Just In
- 10 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 10 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
- 11 hrs ago
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!
- 11 hrs ago
కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!
- News
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న కన్నుమూత...
- Finance
అదిరిపోయే న్యూస్: రూ.45,766కు వచ్చిన బంగారం ధర, వెండి రూ.1600 డౌన్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా స్కార్పియో ఎస్3+ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోలో ఓ కొత్త వేరియంట్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా స్కార్పియో ఎస్3+ పేరుతో ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

ఇదివరకు మహీంద్రా అందించిన ఎంట్రీ లెవల్ స్కార్పియో ఎస్5 వేరియంట్‌కు దిగువన ఈ కొత్త ఎస్3+ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. మార్కెట్లో ఈ కొత్త మహీంద్రా స్కార్పియో ఎస్ 3+ వేరియంట్ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఎస్ 5 వేరియంట్ ధర కన్నా రూ.68,000 తక్కువగా ఉంటుంది. స్కార్పియో ఎస్5 వేరియంట్ ధర రూ.12.67 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త మహీంద్రా స్కార్పియో ఎస్ 3+ వేరియంట్‌ను ఆన్‌లైన్‌లో కానీ లేదా భారతదేశం అంతటా ఉన్న మహీంద్రా అధీకృత డీలర్‌షిప్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

భారతదేశంలో బిఎస్6 ఉద్ఘార నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత మహీంద్రా తమ స్కార్పియో ఎస్3 వేరియంట్‌ను నిలిపివేసింది. అయితే, మహీంద్రా ఇప్పుడు ఈ వేరియంట్‌ను మరింత సరసమైన ప్రారంభ ధరతో తిరిగి మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

స్కార్పియో ఎస్5 వేరియంట్లో లభించే చాలా ఫీచర్లు, పరికరాలు ఈ కొత్త స్కార్పియో ఎస్ 3+ వేరియంట్లో కూడా లభ్యం కానున్నాయి. అయితే, ఈ ఎంట్రీ-లెవల్ వేరియంట్లో కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయి. వీటిలో సైడ్-స్టెప్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, వినైల్ సీట్ అప్‌హోలెస్టరీ మరియు ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లలో పెయింట్ చేయని బాడీ క్లాడింగ్ ఉన్నాయి.

ఇక స్కార్పియో ఎస్3+ వేరియంట్లలో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 17 ఇంచ్ స్టీల్ వీల్స్, మాన్యువల్ సెంట్రల్ లాకింగ్, టిల్ట్ అడ్జస్ట్ స్టీరింగ్, మాన్యువల్ హెచ్‌విఎసి, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా తమ స్కార్పియో ఎస్3+ వేరియంట్‌ను 7 సీట్లు లేదా 9 సీట్ల కాన్ఫిగరేషన్‌తో అందిస్తోంది. ఇందులో 7-సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో మరియు చివరి వరుసలో బెంచ్ సీట్ లభిస్తుంది. కాగా, 9 సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో బెంచ్ సీట్ మరియు చివరి వరుసలో సైడ్ ఫేసింగ్ బెంచ్ సీట్స్ లభిస్తాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త మహీంద్రా స్కార్పియో ఎస్3+ వేరియంట్ 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రియర్ వీల్-డ్రైవ్‌తో కూడిన ఈ వేరియంట్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కలర్ ఆప్షన్స్‌ను గమనిస్తే, ఈ ఎంట్రీ లెవల్ మహీంద్రా స్కార్పియో డైమండ్ వైట్, డిసాట్ సిల్వర్, మోల్టెన్ రెడ్ రేజ్ మరియు నాపోలి బ్లాక్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. దేశీయ ఎస్‌యూవీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మహీంద్రా మరింత సరసమైన స్కార్పియో వేరియంట్‌ను చేర్చింది. ఈ కొత్త వేరియంట్‌తో మహీంద్రా అమ్మకాలను మరింత మెరుగుపడుతాయని కంపెనీ ఆశిస్తోంది.