మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, 122 యూనిట్లతో కూడిన కైగర్ బ్యాచ్‌ను పొరుగు దేశమైన నేపాల్‌కు రెనో ఇండియా ఎగుమతి చేసింది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

రెనో డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ సహాయంతో నేపాల్‌లో ఈ కార్లు రిటైల్ చేయబడతాయి. నేపాల్‌లో అత్యధికంగా రెనో కార్లను విక్రయిస్తున్న వైశాల్ గ్రూప్ ఈ కార్లను అక్కడి మార్కెట్లో విక్రయించనుంది. వైశాల్ గ్రూప్ నేపాల్‌లో 15 రెనో కార్ల సేల్స్ మరియు 13 సర్వీస్ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

సార్క్ దేశాలలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రెనో తెలిపింది. నేపాల్ తరువాత, ఇతర సార్క్ దేశాలలో తమ కార్లను విక్రయించాలని రెనో ప్లాన్ చేస్తోంది. రెనో కైగర్ విషయానికి వస్తే, ఇది 4 మీటర్ల కన్నా తక్కువ పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ. కంపెనీ దీనిని చెన్నై ప్లాంట్లో ఉత్పత్తి చేస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

భారత మార్కెట్లో రెనో కైగర్ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. రెనో-నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎమ్ఎఫ్ఏ+ ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును అభివృద్ధి చేశారు.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

రెనో కైగర్ ముందు భాగంలో ఎల్‌ఈడి హెడ్‌లైట్ సెటప్, క్రోమ్ హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్లాట్ బోనెట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో వెనుక వైపు వాలుగా ఉన్న పైకప్పును గమనిస్తే, ఈ ఎస్‌యూవీ కూప్ బాడీ టైప్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

అంతే కాకుండా, ఈ కారు అత్యధికంగా 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి, అన్ని రకాల రోడ్లకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకించి చిన్నపాటి ఆఫ్-రోడింగ్‌కు కూడా ఇది అనువుగా ఉంటుంది. రెనో కైగర్ రెండు పెట్రోల్ ఆంజన్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో (RXE, RXL, RXT & RXZ) విక్రయిస్తున్నారు.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

ఇంజన్ విషయానికి వస్తే, రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు నేపాల్ మార్కెట్‌లో కూడా లభ్యం!

ఇదిలా ఉంటే, రెనో ఇండియా ఇటీవలే తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ జులై నెలలో రూ.65,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. - ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Made In India Renault Kiger Now Available In Nepal Market, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X