Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్
మహీంద్రా థార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ థార్ ధరలను భారీగా పెంచింది. వేరియంట్‌ను బట్టి కొత్త మహీంద్రా థార్ ధరలు రూ.20,000 నుండి రూ.40,000 మేర పెరిగాయి.

ప్రస్తుతం మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మూడు రకాల టాప్ ఆప్షన్స్ (ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్స్)లో అందుబాటులో ఉంది.

తాజా ధరల పెంపు తర్వాత మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ.12.10 లక్షలకు పెరిగింది. గత నెలలో ఇది రూ.11.90 లక్షలుగా ఉండేది. అప్పటితో పోల్చుకుంటే ఈ వేరియంట్ ధర రూ.20,000 పెరిగింది.
MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

కాగా, మహీంద్రా థార్ టాప్-ఎండ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.40,000 మేర పెరిగి రూ.14.15 లక్షలకు చేరుకుంది. గతంలో దీని ధర రూ.13.75 లక్షలుగా ఉండేది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అప్‌డేట్ చేయబడిన మహీంద్రా థార్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి:
Variant | New Price | Old Price |
AX (O) Petrol MT CT | Rs12,10,337 | Rs11,90,000 |
AX (O) Diesel MT CT | Rs12,30,337 | Rs12,10,000 |
AX (O) Diesel MT HT | Rs12,40,337 | Rs12,20,000 |
LX Petrol MT HT | Rs12,79,337 | Rs12,49,000 |
LX Diesel MT CT | Rs13,15,336 | Rs12,85,000 |
LX Diesel MT HT | Rs13,25,337 | Rs12,95,000 |
LX Petrol AT CT | Rs13,85,337 | Rs13,45,000 |
LX Petrol AT HT | Rs13,95,336 | Rs13,55,000 |
LX Diesel AT CT | Rs14,05,336 | Rs13,65,000 |
LX Diesel AT HT | Rs14,15,338 | Rs13,75,000 |
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).
CT: కన్వర్టిబుల్ టాప్ & HT: హార్డ్ టాప్

కొత్త మహీంద్రా థార్‌లో ధరల పెరుగుదల మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. గతేడాది మార్కెట్లో విడుదలైన కొత్త తరం థార్, కొత్త సంవత్సరంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా కొనసాగుతోంది. స్టైలిషన్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ మరియు పవప్‌ఫుల్ ఇంజన్స్‌తో వచ్చిన ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ ఇప్పుడు అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

మహీంద్రా థార్ ఎస్‌యూవీలోని ఎల్ఎక్స్ వేరియంట్ ప్రీమియం లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండి, సిటీ ప్రయాణాలకు, రెగ్యులర్ కమ్యూటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే, ఇందులోని ఏఎక్స్ వేరియంట్ ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ఔత్సాహికులను టార్గెట్ చేసేలా ఉంటుంది. అయినప్పటికీ, ఈ రెండు వేరియంట్లు అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

కొత్త మహీంద్రా థార్‌ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

ఇందులోని రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి. ఇవి రెండూ షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి.

ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో, కొత్త మహీంద్రా థార్ ఓవరాల్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. వయోజనుల సేఫ్టీ విషయంలో ఇది 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను సాధించగా, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్ల స్కోరును సాధించింది.