులోని టైర్లు కూడా మైలేజ్‌ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన టైర్లు అంటే ఆరోగ్యకరమైన మైలేజ్ అని గుర్తుంచుకోండి. అరిగిపోయిన లేదా తక్కువ గాలితో ఉన్న టైర్లను ఉపయోగించినా లేదా తయారుదారు పేర్కొన్న గ్రేడ్ కాకుండా వేరే విధంగా చక్రాలను మరియు టైర్లను మోడిఫై చేయించుకున్నా, సదరు వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి, టైర్ల విషయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించండి.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

7. తప్పు గేర్లలో కారును నడపడం

సాధారణంగా ఆటోమేటిక్ కార్ల కన్నా మ్యాన్యువల్ కార్ల మైలేజ్ అధికంగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, ఆటోమేటిక్ కార్లలో గేర్లను కారే స్వయంగా మార్చుకుంటే, మ్యాన్యువల్ కార్లలో గేర్లను మనం నడిపే రోడ్డు, స్పీడ్‌ను మనమే స్వయంగా మారుస్తాం కాబట్టి. కారును తక్కువ గేర్‌లో ఎక్కువ స్పీడ్‌తో లేదా ఎక్కువ గేర్‌లో తక్కువ స్పీడ్‌తో నడిపినప్పుడు అధిక ఇంధనం వినియోగం అవుతుంది. ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి, సరైన వేగానికి సరైన గేరును వినియోగించడం ఎంతో అవసరం.

మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

8. ఓవర్‌లోడ్ చేయడం

కారులో అనవసరమైన లగేజ్ కారణంగా కానీ లేదా సీటింగ్ కెపాసిటీకి మించి ఓవర్‌లోడ్ చేయటం వలన కానీ మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, కారులో అనవసరమైన లగేజ్‌ను ఇంటిలోనే ఉంచి ప్రయాణాలు ప్రారంభించడం మంచిది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

Most Read Articles

English summary
Low Car Mileage? These Might Be The Reasons, Take A look. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X